విభజన జరిగితే నీటికోసం యుద్ధాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విభజన జరిగితే నీటికోసం యుద్ధాలు

విభజన జరిగితే నీటికోసం యుద్ధాలు

Written By news on Saturday, August 3, 2013 | 8/03/2013

హైదరాబాద్: రాష్ట్రవిభజన జరిగితే నీటి కోసం యుద్దాలు జరిగే పరిస్థితులు ఏర్పడతాయని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేత మైసూరారెడ్డి హెచ్చరించారు.  కృష్ణానది వరద నీటి మిగులు జలాలపై నిర్మించిన ప్రాజెక్ట్‌లు కాస్త చారిత్రక కట్టడాలుగా మిగిలిపోయే ప్రమాదం ఉందన్నారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు వైఖరిని ఆయన తప్పుబట్టారు.
విభజన జరిగితే నీటికోసం యుద్ధాలు: మైసూరా రెడ్డి
రాష్ట్రరాజధానితో పాటు అనేక అంశాలపై స్పష్టత లేకుండా కాంగ్రెస్‌పార్టీ తీసుకున్న విభజన నిర్ణయం రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని తీవ్రసంక్షోభంలోకి నెట్టివేసే ప్రమాదముందని  మైసూరారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే నదీ జలాలపై పోరుగురాష్ట్రాలతో వివాదాలు కొనసాగుతున్న నేపధ్యంలో తాజాగా విభజన పేరుతో తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలకు తీవ్ర సమస్యలు తెచ్చిపెడుతుందన్నారు. కృష్ణానది వరద నీటి మిగులుజలాలపై ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు, ఇప్పడు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వడం వల్ల ప్రజలు నీటి కోసం యుద్దాలు చేసుకోవాల్సిన పరిస్ధితులేర్పడతాయని పేర్కొన్నారు. ఒకవేళ విభజనకు నిజంగా సిద్దపడితే మరి సొంత పార్టీ నేతలతో చంద్రబాబు ఎందుకు ఉద్యమాలు, ఆందోళనలు చేయిస్తున్నారో 
సమాధానం చెప్పాలన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ నేతలు రాజీనామాల పేరుతో డ్రామాలాడుతున్నారని మైసూరా మండిపడ్డారు. నిజంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు చిత్తశుద్ది ఉంటే గవర్నర్‌ను కలిసి తమ రాజీనామా లేఖలివ్వాలి కానీ ఇలా సీఎంకు, పీసీసీ ఛీఫ్‌కు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. రాజకీయ స్వార్ధం కోసం చేసిన అనాలోచిత చర్యకు సోనియా, చంద్రబాబులు బాధ్యత వహించాలన్నారు. దేశాన్ని పాలించే కాంగ్రెస్‌ పార్టీకి కనీస ఇంగిత జానం లేకపోవడం బాధాకరమని మైసూరారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
Share this article :

0 comments: