రాష్ట్రం విడిపోతే నీటి కోసం యుద్ధం తప్పదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్రం విడిపోతే నీటి కోసం యుద్ధం తప్పదు

రాష్ట్రం విడిపోతే నీటి కోసం యుద్ధం తప్పదు

Written By news on Monday, August 12, 2013 | 8/12/2013

 సరిహద్దు రాష్ట్రాలతో మనకు ఇప్పటికే అనేక జల వివాదాలు ఉన్నాయని వైయస్ఆర్ ‌కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మన రాష్ట్ర విభజన జరిగితే నీటి కోసం మరిన్ని యుద్ధాలు చేయాల్సి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన ప్రకటన తర్వాత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమస్యలు అడగటం విడ్డూరంగా ఉందని నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. ఆళ్ళగడ్డలోని 18వ నెంబరు జాతీయ రహదారిని సమైక్యవాదులు సమైక్యాంధ్ర జెఎసి ఆధ్వర్యంలో సోమవారంనాడు దిగ్బంధం చేశారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి వారికి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడారు.

కాగా, రాష్ట్ర విభజన ప్రకటనకు నిరసనగా కర్నూలులో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ ‌నాయకుడు ఎస్వీ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారంనాడు పార్టీ కార్యకర్తలు నిరసన తెలిపారు. ఎపి నీటి పారుదల శాఖ అధికారులు సైతం సమైక్యాంధ్రకు మద్దతుగా నంద్యాలలో ర్యాలీ నిర్వహించారు.
Share this article :

0 comments: