అది ఓ పవర్ లెస్ కమిటీ: మైసూరారెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అది ఓ పవర్ లెస్ కమిటీ: మైసూరారెడ్డి

అది ఓ పవర్ లెస్ కమిటీ: మైసూరారెడ్డి

Written By news on Thursday, August 8, 2013 | 8/08/2013

అది ఓ పవర్లెస్ కమిటీ: మైసూరారెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియమించిన హైలెవల్ కమిటీ వల్ల వరిగేదేమీలేదని, అది పవర్లెస్ కమిటీ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు మైసూరా రెడ్డి చెప్పారు. రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన వెంటనే సీమాంధ్రలో ఉవ్వెత్తున లేచిన ఉద్యమం నేపధ్యంలో నలుగురు సభ్యులతో హైలెవల్ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. అది పరమ చెత్త కమిటీగా మైసూరా రెడ్డి అభివర్ణించారు. ఉద్యమంలో చీలిక తెచ్చేందుకే ఈ కమిటీని ఏర్పాటు చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన విషయాన్ని సొంతింటి వ్యవహరంలా భావించి ఏక పక్ష నిర్ణయాలు తీసుకుంటుందని విమర్శించారు. ఇదంతా రాజకీయ లబ్దికోసమేనన్నారు. ఇక్కడ ప్రజల ప్రయోజనం గురించి ఆలోచించడంలేదన్నారు.

పార్లమెంటులో ఎంపిల ప్రదర్శన ఓ డ్రామా అన్నారు. నిర్ణయం తీసుకున్న నాయకురాలికి నచ్చజెప్పి నిర్ణయం మార్చుచేయడానికి ప్రయత్నించాలని సలహా ఇచ్చారు. పార్లమెంటులో ఆందోళనలు ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే పనికి వస్తుందని పేర్కొన్నారు. చిత్తశుద్ధి ఉంటే రాజీనామాలు చేయాలన్నారు.  టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నిర్ణయం మార్చుకోవడం కుదరదని చెబుతుంటే, ఆ పార్టీ ఎంపిలు పార్లమెంటులో ఆందోళన చేసి ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు.

విభజనకు సంబంధించి నిర్ధిష్టప్రాతిపదిక లేదన్నారు. జిల్లాల విభజన ప్రధాన సమస్యగా పేర్కొన్నారు. నీటి సమస్య ఎలా పరిష్కరిస్తారని మైసూరా ప్రశ్నించారు.
Share this article :

0 comments: