జగన్ కోరిక మేరకే దీక్ష - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ కోరిక మేరకే దీక్ష

జగన్ కోరిక మేరకే దీక్ష

Written By news on Tuesday, August 20, 2013 | 8/20/2013

****  జైల్లో వున్నా ప్రజల గురించే ఆలోచిస్తున్నాడు
 ****  మహానేత వైఎస్ ఉంటే ఇన్నిమార్పులు జరిగేవి కావు
 ****  కాంగ్రెస్, టీడీపీలు కుట్రలు చేసి ముక్కలు చేస్తున్నాయి
 ****  పదవుల కోసం తెలుగు ప్రజలను విడదీస్తున్నారు
 ****  ‘సమరదీక్ష’లో వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ 
 
 సాక్షి, గుంటూరు/న్యూస్‌లైన్, పట్నంబజార్ : మహానేత వైఎస్ బతికి ఉంటే రాష్ట్రంలో ఇన్ని మార్పులు జరిగేవి కాదనీ, ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెస్, టీడీపీలు రాజకీయ కుట్రలు చేస్తూ రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని ప్రయత్నిస్తున్నాయని  వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి కుటుంబంలా కలసి మెలసి ఉండాల్సిన తెలుగు ప్రజల్ని విడదీసి పదవులు పంచుకోవాలని చూస్తున్నాయని ధ్వజమెత్తారు. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపకుండా ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ నిరంకుశ వైఖరికి నిరసనగా విజయమ్మ సోమవారం గుంటూరులో ‘సమరదీక్ష’ చేపట్టారు. 
 
 ఈ సందర్భంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సమైక్యవాదులను ఉద్దేశించి ఆమె ఉద్వేగభరితంగా ప్రసంగించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జైల్లో వున్నా ప్రజల గురించే ఆలోచిస్తున్నారని, ఆయన కోరిక మేరకు తాను సమరదీక్ష ప్రారంభించినట్టు వెల్లడించగా ప్రజలు తమ కరతాళధ్వనులతో సంఘీభావం ప్రకటించారు. ప్రజలంతా సమైక్యంగా రాష్ట్ర పరిరక్షణకు కృషి చేయాలని  పిలుపునిచ్చారు. అనంతరం విజయమ్మ దీక్షకు ఉపక్రమించారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన పార్టీ నాయకులు పలువురు ప్రసంగించారు. 
 
 సోనియా మూల్యం చెల్లించుకోకతప్పదు...
 రాష్ట్రాన్ని తన కుమారుడు రాహుల్‌గాంధీ స్వార్థం కోసం ముక్కలు చేసిన యూపీఏ అధినేత్రి సోనియా మూల్యం చెల్లించుకోక తప్పదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.  రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రలో గుక్కెడు తాగునీరు కూడా లభించే అవకాశాలు లేవని పార్టీ కృష్ణా, గుంటూరు జిల్లాల సమన్వయకర్త ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు. పార్టీ శాసనసభా పక్ష ఉపనేత ఎమ్మెల్యే మేకతోటి సుచరిత మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల భవిష్యత్‌పై వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహాన్‌రెడ్డికి ఉన్న చిత్తశుధ్ధి మరే నాయకుడికీ లేదని స్పష్టం చేశారు.  పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ టీడీపీ అధ్యక్షుడు  చంద్రబాబు గోడమీద పిల్లిలా వ్యహరిస్తున్నారని మండిపడ్డారు. 
 
 విజయమ్మ దీక్ష చరిత్రాత్మకం... పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ  కేవలం రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయటానికి రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే సీమాంధ్రులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. పార్టీ కార్యనిర్వాహక మండలి సభ్యులు రావి వెంకటరమణ ప్రజల కష్టాలు తీర్చేందుకు విజయమ్మ చేపట్టిన దీక్ష చరిత్రాత్మక ఘట్టంగా మిగిలిపోతుందని చెప్పారు. సీమాంధ్ర ప్రజలకు సమ న్యాయం జరిగే వరకు వైఎస్సార్ సీపీ పోరాటాన్ని ఆపదని కోన రఘుపతి  స్పష్టం చేశారు. పార్టీ నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ నేతలకు ఉన్న దమ్ము ధైర్యం అధికార ప్రతిపక్షాలకు ఎంతమాత్రం లేవన్నారు. పార్టీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ కావటి మనోహరనాయుడు మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమం ప్రస్తుతం ప్రజల చేతుల్లో ఉందన్నారు.
 
 ఉద్యమంలో మహిళలే అధికం... 
 పార్టీ బీసీ విభాగం జిల్లా కన్వీనర్ దేవళ్ళ రేవతి మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమంలో మహిళలే అధికంగా వస్తున్నారని తెలిపారు. పార్టీ మైనారీటి విభాగం జిల్లా కన్వీనర్ సయ్యద్‌మాబు, పార్టీ విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ ఉప్పూటూరి నర్సిరెడ్డి, ఎస్టీ విభాగం జిల్లా కన్వీనర్ మేరాజోతు హనుమంత్‌నాయక్‌లు మాట్లాడారు.
 
 ముక్కలు చేసే హక్కు సోనియాకు ఎవరిచ్చారు...
 పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు వరుసగా మాట్లాడారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికలను సైతం యూపీఏ సర్కార్‌కు తుంగలో తొక్కిందని షేక్ షౌకత్ మండిపడ్డారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసే హక్కును సోనియాగాంధీకి ఎవరిచ్చారని ఎండీ నసీర్‌అహ్మద్ ప్రశ్నించారు.  సమైక్యాంధ్ర ఉద్యమం కోసం పోరాడుతోంది వైఎస్సార్ సీపీ మాత్రమేనని బొల్లా బ్రహ్మనాయుడు తెలిపారు. మంత్రులు ఉద్యమానికి మద్దతు తెలపకుండా సీమాంధ్ర ద్రోహులుగా మిగిలిపోనున్నారని రాతంశెట్టి రామాజంనేయులుచెప్పారు.  మహానేత వైఎస్సార్ బతికి ఉంటే రాష్ట్ర విభజన అంశం తెరపైకే వచ్చేది కాదని  ఈపూరి అనూప్, మందపాటి శేషగిరిరావు, కొల్లిపర రాజేంద్రప్రసాద్‌లు చెప్పారు. విభజన పక్రియ ఆగదని పదేపదే యూపీఏ నాయకులు ప్రకటనలు చేయటం సిగ్గుచేటని గోపిరెడ్డి శ్రీనివాసరె డ్డి అన్నారు. కేవలం కాంగ్రెస్, టీడీపీ నాయకుల స్వార్థం కోసం విభజన చేశారని మేరుగ నాగార్జున పేర్కొన్నారు. పదవీ కాంక్షతో కేంద్రం రాష్ట్ర  విభజనకు పూనుకోవటం సమర్థనీయం కాదని  నన్నపనేని సుధ అన్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని గుదిబండి చినవెంకటరెడ్డి  కోరారు. 
Share this article :

0 comments: