రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి జగన్

రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి జగన్

Written By news on Thursday, August 8, 2013 | 8/08/2013

రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి జగన్
 వై.ఎస్. మరణం తర్వాత ఈ రాష్ట్రం దిక్కులేనిదై పోయిందనడానికి ప్రస్తుత రాజకీయ పరిణామాలే నిదర్శనం. అసలు వీటన్నిటికీ నాంది... కాంగ్రెస్ అధిష్ఠానం జగన్ ఓదార్పుయాత్రను అడ్డుకోవడం. ప్రజలు ఆయన్ని కేవలం వై.ఎస్. తనయుడిగా మాత్రమే చూడడం లేదనీ, ఆయన్ని తమ ఆశాజ్యోతిగా భావిస్తున్నారనీ సోనియా గ్రహించలేకపోయారు. ఆమెకు తెలియజెప్పేవారు లేకపోయారు. జగన్ అంటే రాజశేఖరరెడ్డిగారి సదాశయాలు, ఆదర్శాలు నెరవేర్చగల యువనాయకుడని రాష్ట్ర ప్రజలందరి ఏకాభిప్రాయం. ఓ విద్యార్థిని కదిపి చూడండి... ‘వై.ఎస్.ఆర్.గారు బతికుంటే మాకు గవర్నమెంట్ టెక్నో స్కూల్స్ వచ్చి వుండేవి’ అంటాడు. రైతులను కదపండి... ‘రాజన్న ఉండి వుంటే మా బతుకులిలా బుగ్గి కాకపోయుండె’ అంటారు. 
 
 ఈ అప్పుల తిప్పలు తప్పి రారాజులుగా బతికేవాళ్లం అని ఆవేదన చేస్తారు. ‘‘మారాజు ఉండి ఉంటే ప్రాజెక్టులు మొదలయ్యేవి, కొన్ని పూర్తయ్యేవి, వేల ఎకరాలు సాగులోకి వచ్చేవి’’ అంటారు. ఇక ఉద్యోగుల విషయానికి వస్తే ‘‘మమ్మల్ని బానిసలుగా చూసిన గత ప్రభుత్వాలు మాచేత వెట్టిచాకిరీ చేయిస్తే, వై.ఎస్.గారు ఎంతో గౌరవించి మా వేతనాలు పెంచారు. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ కాకుండా బ్యాన్ పెడితే వై.ఎస్.గారు గ్రామస్థాయి వి.ఆర్.ఓ. పోస్టుల నుంచి, పైస్థాయి ఆఫీసర్ పోస్టుల వరకు భర్తీ చేశారు. మూతపడిన ప్రభుత్వ సంస్థలను పునరుద్ధరించి వేలసంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పించారు. కానీ ఆయన మరణానంతరం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వై.ఎస్.గారి ఆశయాలను అనుసరిస్తామని చెబుతూనే ఆయన ప్రతిపాదించిన ప్రాజెక్టులను రద్దు చేస్తూ ప్రజల జీవనోపాధికి సమాధి కడుతోంది.
 
  లక్షల ఉద్యోగాలంటూ కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రజల్ని మోసం చేస్తున్నారు. కానీ ఇవాళ కనీసం సచివాలయానికి కూడా వెళ్లికుండా తప్పించుకు తిరుగుతున్నారు. అరవై ఏళ్ల నుంచి కాంగ్రెస్ ఇలాగే ప్రజల్ని వంచిస్తూ నిరుద్యోగాన్ని పెంచుకుంటూ పోతుంటే, రాజశేఖరరెడ్డిగారు ప్రజా సంక్షేమం కోసం చిత్తశుద్ధిగా పనిచేశారు. పారిశ్రామికవేత్తల కొమ్ము కాసి స్వార్థ ప్రయోజనాలు చేకూర్చిన గత ప్రభుత్వాల కన్నా ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చి, అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన వై.ఎస్.ఆర్. మహానాయకుడే కదా. రాజన్న హయాంలో మహిళలు ఏనాడూ ఇప్పుడు పడుతున్నన్ని ఇబ్బందులు పడలేదు. గ్యాస్ ధర పెరగలేదు.
 
  విద్యుత్ ఛార్జీలు పెరగలేదు. ఎంత ఖర్చున్నా నెల చివర ఆదాయంలో కొంత మిగులు కనిపించేది. అటువంటి నాయకుడి బిడ్డగా ఇవాళ జగన్‌గారు తన తండ్రి ఆదర్శాలను కొనసాగించేందుకు ప్రయత్నిస్తుంటే, ఆయనకెక్కడ క్రెడిట్ దక్కుతుందోనని ఈ కాంగ్రెస్ నాయకులు అవరోధాలు కల్పించారు. అవినీతి ఆరోపణలు చేశారు. చివరికి జైలుకు పంపించారు. రాష్ట్రప్రజలకు తిరిగి రాజన్న రాజ్యం అందుబాటులోకి రావాలంటే జగనన్న బయటికి రావాలి. ఇదే ప్రజలందరి ఆకాంక్ష.
 - పద్మావతి, సంస్కృతి టౌన్‌షిప్, అన్నోజిగూడ
Share this article :

0 comments: