వైఎస్ జగన్‌తో షర్మిల ములాఖత్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ జగన్‌తో షర్మిల ములాఖత్

వైఎస్ జగన్‌తో షర్మిల ములాఖత్

Written By news on Monday, August 5, 2013 | 8/05/2013

సుదీర్ఘ మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ముగించుకున్న  షర్మిల విశాఖపట్నం నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి నేరుగా చంచల్‌గూడ జైలుకు చేరుకుంటారు.

తన సోదరుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో ఆమె ములాఖత్ అవుతారు. పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన ప్రజల కన్నీళ్లు, కష్టాలను షర్మిల నేరుగా జగన్‌మోహన్‌రెడ్డికి వివరించనున్నారు. ప్రపంచ చరిత్రలో ఏ మహిళ చేయని విధంగా 3112 కిలో మీటర్ల పాదయాత్రతో రికార్డు సృష్టించిన షర్మిలకు శంషాబాద్‌లో పార్టీ శ్రేణులు, వైఎస్ కుటుంబ అభిమానులు భారీ స్వాగతం పలకనున్నారు. శంషాబాద్ నుంచి కాటేదాన్, చాంద్రాయణగుట్ట క్రాస్‌రోడ్డు ఫ్లైఓవర్ కింద నుంచి కంచన్‌బాగ్, ఒవైసీ ఆస్పత్రి, ఐఎస్ సదన్ మీదుగా చంచల్‌గూడకు చేరుకుంటారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.
Share this article :

0 comments: