తిరుపతిని మాకివ్వండి: పీఎంకే నేత రాందాస్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తిరుపతిని మాకివ్వండి: పీఎంకే నేత రాందాస్

తిరుపతిని మాకివ్వండి: పీఎంకే నేత రాందాస్

Written By news on Sunday, August 11, 2013 | 8/11/2013

తిరుపతిని మాకివ్వండి: పీఎంకే నేత రాందాస్
చెన్నై : పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చిందట. ఇంతకీ ఆ పిల్లి ఏం చేసింది? పిట్టల దగ్గరున్న రొట్టెముక్క తాను లాగేసుకుని చక్కా పోయింది. ఇప్పుడు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలా.. విభజించాలా అని ఒక పక్క మనలో మనం వాదులాడుకుంటుంటే మధ్యలో తమిళనాడుకు చెందిన పీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు ఎస్. రాందాస్ వచ్చి తానూ అందులో వేలు పెడతుతున్నారు. ఏకంగా తిరుపతిని తమకు ఇచ్చేయాలని ఆయన అడుగుతున్నారు.

తిరుపతిలో చాలామంది తమిళులే ఉంటారని, అందువల్ల అది తమిళనాట కలవడమే మంచిదన్నది ఆయన వాదన. 1956లో భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు తమిళనాడుకు అన్యాయం జరిగిందని, తిరుపతి, శ్రీకాళహస్తి, చిత్తూరు, పుత్తూరు, సత్యవేడు లాంటి ఎనిమిది జోన్లను ఇప్పుడు మళ్లీ తమిళనాడులో కలపాలని ఆయన డిమాండు చేశారు. తమిళనాడులోని రాజకీయ పార్టీలన్నీ ఈ విషయంలో ఒక్క మాట మీద ఉండి, రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను నిర్వహించి, అందులో ఓ తీర్మానం చేసి దాన్ని కేంద్రానికి సమర్పించాలని ఆయన సూచించారు. తమిళులు ఎక్కువగా నివసించే ఈ ప్రాంతాలను అప్పట్లో ఆంధ్రప్రదేశ్ కు తరలించారని రాందాస్ అన్నారు.

తిరుపతి, శ్రీకాళహస్తి రెండూ పుణ్యక్షేత్రాలే. అందులోనూ తిరుపతికి ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి భక్తులు వెల్లువెత్తుతుంటారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన దేవుడిగా శ్రీ వేంకటేశ్వరుడిని భావిస్తారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల ఇప్పుడు మళ్లీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న దాదాపు 200 గ్రామాలను తమిళనాడులో కలిపే అవకాశం వస్తుందని, అక్కడున్న తమిళులకు ఉద్యోగావకాశాలు దక్కక చాలా ఇబ్బంది పడుతున్నారని రాందాస్ ఆవేదన చెందారు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సమయంలో తమిళనాడు దాదాపు 70వేల చదరపు మీటర్ల ప్రాంతాన్ని పొరుగు రాష్ట్రాలకు ఇచ్చేయాల్సి వచ్చిందని, 32 వేల చదరపు మీటర్లు కేవలం ఆంధ్రప్రదేశ్ కే ఇచ్చారని ఆయన చెప్పారు.

http://www.sakshi.com/news/andhra-pradesh/transfer-tirupathi-to-tamil-nadu-ramadoss-56026
Share this article :

0 comments: