చరిత్ర సృష్టించే దిశగా.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చరిత్ర సృష్టించే దిశగా..

చరిత్ర సృష్టించే దిశగా..

Written By news on Thursday, August 1, 2013 | 8/01/2013


మరో ప్రజాప్రస్థానం 31-07-2013 శ్రీకాకుళం: : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరోప్రజాప్రస్థానం పాదయాత్ర చరిత్ర సృష్టించే దిశగా దూసుకెళ్తోంది. జగన్ వదిలిన బాణం.. లక్షలాదిమంది అభిమానుల తోడుతో లక్ష్యం దిశగా వడివడిగా కదులుతోంది. ఎక్కడికక్కడ ప్రజాసమస్యలు వింటూ, వారికి భరోసా కల్పిస్తూ ప్రజల అభిమానం, ఆప్యాయతలు మూటగట్టుకుని చరిత్ర సృష్టించడానికి సమాయత్తమవుతోంది.‘‘అన్నా..అమ్మా..ధైర్యంగా ఉండండి.. బాధపడొద్దు..జగనన్న వస్తాడు..మీ సమస్యలు తీరుస్తారు.. మీకు ఇళ్లొస్తాయి..పింఛన్లు వస్తాయి..మీ గ్రామానికి రోడ్లు వస్తాయి.. రానున్న రాజన్న రాజ్యంలో మీ పల్లె సమస్యలన్నీ పరిష్కారమవుతాయి’’అంటూ షర్మిల ప్రజలకు ధైర్యం చెబుతూ.. వారిలో కొత్త ఉత్సాహం నింపుతున్నారు. కష్టాల్లో కూరుకుపోయి ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సాంత్వన చేకూరుస్తోంది.
 
జిల్లాలో మరోప్రజాప్రస్థానం సాగుతోన్న ప్రతి గ్రామంలో ప్రజలు మహానేత గారాలపట్టికి ఘనస్వాగతం పలుకూతూనే తమ సమస్యలను ఏకరువుపెడుతున్నారు. ఆమదాలవలస, పాలకొండ ప్రాంతాలకు చెందిన ప్రజలను పాదయాత్రలో ఉన్న జగన్ సోదరిని కలిసి తమ సమస్యలను విన్నవిస్తున్నారు. పాతపట్నం నియోజవర్గం పరిధి శివారు ప్రాంతానికి చెందిన గ్రామాల ప్రజలు తమ ఊళ్లో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంపై బుధవారం షర్మిల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. మెళియాపుట్టిలో 70 ఏళ్ల వృద్ధురాలు తమ గ్రామంలో కనీసం రోడ్లు లేవని, ఎంతోమందికి పింఛన్లు అందడం లేదని వాపోయింది.
 
దీనికి షర్మిల స్పందిస్తూ.. జగనన్న వస్తే మీ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని భరోసా ఇచ్చారు. గిరిజన ప్రాంతంలోని ప్రజలైతే అంతులేని అభిమానం ప్రదర్శిస్తున్నారు. ఎక్కడికక్కడ పూలతో స్వాగతం పలుకుతూ రాజన్న బిడ్డను అక్కున చేర్చుకుంటున్నారు. గ్రామం మీదుగా సాగే పాదయాత్రలో షర్మిలను చూస్తున్న ప్రజలు ఆమెతో కరచలనం చేసేందుకు, పలకరించేందుకు పోటాపోటీగా వెంట నడుస్తున్నారు. తమ మండలం పరిధిలో సమస్యలు వివరించడానికి అవకాశం దొరకని యువకులు, కార్మికులు, అన్నదాతలు వెంట నడుస్తూ వీలుకుదిరినప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో తమకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందడంలేదని చెబుతూ.. తమ సమస్యలకు పరిష్కారం మీరేచూపాలంటూ వేడుకుంటున్నారు. దీంతో రాజన్న బిడ్డ ప్రతి ఒక్కరికి ధైర్యం చెబుతూ ముందుకు కదులుతున్నారు.
 మరో ప్రజాప్రస్థానం 31-07-2013
 
విజయవాటికకు జనం బారులు
 మరో ప్రజాప్రస్థాన పాదయాత్ర బుధవారం సాయంత్రం పలాస నియోజకవర్గ పరిధిలోకి ప్రవేశించింది. ఇప్పటివరకు యాత్ర పాలకొండ, ఆమదాలవలస, శ్రీకాకుళం, నరసన్నపేట, పాతపట్నం నియోజకవర్గాల్లో పూర్తయింది. మొత్తం ఏడు నియోజకవర్గాల పర్యటనలో భాగంగా ప్రస్తుతం ఐదు పూర్తవ్వగా, ఆరో నియోజకవర్గమైన పలాసలో కొనసాగునుంది.
 
అక్కడికి ఇచ్ఛాపురం ఒక్కటే మిగిలిఉంది. అయితే చివరి మూడు రోజులు ఇచ్ఛాపురం వరకు పూర్తిగా జాతీయరహదారిమీదుగానే యాత్ర సాగనుండడంతో..సమీప గ్రామాల ప్రజలు పాదయాత్ర చివరి దశకు చేరుకుంటుండడంతో తమ అభిమాన రాజన్న పుత్రికను చూసి శుభాకాంక్షలు తెలిపేం దుకు భారీ ఎత్తున తరలివచ్చేందుకు సన్నద్ధమవుతున్నా రు. మరోపక్క మరోప్రజాప్రస్థాన పాదయాత్రకు గుర్తుగా ఇచ్ఛాపురంలో విజయవాటిక సిద్ధమవుతుండడం, ఇప్పటికే మరోప్రజాప్రస్థానం రికార్డులు సృష్టించడంతో ఈ చిహ్నాం పనులు చూసేందుకు అనేక ప్రాంతాల నుంచి అభిమాన జనం భారీగా తరలివస్తున్నారు.
 
 సైడ్‌లైట్స్
 పర్లాకిమిడి-పాతపట్నం రహదారిలో కిక్కిరిసిన జనాలతో పాదయాత్రకు ఎదురుగా వస్తున్న ఓప్రైవేటు వాహనం చోదకుడ్ని షర్మిల ఆప్యాయంగా పలకరించి కరచాలనం చేయడంతో డ్రైవర్ పి.శ్రీనివాసరావు ఆనందానికి అంతేలేకుండా పోయింది. అక్కా మేమంతా మీవైపే అంటూ బిగ్గరగా అరిచాడు.

 పదనాపురానికి చెందిన తాడేల మంగ మ్మ జగనన్న సోదరిని కలిసి తమ గ్రామసమస్యలు వివరించారు. రోడ్డునేదు, తాగడానికి నీరునేదు ఇబ్బంది పడుతున్నామంటూ వివరించారు. జగనన్నను ఆశీర్వదించండి మంచి రోజలు వస్తాయని షర్మిల చెప్పడంతో.. ఇదే విషయాన్నితోటివారికి చెప్పడం వినిపించింది.

 పదనాపురం గ్రామానికి చెందిన కొల్లి రోజా, నిక్కల భార్గవిలతోపాటు మరో ఐదుగురు మహిళలు తూంకొండ వరకు పాదయాత్రలో సుమారు ఏడు కిలోమీటర్లు నడిచి వచ్చారు.

 మెళియాపుట్టి నుంచి పలాస వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ కుటుంబం షర్మిలను చూసేందుకు రోడ్డుపక్కన బండిని ఆపే క్రమంలో అదుపు తప్పడంతో షర్మిల భద్రత సిబ్బంది అప్రమత్తమై పడకుండా ఆపారు.

 ఆకులఅమ్మతల్లి గ్రామం వద్ద షర్మిల ను చూసేందుకు మీసాల లక్ష్మీనారాయ ణ అనే వికలాంగుడు ఇబ్బంది పడుతుం డగా ఆయన్ని చూసిన ఆమె అన్నా బాగున్నావా అంటూ పలకరించి జగనన్న వ స్తాడు.. వికలాంగులకు నెలకు వెయ్యి రూపాయలు పింఛను ఇస్తారని ధైర్యం చెప్పారు.
మరో ప్రజాప్రస్థానం 31-07-2013
 రాజన్న చనిపోయాక పేదోళ్ల బతుకులు ఇట్టాగా ఉండిపోనాయి. ఆ బాబు తరువాత వచ్చినోళ్లు ఏటీ చేయడం లేదు. ఆయన బిడ్డ నడిచొస్తుంటే కడుపు తరుక్కుపోతుందని టీకెఆర్‌పురానికి చెందిన దొర అచ్చమ్మ కన్నీరుకార్చింది.

 రాజన్న తనయ షర్మిలను చూసేందుకు పెద్దమడి ఆశ్రమ పాఠశాల వద్ద వందలాదిగా విద్యార్థినీ విద్యార్థులు బారులు తీరి వంగ పండు ఉష జానపదగేయాలకు చిందులు వేశారు.

 రేగులపాడు సమీపంలో మహానేత తనయకి అంబటి చిట్టమ్మ, ధనలక్ష్మిలు హారతి పట్టి ఆమెతో వారి ఆనందాన్ని పంచుకున్నారు.
 మహానేత తనయను చూసి చీపురుపల్లి గ్రామం వద్ద అప్పలమ్మ అనే వృద్ధురాలి ఉద్వేగానికి గురై కన్నీటిపర్యంతమయ్యారు. షర్మిల ఈమెను అవ్వా... బాగున్నా అని హత్తుకోవడంతో ఆమె ఆనందానికి అంతులేకుండా పోయింది.

 టెక్కలిపట్నం వద్ద ఫాదర్ ఎన్.ప్రసాద్, డేవిడ్‌లు క్రైస్తవ ప్రార్థనలు చేస్తూ షర్మిలను ఆశీర్వాదం ఇచ్చారు.
 
 దాసుపురం వద్ద చిన్నారి సవర జయమ్మ షర్మిలకు కండువా వేయడానికి రాగా ఆ కండువాను తిరిగి ఆమెకే వేసి అభినందించారు.
Share this article :

0 comments: