వైఎస్ జగన్ ను నిమ్స్ కు తరలించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ జగన్ ను నిమ్స్ కు తరలించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు

వైఎస్ జగన్ ను నిమ్స్ కు తరలించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు

Written By news on Friday, August 30, 2013 | 8/30/2013

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా గత ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించింది. ఆయనను నిమ్స్ కు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. నిమ్స్ ఎమర్జెన్సీ వార్డులో పోలీసులు అణువణువూ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అలాగే ఆస్పత్రి ప్రాంగణం మొత్తం పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. నిమ్స్, ఉస్మానియా వైద్య అధికారులుతో పోలీసులు మాట్లాడుతున్నారు. నిమ్స్ కు తరలించేందుకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సిద్ధం చేసినట్టు కూడా వార్తలు అందుతున్నాయి. మరోవైపు జగన్ ను నిమ్స్ కు తరలించిన పక్షంలో ఆయనను చూసేందుకు ఆయన తల్లి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, భార్య వైఎస్ భారతి ఇప్పటికే నిమ్స్ వద్దకు చేరుకున్నారు.

గురువారం అర్ధరాత్రి సమయంలో చంచల్ గూడ జైలు నుంచి ఉస్మానియా ఆస్పత్రికి జగన్ ను తరలించినా, అక్కడ కూడా ఆయన తన నిరవధిక దీక్షను కొనసాగిస్తూనే ఉన్నారు. ఫ్లూయిడ్స్ తీసుకోడానికి కూడా నిరాకరిస్తుండటంతో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించినట్లు వైద్యులు వెల్లడించారు. జగన్ ను చూసేందుకు ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లిన ఆయన తల్లి వైఎస్ విజయమ్మ, భార్య వైఎస్ భారతిలను లోనికి అనుమతించకపోయినా.. తర్వాత వైద్యులే బయటకు వచ్చి ఆయన ఆరోగ్య పరిస్థితిని వారికి వివరించారు.

వైద్యానికి జగన్ నిరాకరించడంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమిస్తే, బలవంతంగానైనా ఫ్లూయిడ్స్ ఎక్కిస్థామని ఉస్మానియా ఆస్పత్రి ఆర్ ఎం ఓ రఫీ తెలిపారు.
షుగర్ లెవల్స్ గణనీయంగా తగ్గాయని, కీటోన్స్ 4+, షుగర్ లెవల్ 49కి పడిపోయినట్టు, బీపీ 110/70 ఉన్నట్టు హెల్త్ బులెటిన్ లో వెల్లడించారు.
Share this article :

0 comments: