దారులన్నీ ఇచ్ఛాపురం వైపే.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » దారులన్నీ ఇచ్ఛాపురం వైపే..

దారులన్నీ ఇచ్ఛాపురం వైపే..

Written By news on Sunday, August 4, 2013 | 8/04/2013

ఓ మహోజ్వల ఘట్టం సిక్కోలు ఒడిలో రూపుదాల్చుకోబోతోంది. పాదయాత్రలో ఓ అరుదైన రికార్డు ఆదివారం పురుడు పోసుకోనుంది. ప్రజా సంక్షేమం కోసం లక్షలాది మంది అభిమాల నడుమ మహానేత రాజన్న బిడ్డ షర్మిల చేపట్టిన పాదయూత్ర లక్ష్యానికి అతిచేరువులో ఉంది. మరికొన్ని గంటల్లో పాదయూత్ర పూర్తైరికార్డుల్లోకి ఎక్కనుంది. అలుపెరుగని యోధుడు, మహానేత వైఎస్ ఒకనాడు తన ప్రజాప్రస్థాన పాదయాత్ర ముగించిన చోటే ఇప్పుడు ఆయన తనయ రికార్డుస్థాయి పాదయాత్రకు ముగింపు పలకబోతున్నారు. దీనికి ఇచ్ఛాపురం వేదిక కానుంది. జిల్లాలో ఈనెల 21న ప్రారంభమైన యాత్ర శనివారం నాటికి మొత్తం 14 రోజులు పూర్తిచేసుకుంది. చివరిరోజు (15వరోజు) 6.3 కిలోమీటర్ల యాత్ర పూర్తి చేసి పాదయాత్రకు ముగింపు పలకను న్నారు. 
 
 ఇడుపుల పాయ నుంచి ఇచ్ఛాపురం వరకు 230 రోజుల సుదీర్ఘమైన పాదయాత్రకు గుర్తుగా ఇచ్ఛాపురంలో నిర్మించిన భారీ విజయప్రస్థానం స్తూపాన్ని ఆవిష్కరిస్తారు. వైఎస్ ప్రజాప్రస్థానం విజయ వాటికకు ఎదురుగా నిర్మించిన ఈ స్థూపాన్ని ఆకర్షిణీయంగా తీర్చిదిద్దారు. అనంతరం ఆశేష జనవాహిని హాజరయ్యే బహిరంగ సభలో షర్మిల ప్రసంగించనున్నారు. మరోవైపు ఈ సభలో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీకార్యకర్తలు శనివారం సాయంత్రానికే శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్నారు. మరి కొందరు విశాఖలో మకాం వేశారు. వీరంతా ఉదయూన్నే ఇచ్ఛాపురం చేరుకుని బహిరంగసభలో పాల్గొనేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 
 
 వేలాదిమందితో ముఖాముఖి
 సుధీర్ఘ పాదయూత్రలో షర్మిల వేలాదిమందిని కలిశారు. కష్టసుఖాలు తెలుసుకున్నారు. మంచిరోజులు వస్తాయని, జగనన్నను ఆశీర్వదించాలంటూ పిలుపునిచ్చారు. జగనన్న.. రాజన్న రాజ్యం తెస్తాడని భరోసానిస్తూ ముందుకు సాగారు. ఒక్క శ్రీకాకుళం జిల్లాలో యూత్రసాగిన పాల కొండ, ఆమదాలవలస, శ్రీకాకుళం, నరసన్నపేట, పాతపట్నం, పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో 106 పెద్ద, వందలాది చిన్నగ్రామాలకు చెందిన వేలాది మంది ప్రజలను పలకరిస్తూ షర్మిల పాదయూత్ర సాగించారు. ఆమెకు ప్రజలు అడుగడుగునా నీరాజనం పట్టారు.  వీరంతా ఇచ్ఛాపురంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని, షర్మిలకు వీడ్కోలు పలికేందుకు సిద్ధమవుతున్నారు. 
 
 అభిమానమే అడుగులు వేరుుంచింది 
 సోంపేట/కవిటి/ఇచ్ఛాపురం/ఇచ్ఛాపురం రూరల్, న్యూస్‌లైన్: మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల చేపట్టిన పాదయూత్రలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఆమెకు అండగా నిలిచారు. అరుుతే, పాదయూత్ర ఆరంభం నుంచి 230 రోజుల పాటు 3,112 కిలోమీటర్లు మేర సాగిన పాదయాత్రలో రాజన్న బిడ్డతో కొందరు అడుగు కలిపారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు ఆమెతో పాటు పాదయూత్ర చేస్తూ అభిమానం చాటుకున్నారు. ఆదివారంతో ముగియనున్న పాదయూత్ర సందర్భంగా బహుదూరపు బాటసారుల అభిప్రాయాలు వారిమాటల్లోనే...
 
 అభిమానంతోనే... 
 దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుటుంబం అంటే చాలా ఇష్టం. 2003 సంవత్సరంలో వైఎస్సార్‌తో పాదయూత్రలో పాల్గొన్నాను. జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పు యాత్రలో ఆయన వెంటే ఉన్నా. అదే స్ఫూర్తితో ఆ ఇంటి ఆడబిడ్డ షర్మిలతో నడుస్తున్నాను. ఇడుపులపాయ నుంచి ఆమెతో కలిసి పాదయాత్రలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది.  
 - కంది అంజిరెడ్డి, చింతగుంట పాలేం, పర్చూరుమండలం, ప్రకాశం జిల్లా 
 
 ఫీజు రీరుుంబర్స్‌మెంట్‌తో డాక్టర్‌నయ్యా...
 వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన ఫీజు రీరుుంబర్స్‌మెంట్ పథకంతో చదువు సాగించి డాక్టర్‌ను అయ్యూను. ఆయన చేసిన మేలు జన్మజన్మలకి మరచిపోలేను. ఏ సీఎం కూడా ఇలాంటి బృహత్తరపథకాన్ని ప్రవేశపెట్టలేదు. ఆయనపై ఉన్న అభిమానంతోనే షర్మిల పాదయూత్రలో పాల్గొన్నాను. ఎంత దూరం నడిచినా కష్టమనిపించలేదు.  
 - ఎం.గురుమూర్తి, తిరుపతి 
 
 వృద్ధాప్యం మీదపడినా..
 వృద్ధాప్యం మీద పడినా వైఎస్సార్ కుటుంబంపై ఉన్న అభిమానం పాదయూత్రలో పాల్గొనేలా చేసింది. ఇడుపుల పాయలో బయలుదేరి ఇంతవరకు నడచి వస్తానని మొదట్లో అనుకోలేదు. మహానేత కుటుంబంపై ఉన్న అభిమానం, నమ్మకమే ఇంతదూరం నడిపించారుు. ఆ కుటుంబానికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. 
 - గోపిరెడ్డి సుబ్బారెడ్డి, కనికెల్ల మెట్ల, ప్రకాశం జిల్లా 
 
 ప్రజా స్పందన అపూర్వం
 ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు షర్మిల పాదయాత్రకు ప్రజాస్పందన అపూర్వం. 2003 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేపట్టి 2014లో అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు షర్మిల పాదయూత్రతో 2014 సంవత్సరంలో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తుందని ఆశిస్తున్నాను. మరికొద్ది రోజుల్లో ప్రజలకు మంచిరోజులు రానున్నాయి. 
 - నూనెదశరథ రామిరెడ్డి, పెద్దపలుకులూరు, గుంటూరు జిల్లా 
 
 చేదోడు వాదోడుగా ఉండాలని..
 ఆడ బిడ్డకు చేదోడు వాదోడుగా ఉండాలని, రాజన్నపై అభిమానంతో ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు షర్మిలతో కలిసి నడిచి వచ్చాను. జగన్‌మోహన్‌రెడ్డిని అక్రమంగా జైల్లో పెట్టారు. త్వరలోనే బయటకు వస్తారు. అధికారం చేపట్టి రాజన్నరాజ్యాన్ని తెస్తారు. నాలాంటి పేదలను ఆదుకుంటారు. 
 - సన్నపరెడ్డి రమణమ్మ, నేలటూరు, ప్రకాశం జిల్లా, మద్దిపాడు మండలం
 
 రాజన్న రాజ్యం రావాలనే...
 రాజన్నరాజ్యం రావాలనే ఆకాంక్షతో రాజన్న కూతురు వెంట ఇడుపుల పాయనుంచి ఇచ్ఛాపురం వరకు నడిచి వచ్చాను. వైఎస్ కుటుంబానికి ప్రజల ఆదరణ అపూర్వం. దీనిని చూసి కాంగ్రెస్, టీడీపీ నాయకుల గుండెలు వణుకుతున్నారుు. జగన్‌ను అక్రమంగా జైల్లో బంధించారు. త్వరలోనే మంచిరోజులు వస్తాయన్న నమ్మకం ఉంది. 
 -హిమ ప్రమీలమ్మ, గుద్దెళ్ల గ్రామం, అనంతపురం జిల్లా 
Share this article :

0 comments: