తెలంగాణలో బలమైన శక్తిగా వైఎస్‌ఆర్ సీపీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తెలంగాణలో బలమైన శక్తిగా వైఎస్‌ఆర్ సీపీ

తెలంగాణలో బలమైన శక్తిగా వైఎస్‌ఆర్ సీపీ

Written By news on Friday, August 9, 2013 | 8/09/2013

 తెలంగాణ ఏర్పాటు అంశంపై వైఎస్‌ఆర్ సీపీ గతంలో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉందని పార్టీ రాష్ట్రనేతలు గట్టు రాంచందర్‌రావు, బాజిరెడ్డి గోవర్ధన్ పునరుద్ఘాటించారు. తెలంగాణలోని పది జిల్లాల్లో బలమైన శక్తిగా ఉందని స్పష్టంచేశారు. ప్రత్యేకరాష్ట్రం ఏర్పాటు పట్ల కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని ప్రకటించనందుకు మాత్రమే వైఎస్‌ఆర్ సీపీ ఎమ్యెల్యేలు పదవులకు రాజీనామాలు చేశారని గుర్తుచేశారు. గురువారం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లోగల పార్టీ కేంద్ర కార్యాలయంలో పాలమూరు జిల్లా నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..అన్ని ప్రాంతాల ప్రజలకు సమన్యాయం దక్కాలని పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పలుసార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారని అన్నారు.
 
 కాంగ్రెస్ పార్టీ సొంత లాభం కోసం ఏళ్లతరబడి సమస్యను జఠిలం చేసినందుకు ఇరుప్రాంతాల్లో అనవసరంగా విద్వేశాలు రగిలాయని వివరించారు. ఆయా ప్రాంతాల సామాన్య ప్రజలు రాష్ట్ర విభజనను కోరుకుంటున్నారని, తెలంగాణ ప్రాంతంలో కూడా పార్టీ శ్రేణులు ఉద్యమంలో చురుగ్గా పాల్గొందని గుర్తుచేశారు. కొంతమంది నేతలు సొంత ఎజెండాతో పార్టీని వీడారని, అంతమాత్రాన ఎలాంటి నష్టం జరగదని స్పష్టంచేశారు.
 
 గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్ కుటుంబం పట్ల ఆదరణ చెక్కుచెదరలేదని, రాష్ట్ర విభజన వల్ల పార్టీ శ్రేణులు ఎలాంటి ఆందోళనలకు గురికావద్దని సూచించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రముఖులు రామకృష్ణారెడ్డి, జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి, సీజీసీ, సీఈసీ సభ్యులు వంగూరు బాలమణెమ్మ, రావుల రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే స్వర్ణసుధాకర్‌రెడ్డి, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు సురేందర్‌రెడ్డి, బొబ్బిలి సుధాకర్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి, మల్లెపల్లి శ్రీనివాస్‌రెడ్డి, శివకుమార్‌రెడ్డి, బి.హర్షవర్ధన్‌రెడ్డి, రైతు, యువజన, వైద్య, విద్యార్థి విభాగాల జిల్లా కన్వీనర్లు విష్ణువర్ధన్‌రెడ్డి, రవిప్రకాశ్, డాక్టర్ శివరాంనాయక్, కృష్ణవర్ధన్‌రెడ్డి, నేతలు తిరుమల్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, రాంరెడ్డి, చిల్కమర్రి రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


నల్లగొండ: ‘తెలంగాణ ప్రాంత ప్రజల గుండెల్లో వైఎస్‌ఆర్ గూడుకట్టుకుని ఉన్నారు. ఆయనను మా గుండెల్లో పెట్టుకున్నాం. ఎన్ని అవాంతరాలు వచ్చినా పార్టీని బలోపేతం చేసేందుకు శ్రమిస్తాం. తెలంగాణలో పార్టీ పని అయిపోందని మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వీటిని కార్యకర్తలు నమ్మొద్దు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించి ‘ప్లీనరీ’ తీర్మానానికి పార్టీ కట్టుబడి ఉంది.
 
 రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయాలన్నదే మా ప్రధాన డిమాండ్’... అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ నాయకత్వం పేర్కొంటోంది. హైదరాబాద్‌లోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం జిల్లా ముఖ్య నాయకులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ అగ్రనాయకత్వానికి జిల్లా నాయకులు ఈ మేరకు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంతంలో పార్టీ మనుగడకు వచ్చిన ముప్పేమీ లేదని, జిల్లాలో మరింత బలోపేతం చేసేందుకు తమ నియోజకవర్గాల్లో శ్రమిస్తామని పలువురు నాయకులు హామీ ఇచ్చారు.
 
 రెండు రాష్ట్రాలు ఏర్పడితే జాతీయ పార్టీగా రెండు రాష్ట్రాల్లోనూ కార్యకలాపాలు ఉంటాయన్న అభిప్రాయం కూడా వ్యక్తమైందని పార్టీ వర్గా లు చెప్పాయి. ‘పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాటలో నడుస్తాం. పార్టీనీ పటిష్టం చేస్తాం. జిల్లా ప్రజలు ఎదుర్కొనే  ప్రతి సమస్యపైనా పోరాటాలు చేస్తాం. మండల, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికలపై దృష్టి పెడతాం. వైఎస్‌ఆర్ అభిమానులు ఎందరో ఉన్నారు. కష్టపడతాం. పార్టీ అభ్యర్థులం గెలి పించుకుంటాం..’ అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ జిల్లా క న్వీనర్ బీరవోలు సోమిరెడ్డి పేర్కొన్నారు. పార్టీ సంస్థాగత అంశాలపైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది.
 
 సమావేశంలో సీఈసీ సభ్యుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, పాదూరి కరుణ, సీనియర్ నాయకుడు గాదె నిరంజన్‌రెడ్డి, గున్నం నాగిరెడ్డి, జిన్నారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, దేవరకొండ కో ఆర్డినేటర్ సురేష్ నాయక్, మునుగోడు నియోజకవర్గ నాయకుడు బోయపల్లి అనంత్‌కుమార్‌గౌడ్, నకిరేకల్ నియోజకవర్గ నాయకుడు నకిరేకంటి స్వామి పాల్గొన్నారు. అదే మాదిరిగా పార్టీ ఇతర నాయకులు అలుగుబెల్లి రవీందర్‌రెడ్డి, కుంభం శ్రీనివాస్‌రెడ్డి, మేకల ప్రదీప్‌రెడ్డి, చామల భాస్కర్‌రెడ్డి, గట్టు మధుసూదన్‌రావు, చామల భాస్కర్‌రెడ్డి, ఇరుగు వెంకటేశ్వర్లు, వడ్లోజు వెంకటేశ్వర్లు, ఇరుగు సునీల్, గూడూరు జైపాల్‌రెడ్డి హాజరయ్యారు.  
Share this article :

0 comments: