ఆరోగ్యం క్షీణించినా దీక్ష విరమించనన్న విజయమ్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆరోగ్యం క్షీణించినా దీక్ష విరమించనన్న విజయమ్మ

ఆరోగ్యం క్షీణించినా దీక్ష విరమించనన్న విజయమ్మ

Written By news on Thursday, August 22, 2013 | 8/22/2013


ఆరోగ్యం క్షీణించినా దీక్ష విరమించనన్న విజయమ్మ
గుంటూరు: విభజనకు కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానానికి వ్యతిరేకంగా, ఇరు ప్రాంతాలకు న్యాయం చేయలేకపోతే  రాష్ట్రాన్ని విభజించవద్దన్న డిమాండ్ తో  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ గుంటూరులో చేస్తున్న సమరదీక్షకు సీమాంధ్ర వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. అన్ని వర్గాల ప్రజలు ఆమెకు సంఘీభావం తెలుపుతూ దీక్షలు చేస్తున్నారు. రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. విజయమ్మ ఈరోజు  బాగా నీరసించారు. ఈరోజు ఆమెకు పరీక్షలు చేసిన డాక్టర్లు  పల్స్‌, బీపీ, షుగర్ లెవల్స్‌ బాగా తగ్గాయని చెప్పారు.  ద్రవాహారాన్ని తీసుకునేందుకు కూడా ఆమె నిరాకరిస్తున్నారు. తక్షణమే దీక్ష విరమించాలని  డాక్టర్లు సూచించారు. లేదంటే ఆరోగ్యం దెబ్బతింటుందన్న డాక్టర్లు హెచ్చరించారు. ఆమె వయసుకు ఈ విధంగా దీక్ష చేపట్టడం మంచిదికాదని చెప్పారు. వెంటనే ఆమెను ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేయాలని వారు చెప్పారు. అయినా ఆమె మొక్కవోని పట్టుదలతో 4వ రోజు సమరదీక్ష కొనసాగిస్తున్నారు.

రాష్ట్రం నలుమూలల నుంచి పలువురు ప్రముఖులు వచ్చి ఆమెకు సంఘీభావం తెలుపుతున్నారు. ఈరోజు కుటుంబ సభ్యులు వైఎస్ భారతీ, షర్మిల, వైఎస్ వివేకానందారెడ్డి వచ్చి ఆమె పరామర్శించారు. పార్టీ నేత మైసూరారెడ్డితోపాటు పలువురు నాయకులు వచ్చి సమరదీక్షకు మద్దతు తెలిపారు.

వేమూరు నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ బాధ్యుడు మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో విజయమ్మ దీక్షకు మద్దతుగా  భారీగా నేతలు కార్యకర్తలు తరలివచ్చారు. కృష్ణా జిల్లా పామర్రు నుంచి పార్టీ సీఈసీ సభ్యురాలు ఉప్పులేటి కల్పన ఆధ్వర్యంలో భారీగా  కార్యకర్తలు తరలి వచ్చారు. ప్రకాశం జిల్లా  గిద్దలూరు వైఎస్ఆర్‌ సీపీ సమన్వయకర్త ముత్తుముల్ల అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో గిద్దలూరు, రాచర్ల, కొమరోలు, బేస్తవారిపేట, అర్దవీడులలో వైఎస్ఆర్ సీపీ నేతలు ర్యాలీలు నిర్వహించారు. దీక్షలు చేస్తున్నారు.



విభజనకు కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానానికి వ్యతిరేకంగా, ఇరు ప్రాంతాలకు న్యాయం చేయలేకపోతే  రాష్ట్రాన్ని విభజించవద్దన్న డిమాండ్ తో  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ గుంటూరులో చేస్తున్న సమరదీక్షకు సీమాంధ్ర వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది.








Share this article :

0 comments: