ఆంటోనీ కమిటీ వల్ల ఒరిగేదేమీ లేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆంటోనీ కమిటీ వల్ల ఒరిగేదేమీ లేదు

ఆంటోనీ కమిటీ వల్ల ఒరిగేదేమీ లేదు

Written By news on Monday, August 12, 2013 | 8/12/2013

ఆంటోనీ కమిటీ వల్ల ఒరిగేదేమీ లేదు: ఎంవీ మైసూరారెడ్డి
 ఎర్రగుంట్ల, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్ర ప్రాంతాల ప్రజలు తీవ్రంగా నష్టపోతారని, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 10 సీట్ల కోసం, రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి రాష్ట్రాన్ని చీల్చారని వైఎస్సార్ సీపీ కేంద్ర పాలకమండలి సభ్యుడు డాక్టర్ ఎంవీ మైసూరారెడ్డి ధ్వజమెత్తారు. సీమాంధ్ర ప్రజలు సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతం చేయడంతో ఆంటోనీ సారథ్యంలో వేసిన హైపవర్ కమిటీతో ఒరిగేదేమీ లేదన్నారు. వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలంలో ఆదివారం సాయంత్రం దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్సీ నారాయణరెడ్డితో కలసి సందర్శించారు. ఈ సందర్భంగా మైసూరా మాట్లాడుతూ రాష్ట్ర విభజన వల్ల నీటి కేటాయింపుల సమస్య తీవ్రంగా ఉంటుందన్నారు. డిగ్గీరాజా నోటికొచ్చిన విధంగా మాట్లాడుతున్నారని, ఆయన నోరు కంపుకొడుతోందని విమర్శించారు. సోనియా ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టిందన్నారు. తమిళనాడుకి చెందిన కేంద్ర మంత్రి చిదంబరం మన రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి కంకణం కట్టుకున్నారని ఆయన ఆరోపించారు.
Share this article :

0 comments: