దటీజ్ జగన్! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » దటీజ్ జగన్!

దటీజ్ జగన్!

Written By news on Friday, August 23, 2013 | 8/23/2013

21jagan1
ఎత్తుకు పై ఎత్తు.
వ్యూహానికి ప్రతి వ్యూహం.
తాడిని తన్నానని విర్రవీగేవాడి తలను తన్నటం.
ఇవన్నీ రాజకీయాలలో తలపండిన వారికే సాధ్యమనుకుంటారు. గజకర్ణ గోకర్ణ , టక్కు టమారా విద్యలు వారికే సొంతమని భావిస్తారు. తెల్లవారేలోగా తిమ్మిని బమ్మి చేయగల నేర్పు తమ సొంతమనే నమ్ముతారు.
కానీ ప్రత్యర్థుల మనసులో ఇంకా ఊహ రాకముందే గ్రహించి పాచికలు కదిపి ఓ యువనేత, కాంగ్రెస్ లోని రాజకీయ భీష్ములకు చెమట్లు పోయించాడు. దిగ్గీ రాజాల వంటి దిగ్గజాలను తత్తరపడేటట్లు చేశాడు. చిదంబరాల యెత్తుగడలను చిత్తు చిత్తు చేశాడు. అతడెవరో కాదు, పుకార్ల గాలి కూడా సోకని జైలు గోడల మధ్య కూర్చుని పాచిక వేశాడు.
తెలంగాణ ప్రకటనకు ఒక రోజు ముందే తన శాసన సభ్యులతో రాజీనామా చేశాడు.
తర్వాత అదను చూసి, తన తల్లి విజయమ్మతో పాటు, తాను కూడా చట్ట సభ సభ్యత్వానికి చెల్లు చీటీ ఇచ్చాడు.
ఇప్పుడు ఏకంగా తన మాతృమూర్తినే నిరాహార దీక్షలో కూర్చోబెట్టారు.
ఫలితం?
‘సమైక్యాంధ్ర’ కు తన పార్టీ( వైయస్సార్ కాంగ్రెస్)నే శాశ్వత విలాసం గా చేశాడు. ఇప్పుడిక ఎవరెంత గింజుకున్నా, మాట తప్పని నేతగా సీమాంధ్రగా నిలుస్తాడు. ఎలా? చదవండి.
చాలామంది అనుమానిస్తున్న విషయం ఒకటుంది. వైఎస్ జగన్మోహనరెడ్డికి ఢిల్లీలో వేగులు ఉన్నారు. ఆ వేగులు కూడా.. కాంగ్రెసు పార్టీ అధిష్ఠానం కదలికల్ని గమనించగల, పసిగట్టగల నేర్పురులు. వారు ఎప్పటికప్పుడు జగన్మోహనరెడ్డికి అందగలిగేలా సమాచారం చేరవేస్తున్నారు. ఇక్కడ ఆయన వ్యూహరచన చేస్తున్నారు.
విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. రాష్ట్ర విభజన సమన్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలనే డిమాండుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమభావజాలాన్ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కీలక భూమిక జగన్‌దే! కానీ అది అమలులో కొంత జాప్యం జరిగినట్లు సమాచారం. అధ్యక్షుడి ఆలోచనల్ని అందుకుని.. అమలు చేయడంలో రకరకాల సందేహాలకు పోయి.. అనుచరులే జాప్యం చేశారు. ఈ వ్యూహప్రతివ్యూహాల్లోని ప్రచారాలు, వాస్తవాలు ఎలాగైనా ఉండొచ్చుగాక.. కానీ ఒక్క విషయం మాత్రం నిజం. న్యాయంగా ప్రజలకు జరగవలసిన తీర్పును వారికి దేక్కలా చేయడానికి కాంగ్రెసు సీట్ల రాజకీయాల్లో ఈ రాష్ట్రం బలైపోకుండా పోరాడడానికి ఇవాళ వైఎస్సార్ కాం్రెగెస్ చాలా స్పష్టంగా పోరుబాటను ప్రకటించింది. అన్య పార్టీలు రాజీపడిపోయినా.. జగన్ నిర్దేశకత్వంలో పార్టీ రంగంలోకి స్పష్టతతో దిగింది. అటో ఇటో తేల్చుకోబోతోంది.
వ్యూహాలను మించి వాస్తవాలు ఉంటున్నాయి. ప్రజాప్రయోజనాలే వ్యూహాల గమనాన్ని నిర్దేశిస్తున్నప్పుడు ఇక చింత అక్కర్లేదు. ఆ వ్యూహాలు విఫలమౌతాయేమోననే శంక కూడా అక్కర్లేదు. విజయమ్మ నిరవధిక నిరాహార దీక్షకు ఉపక్రమిస్తున్న ఇలాంటి కీలక నేపథ్యంలో ‘తెలంగాణ వేర్పాటు వాదం.. సమన్యాయం కోరుతున్న వాదం.. సమైక్య వాదం’ అంశాలపై తొలినుంచి ఈ దీక్షాప్రస్థానం వరకు విపులంగా వైకాపా విధానాల్ని సమీక్షించుకునే ప్రయత్నం ఇది.

వైఎస్సార్ వైఖరిపై వాస్తవాలు తెలియాలి..

వైఎస్ రాజశేఖరరెడ్డి వల్లనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అనే వాదనను ప్రజల మెదళ్లలోకి చొప్పించడానికి.. తద్వారా సీమాంధ్ర ప్రాంతంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పట్ల వ్యతిరేకతను నిర్మించడానికి కాంగ్రెస్ వారు ఎన్ని కుయుక్తులు అయినా పన్నుతూ ఉండవచ్చు గాక! తెలుగుదేశం పాడిన పాటకు వీరు వంత వీరులుగా ఆలపిస్తూ ఉండవచ్చు గాక! కానీ, ప్రజల దృష్టిలో రాష్ట్రం సమైక్యంగా ఉండడం పట్ల వైఎస్‌ఆర్ నిబద్ధతకు ఒక నిర్దిష్టమైన గుర్తింపు ఉంది. చిన్నారెడ్డి ప్రభృతులతో రాష్ట్ర విభజన గురించి 2001లో ఒక వినతిపత్రం బనాయింపజేసినంత మాత్రాన అప్పటి రాజకీయ వ్యూహప్రతివ్యూహాల నేపథ్యంలో ఆయన అనుసరించిన చతురోపాయమే తప్ప.. మరో ఎత్తు కాదని అందరికీ తెలిసిన సంగతే! కానీ ఆ విషయాన్ని ఇప్పుడు సందర్భోచితంగా ఆయన మీదికి అంగా వాడుకుంటున్నారు. తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత.. వేర్పాటు వాదం అనేది ఊపిరిపోసుకోని రీతిలో.. తెలంగాణ ప్రాంతంలో ఏ రీతిగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారో.. తన హయాంలో జరిగిన అనేకానేక కార్యక్రమాల్లో తెలంగాణ ప్రాంతానికి పెద్దపీట వేస్తూ రావడం ద్వారా.. ‘ప్రత్యేక రాష్ట్రం’ అనే వేర్పాటు వాద భావజాలంతో ప్రజల్లో విషం చిమ్మడానికి ప్రయత్నిస్తున్న వారికి ఠికానా లేకుండా.. రాజకీయ ఉపాధి దొరకకుండా చేయడంలో వైఎస్సార్ ఏం చేశారో అందరికీ తెలుసు!
వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే జగన్మోహనరెడ్డి సమైక్యాంధ్ర ప్లకార్డులు పట్టుకుని లోక్‌సభలో ఎంపీ ెదాలో హల్‌చల్ చేసి వార్తల్లో వ్యక్తిగా కూడా నిలిచారు. ఇదంతా ‘రాష్ట్రంవేర్పాటువాదం’ అనే అంశం గురించి ‘వైఎస్సార్ కుటుంబం’ వైఖరిని ప్రతిబింబించే విషయాలు మాత్రమే. కానీ వైఎస్సార్ మరణం తర్వాత.. ఈ రాష్ట్రం దిక్కూమొక్కూ లేని రీతిలో సమర్థ నాయకత్వం లేకుండా గాలివాటుగా కొట్టుమిట్టాడుతున్నప్పుడు.. తెలంగాణ వాదం మళ్లీ జడలు విప్పుకుంది. తాండవనృత్యం ప్రారంభించింది. ఆ వాదంతో నిమిత్తం లేకపోయినా.. అనివార్యమైన రాజకీయ మార్పుచేర్పులు, పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పురుడుపోసుకుంది. దాంతో విధానాల్లోనూ మార్పుచేర్పులు అనివార్యం అయ్యాయి.

సుదీర్ఘకాలం సందిగ్ధావస్థలోనే…

రాజకీయాల్లో శిలాసదృశమైన శాశ్వత విధానాలు ఉండవు గాక ఉండవు. ప్రజాభిప్రాయం ఎటు మారుతోంటే రాజకీయ పార్టీలు తదనుగుణంగా మాత్రమే తమ పథగమనాన్ని నిర్దేశించుకుంటూ ఉంటాయి. జగన్మోహనరెడ్డి ఒక వ్యక్తిగా ఉన్న దశనుంచి ఒక వ్యవస్థగా, రాజకీయ పార్టీగా ఆవిర్భవించిన తరువాత… ఆయన కూడా తన విధానాల విషయంలో పునరాలోచనలో పడాల్సిన అనివార్యమైన పరిస్థితి ఎదురైంది. తెలంగాణ ప్రాంతంలో కూడా వైఎస్సార్ అంటే ప్రాణసమానంగా ఎంచే నాయకులు అనేకులు. వారంతా పార్టీకి దన్నుగా నిలవడానికి ఉత్సాహపూరితంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో వారందరికీ ఇబ్బంది కలిగించగల విధానంతో ముందుకు సాగడం ఆయనకు ఇష్టం లేదు. పైగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయం తన చేతుల్లో ఉన్నది కాదు. అందుకే కేంద్ర నిర్ణయానికి వదలిపెట్టి.. అదే తమ విధానంగా సాగారు. ఆ సందిగ్ధం పార్టీలో చాన్నాళ్ల వరకు ఉన్నది.
కానీ ప్రత్యర్థి పార్టీగా ఇలాంటి మెతక వైఖరిని వైకాపా అవలంబిస్తుండడానికి కాంగ్రెసు పార్టీ ఎడ్వాంటేజీగా తీసుకున్నది. రాష్ట్ర విభజన అన్నది తమ సీట్ల వ్యవహారంలాగా.. తమ ఇచ్చమొచ్చిన రీతిలో విచ్చలవిడిగా వ్యవహరించడానికి తెగబడింది. నిర్ణయం కేంద్రం తీసుకోగలిగినదే తప్ప.. దాని అర్థం.. తతిమ్మా రాజకీయ పక్షాలు అందరినీ.. ఉపేక్షించి.. బరితెగించమని కాదు! కానీ కాంగ్రెసు వ్యవహార సరళి అచ్చంగా అలాంటి అచ్చోసిన వైఖరినే తలపించింది. ఆ దుడుకుతనం వైఎస్సార్ కాంగ్రెస్‌కు సహజంగానే కంటగింపు కలిగించింది. ప్రజాభిప్రాయం నికరంగా నిర్దిష్టంగా.. నిర్మలంగా ఒకేవైపున ఉండేట్లయితే.. దానికి వ్యతిరేకంగా నడవడం వైకాపా మనోగతం కాదు. కానీ.. ఆ ముసుగులో కాంగ్రెస్ దుష్ట/ వక్ర రాజకీయ ప్రయోజనాలను ఈడేర్చుకునే కుట్రకు చెక్ పెట్టాలని మాత్రం అనుకున్నది. అదే సమయంలో రాష్ట్రంలోని ఇతర ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం వంటివి.. కాంగ్రెసుతో కుమ్మక్కుఅయి.. కాంగ్రెసు దుష్ట నిర్ణయానికి పోకడలకు చిడతలు వేస్తూ కూర్చున్న సమయంలో వైకాపా క్రియాశీలంగా రంగంలోకి దిగింది.
ఆ సమయానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సందిగ్ధం తొలగింది. రాష్ట్ర భవిష్యత్తుకు ఎలాంటి హాని జరగకుండా ఉండాలంటే.. ప్రజాసంక్షేమం ఆశించే పార్టీగా నిర్దిష్టంగా తాను చేయవలసిన కృషి ఏమిటో జగన్‌కు స్పష్టత ఉంది. అందుకే ఆయన తన అభిప్రాయాలకు అనుగుణంగా పార్టీ విధానాలను పునర్నిర్వచించారు.

వేలెత్తి చూపలేని రుజునిర్ణయం

విభజనలో రాజకీయ ప్రయోజనాలు లక్ష్యించిన కాంగ్రెస్ వక్రనీతి తప్ప మరొకటి లేదని గుర్తించింది… దాన్ని ఎండగట్టదలచనిది వైకాపా ఒక్కటే. అందుకే పాలక పక్షం వారికి అవాంతరాలు సృష్టించడమూ ప్రారంభించింది. రాజకీయ కుట్ర లాగా రాష్ట్రాన్ని విభజించడం నీతిబాహ్యం అంటూ వైకాపాకు చెందిన 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసినప్పుడు.. పార్టీలోనే ముసలం పెట్టడానికి, తెలంగాణ ప్రాంతపు ఎమ్మెల్యేలలో వైకాపా పట్ల ఒక దురూహలను కలగజేయడానికి కాంగ్రెస్ తెగించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని తెలంగాణ ప్రాంత నాయకులతో రాజీనామాలు చేయించి.. ఆ పార్టీ ‘అయిపోతోందనే’ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి, వారికి రకరకాల తాయిలాలు చూపించి తమవైపు ఆహ్వానించింది.
కానీ వైకాపాగానీ.. జగన్ గానీ వీసమెత్తు అయినా జంకలేదు. ఎలాంటి గొంకు లేకుండా.. ముందుకు సాగారు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం తప్ప.. స్వార్థ, రాజకీయ ప్రయోజనాలు కాదనుకున్నారు. అందుకే తమ నిర్ణయానికి కట్టుబడ్డారు. కొందరు నాయకులు పార్టీనుంచి చేజారిపోవచ్చు గాక.. ప్రలోభాలకు లొంగవచ్చు గాక.. అంతమాత్రాన బేజారెత్తిపోవాల్సిన అగత్యం లేదనుకున్నారు. తమ నిర్ణయం నిష్కల్మషం అయినప్పుడు.. ప్రజల్లో కూడా దురూహలను నిలకడమీద నిర్మూలించవచ్చుననే పాజిటివ్ దృక్పథానికి వారు కట్టుబడ్డారు. తమ మీద నమ్మకంతో.. రకరకాల కుట్రలు కూహకాలకు బలైపోతున్న రాష్ట్రానికి తాము ఏదైనా స్పష్టమైన మార్గానుసరణతో పోరాడగలమనే విశ్వాసంతో చూస్తున్న ప్రజానీకానికి భరోసా కల్పించేలా… తమ ఆలోచనలు అన్నిటికీ.. ఒక ఏకరూపత కల్పించారు. ‘సమన్యాయం చేయలేనప్పుడు సమైక్యరాష్ట్రమే ముద్దు’ అనే నినాదానికి ప్రాణం పోశారు.
నిజానికి వేర్పాటు వాదులు వెకిలి విమర్శలు చేయడానికి ఆస్కారం వెతుక్కోగలరు గానీ.. వేలెత్తిచూపలేని నిర్ణయం ఇది. విభజనకు అడ్డు చెప్పకుండా… సమన్యాయం అడగడంలో తప్పేముందో ఎవ్వరికీ అర్థం కాని సంగతి! ఈ డిమాండు పట్ల సానుకూలంగా స్పందించని ప్రభుత్వం ఎంత దుర్మార్గమైన ఆలోచనలతో ఉన్నదో అని మనం అనుమానించాలి. సమన్యాయం అనేదానికి స్పందించకపోవడం అంటే.. వారి మనసులో ఏదో కుట్ర ఉన్నట్లే లెక్క! ఆ రీతిగా ఒక ప్రాంతంలో తమ పార్టీ పట్ల అనుమానాల్ని అపోహల్ని సృష్టించడానికి ప్రత్యర్థులు ప్రయత్నిస్తారని చాలా స్పష్టంగా తెలిసినా కూడా రాష్ట్ర విసృ్తత ప్రయోజనాలే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ తన విధానాన్ని విస్పష్టంగా తేల్చేసింది. కాంగ్రెస్ యథాపూర్వ, అవాటైన నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించేసరికి.. వైకాపా విధానం ఉద్యమరూపాన్ని సంతరించుకుంది.

‘విజయ’ ఉద్యమ జ్వాల

వైకాపా ఎమ్మెల్యేలు 16 మంది, ఆ తరువాత ఎంపీ ఒకరు రాజీనామా చేయడం ఒక ఎత్తు. ఏకంగా పార్టీ అధ్యక్షుడు జగన్, గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కూడా తమ పదవులను వదులుకోవడం మరో ఎత్తు. వారు కోల్పోయిన పదవి ఇక్కడ ప్రస్తావన కాదు, వారు పూర్తిగా తమ విధానాన్ని ఉద్యమ రూపంలోకి మార్చడానికి కట్టుబడి ఉండగల చిత్తశుద్ధికి ఆ చట్టసభల పదవులను అంతరాయంగా ఎంచడమే ప్రధానం.
విజయమ్మ నిరవధిక దీక్షను ప్రకటించారు. ఇది జగన్ మేథోజనిత వ్యూహం అని చెప్పాలి. ఆ వ్యూహం కాంగ్రెస్ ఎత్తుగడల్లాగా స్వల్ప రాజకీయ ప్రయోజనాలను మాత్రమే ఆశించేది కాదు. ఆ మాటకొస్తే రాజకీయ ప్రయోజనం లేకుండా.. ఏ పార్టీ కూడా ఏ పనీ చేయదు. అలాగే ఈ నిర్దిష్ట మార్గానికి కట్టుబడి ఉండడంలో వైకాపాకు కూడా రాజకీయ వ్యూహం ఉంది. కానీ అంతకంటె ముందుగా వారు చూసినది ప్రజా ప్రయోజనాన్ని..! జైలుగోడల మధ్య ఉంచినంత మాత్రాన మనో దౌర్బల్యం ఆవరించలేదని, ఆయన నిర్ణయాలు అచంచలంగానే ఉన్నాయనడానికి ఇది ప్రతీక!
ఇవాళ రాష్ట్రవ్యాపితంగా సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యమ జ్వాలలు చెలరేగుతున్నాయంటే.. వారి డిమాండు సమైక్య రాష్ట్రమే కావచ్చు.. కానీ, మౌలికంగా వారిని ప్రేరేపిస్తున్న చోదక శక్తి మాత్రం సమన్యాయం జరగకపోవచ్చునన్న భయాందోళన. సరిగ్గా వారికి న్యాయం చేసే, వారు న్యాయంగా భావించే వాదనకు దన్నుగా నిలిచే ఏకైక పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక విధానాన్ని తీసుకుంది. ఏకంగా పార్టీ అధ్యక్షురాలు ఆత్మత్యాగానికైనా వెరవని నిరవధిక నిరాహార దీక్షకు పూనుకున్నారు.
దీక్షలు ఇతర పార్టీ వారి ఆధ్వర్యంలోనూ జరుగుతున్నాయి. మంచి పని కోసం ఎవరు చేసే దీక్ష అయినా సమర్థించదగినదే. అయితే నోటితో పొగడి నొసటితో వెక్కిరిస్తున్నట్లుగా… పార్టీ విధానం ఒక తీరుగా నడుస్తోంటే.. ఒక వ్యక్తిగా చేసే దీక్షలు వీధినాటకాలను మాత్రమే తలపిస్తూ ప్రజల్ని వంచించే మార్గంలో ఉన్నాయి. భర్తలు అధికార పదవులు వెలగబెడుతోంటే.. అతివలు దీక్షకు పూనుకోవడం, పార్టీ అధినేతలు రెండు కళ్లను రెండు నాల్కలను అలల్లాడిస్తోంటే.. అనుచరులు దీక్ష డ్రామాలను ప్లే చేయడం.. ఈ వంచనలతో ప్రజలు విసిగిపోయారు. ఇలాంటి సమయంలోనే యావత్తు సీమాంధ్ర ప్రాంతంలోనూ, రాజధాని నగరంలోనూ జరుగుతున్న ఉద్యమ నాదాన్ని మూర్తీభవింపజేస్తున్నట్లుగా విజయమ్మ దీక్ష రంగంలోకి వచ్చింది. విజయమ్మ దీక్షకు పార్టీ రహితంగా అందరూ మద్దతుగా నిలవాలని కాంగ్రెసు ఎమ్మెల్యేలే పిలుపు ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే.. ఆమె దీక్ష మీద యావత్తు జాతి ఎంతగా విశ్వాసం ఉందచుకున్నదో అర్థం చేసుకోవచ్చు.

వక్రవ్యూహాలకు చెల్లుచీటీ ఖరారు

ఈ దీక్ష, తదనుగుణంగా బలోపేతం కానున్న ఉద్యమం మీద ఇప్పుడు ప్రజల్లో ఆశలు హెచ్చుతున్నాయి. కాంగ్రెసు వక్ర రాజకీయ వ్యూహాలకు ఇది చెక్ పెడుతుందని అందరూ భావిస్తున్నారు. విజయమ్మ దీక్ష ప్రకటనతోనే కాంగ్రెసు పార్టీలో అంతర్మధనం మొదలైంది. పార్టీ ఇప్పుడు మల్లగుల్లాలు పడుతోంది. యావత్తు సీమాంధ్ర ఉద్యమ జ్వాలలు తమకు చుక్కానిగా విజయమ్మ దీక్షను ఎంచుకోవడం అనేది కేంద్రాన్ని ఆత్మరక్షణలో పడేసే పరిస్థితి కనిపిస్తోంది.
తమ నిర్ణయాన్ని తాము అనుకున్న రీతిలో వక్రంగా విచ్చలవిడిగా ముందుకు తీసుకువెళ్లడానికి ఇప్పుడు వారిలో జంకు మొదలైంది. అందుకే పునరాలోచనలో పడ్డారు. అయితే క్రెడిట్‌ను విజయమ్మ దీక్ష ఖాతాలో పడకుండా చూడడానికి సీమాంధ్ర కాంగ్రెసు నాయకులు ఆంటోనీ కమిటీకి రెప్రజెంట్ చేసే విషయంలోనూ సమన్యాయం అనే అచ్చంగా ఇదే పదాన్ని వాడేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిన్నటిదాకా ఒక పాట పాడిన సీమాంధ్ర కాంగ్రెసు నాయకులు ఇప్పుడు ‘సమన్యాయం’ అనే పదాన్ని జోడించి పాడుతున్నారు. ఇదంతా కేవలం విజయమ్మ ఖాతాలోకి విజయాలు చేరకుండా అడ్డుకోవచ్చుననే కుట్ర మాత్రమే.
అయితే ప్రజా కోర్టు, ప్రజల సంయమనం అన్ని పోకడలను చాలా సునిశితంగా గమనిస్తూనే ఉంటుందనడంలో ఎలాంటి సంశయం లేదు. వక్రనీతులన్నీ ఎండగట్టడం జరుగుతుంది. నిష్కల్మషంగా ప్రజలకోసం పోరాడుతున్న వారికే పట్టం కట్టడం జరుగుతుంది. తథ్యం!

http://greatandhrapaper.com/articles/news_/2799/
Share this article :

0 comments: