జగనన్న విడుదల కోసం దేవుడిని వేడుకుంటున్నాను - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగనన్న విడుదల కోసం దేవుడిని వేడుకుంటున్నాను

జగనన్న విడుదల కోసం దేవుడిని వేడుకుంటున్నాను

Written By news on Friday, August 23, 2013 | 8/23/2013

జగనన్న విడుదల కోసం దేవుడిని వేడుకుంటున్నాను
 పదిహేను నెలలుగా జగనన్న జైల్లో ఉన్నారు. జగనన్నను వ్యతిరేకించే పార్టీలకు, నాయకులకు, సీబీఐకి, న్యాయస్థానాలకు ఇదొక సాధారణ విషయంగా అనిపించవచ్చు. కానీ నాకు ఇంకా జగనన్న అరెస్టయిన రోజే గుర్తొస్తోంది. ఆ రోజు జగనన్నను అరెస్టు చేసిన వార్త విని నా గుండె గాయపడింది. ఇప్పటికీ నేను తేరుకోలేదు. అప్పుడు టీవీ చూస్తున్నాను. అంతకు కొద్దిరోజుల ముందే కొన్ని చానళ్లవారు ‘జగన్ అరెస్టు ఎప్పుడు?’ అంటూ అదేపనిగా ప్రసారం చేయడం, ఆ వరుసలోనే సీబీఐ జగనన్నను విచారణకు పిలిపించుకుని దొంగచాటుగా అరెస్టు చేయడం చూశాను. జగనన్నను వ్యతిరేకించే మీడియా, సీబీఐ కలిసి చేసిన ఆ అక్రమ అరెస్టును చూసి నా హృదయం భగ్గుమంది. మరీ దారుణం ఏమిటంటే, అరెస్టుకు ముందు జగనన్న తరఫున కోర్టులో దాఖలైన ముందస్తు బెయిలు పిటిషన్‌ని కోర్టు కొట్టివేయడం, కొట్టివేయడానికి ముందు న్యాయమూర్తి ఏమన్నారో నేను పేపర్లో చదివాను. ‘అరెస్టు చేస్తారని మీరు ఎందుకనుకుంటున్నారు?’ అని వారి ప్రశ్న. ఈ ప్రశ్నను ఎలా అర్థం చేసుకోవాలి.
 
  ఎవరైనా ఉత్తి పుణ్యానికే ముందస్తు బెయిలుకు విజ్ఞప్తి చేసుకుంటారా? అరెస్టు చేస్తారేమోనన్న అనుమానం ఉండబట్టే కదా! ఇంత చిన్న లాజిక్కు న్యాయస్థానానికి తెలియలేదా? ‘జగన్‌కి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారంటున్నారు? అలా ఎందుకనుకోవాలి?’ అని కోర్టువారు సీబీఐని ఎందుకు ప్రశ్నించలేకపోయారు? న్యాయం అందరికీ ఒకలా ఉండదా? చట్టం దృష్టిలో అందరూ సమానం కాదా? జగనన్న అరెస్టుకు ముందు జరిగిన, తర్వాత జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఇలాగే అనిపిస్తోంది. పద్దెనిమిది నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు జరగడానికి రెండురోజుల ముందు జగనన్నని అరెస్ట్ చేయడం చూడగానే కుట్ర ఈ స్థాయిలో ఉంటుందా అని ఆశ్చర్యపోయాను. కానీ ఎల్లో మీడియా, యాంటీ వై.ఎస్.ఆర్. ప్రముఖులు, టీడీపీ వర్గం పండుగ చేసుకుంది! వీళ్లకు ప్రజలే బుద్ధి చెప్పాలనుకున్నాను. ఎన్నికల ఫలితాల కోసం, ప్రజాతీర్పు కోసం నిరీక్షిస్తున్న టైమ్‌లో ఒకట్రెండు స్థానాలు తప్ప మిగతావన్నీ జగనన్న కైవసం చేసుకున్నారన్న వార్త తెలిసి ఓటర్లకు మనసారా కృతజ్ఞత చెప్పుకున్నాను.
 
  బెయిల్ ఇవ్వడంపై కూడా ప్రజాతీర్పు కోరే అధికరణం కనుక రాజ్యాంగంలో ఉంటే, ఈసరికి జగనన్నకు ఎప్పుడో బెయిల్ వచ్చి ఉండేది! కోర్టులు కూడా యాక్టులనీ, రూల్సనీ, రెగ్యులేషన్సనీ, ఫండమెంటల్ రైట్స్‌నీ పక్కనపెట్టి జగనన్నపై కక్ష సాధిస్తున్నాయా అనే సందేహం కలుగుతోంది. ఎవరో అన్నారు, న్యాయమూర్తుల గురించి సాధారణ పౌరులు బహిరంగంగా కామెంట్ చెయ్యడానికి వీల్లేదని! రాజ్యాంగంలో ఇలా ఉందా? ఉన్నట్లయితే వాక్‌స్వాతంత్య్రానికి అర్థం ఏమిటి? నేను ఈ హెచ్.ఆర్.సి.ని, సుప్రీంకోర్టును అడుగుతున్నాను... ‘జగనన్నపై నేరం నిరూపణ కాకముందే ఆయన జైలుశిక్ష ఎందుకు అనుభవించాలి’ అని. మా నాయకుడు మాతో ఉండవలసిన ‘అమూల్యమైన సమయాన్ని’ చట్టాలు ఎలా లాక్కుంటాయి? ప్రజాస్వామ్యంలో ప్రజలే కదా అంతిమ లబ్ధిదారులు. వారిని నష్టపరిచే వ్యవస్థను ప్రజలెందుకు ప్రశ్నించకూడదు? ఇదేనా మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.
 
  అంబేద్కర్ కలలుగన్న సమాజం? ఒక మనిషి తప్పు చేస్తే అరెస్టు చెయ్యడం చట్టబద్ధం అయినప్పుడు, అది నిర్థారణ కానప్పుడు ఆ మనిషికి బెయిల్ ఇవ్వడం అంతే చట్టబద్ధం కావాలి. జగనన్న విషయంలో ఎందుకని అన్ని నియమాలనూ, నిబంధ నలను, మానవ హక్కులను కాలరాస్తున్నారు? జగనన్న అక్రమనిర్బంధంపై ఆలోచనాపరులు, మేధావులు మనకెందుకులే అనుకుంటున్నట్లు కనిపిస్తోంది. పైకి వారు నోరు మెదపలేక పోయినా, వారి మనసుకు తెలియకుండా ఉంటుందా ఇది అక్రమ నిర్బంధం అని. జగనన్నను త్వరగా ప్రజల మధ్యకు తెమ్మని ఆ దేవుడిని వేడుకుంటున్నాను.
 - ఉమామహేష్, శ్రీకాకుళం
Share this article :

0 comments: