చంద్రబాబుకు వైఎస్సార్ కాంగ్రెస్ నేతల బహిరంగ లేఖ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబుకు వైఎస్సార్ కాంగ్రెస్ నేతల బహిరంగ లేఖ

చంద్రబాబుకు వైఎస్సార్ కాంగ్రెస్ నేతల బహిరంగ లేఖ

Written By news on Wednesday, August 21, 2013 | 8/21/2013

హైదరాబాద్ : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓ బహిరంగ లేఖ రాశారు. పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యే మేకతోటి సుచరిత టీడీపీ అధినేతకు ఈ లేఖాస్త్రం సంధించారు. లేఖ పూర్తి పాఠం ఇలా ఉంది...

'తమ మీద వారు కుట్ర చేశారు.. వీరు కుట్ర చేశారని చంద్రబాబు నాయుడు ఎంతుకు అంతగా గింజుకుంటున్నారు? టీడీపీని అక్కడా, ఇక్కడా, ఎక్కడా లేకుండా చేయాలని కుట్రపన్నారని ఆయన అంటున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇంత దుస్థితిలో ఉందంటే అందుకు కారణం చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలు మాత్రమే. అందుకు కారణం ఆయనకు విశ్వసనీయత లేకపోవడం. నిస్సిగ్గుగా ప్రజలంతా రాజకీయాల్లో ప్రతి కదలికనూ గమనిస్తున్నారనే భయం కూడా లేకుండా.. రిటెయిల్ లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్.డి.ఐ.)ని అనుమతించే బిల్లుమీద రాజ్యసభలో ఓటింగ్ జరుగుతున్నప్పుడు ఈ దేశ ప్రజల తరఫున నిలబడకుండా, కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై, చంద్రబాబు గారూ.. మీ ఎంపీల చేత గైర్హాజరు చేయించడం నిజం కాదా అని మేం అడుగుతున్నాం. రాష్ట్రంలోని ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో విసుగెత్తి... అన్ని ప్రతిపక్ష పార్టీలూ అవిశ్వాసం ప్రవేశపెడితే మీరు మాత్రం ఏకంగా విప్ జారీచేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడారు. చంద్రబాబు గారూ.. ఇప్పుడు కూడా మీరు చేస్తున్నది ఏమిటి? కాంగ్రెస్ వారేమో ఓట్ల కోసమని, సీట్ల కోసమని, క్రెడిట్ కోసమని రాష్ట్రాన్ని విభజిస్తుంటే... అన్యాయం జరుగుతోంది అని తెలిసి స్పందించవలసిన మీరు ఓట్లు పోతాయని, సీట్లు పోతాయని, క్రెడిట్ రాకుండా పోతుందేమోనని, అన్యాయం జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నారు. ఏపీ ఎన్జీవోలు మీ వద్దకు వచ్చి అన్యాయం జరుగుతోంది, మీరు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఉత్తరం వెనక్కి తీసుకోండి అని ప్రాధేయపడినా నిర్దయగా, కనికరం లేకుండానే నేను తీసుకోను అని తెగేసి చెప్పారు. మిమ్మల్ని రాజీనామా చేయమని కోరితే రాజీనామా చేయను ఫొమ్మన్నారు. మీ ఎమ్మెల్యేల అందరిచేత రాజీనామా చేయించండి అని అడిగితే చేయించను పొమ్మన్నారు.

ఇలా రాష్ట్రంలో కోట్ల మందికి అన్యాయం జరుగుతున్నా మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీరు రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారు. ఇందుకే దేవుడు ప్రజల్లో మిమ్మల్ని ఎక్కడా లేకుండా చేస్తాడు. ఇప్పటికైనా చరిత్ర హీనులుగా మిగిలిపోకండి. మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఇలా గింజుకునే బదులు మీరు రాజీనామా చేయండి, మీ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించండి, విభజన మీద మీరిచ్చిన లేఖను వెనక్కు తీసుకోండి. వద్దని ఎవరన్నారు? అలా చేస్తే మీకు అంతో ఇంతో గౌరవం మిగులుతుంది. మీరు చేయాల్సిన పని చేయకుండా ఇలా అందరినీ దూషించడం వల్ల మీరే పలచన అవుతారు. జరుగుతున్న ఈ అన్యాయానికి మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా?

విభజన జరిగితే కృష్ణా ఆయకట్టులో రోజూ గొడవలే
ఇప్పటికే పైన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంలు నిండితే తప్ప కిందకు నీరు వదలని పరిస్థితి. అలాంటప్పుడు మధ్యలో ఇంకో రాష్ట్రం ఏర్పడితే శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్లు ఎక్కడినుంచి వస్తాయి, నాగార్జున సాగర్‌కు నీళ్లు ఎక్కడనుంచి వస్తాయి? కింద ఉన్న రాష్ట్రానికి కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా సముద్రం నీళ్లు తప్ప మంచినీళ్లు ఎక్కడున్నాయి?
పోలవరానికి జాతీయ హోదా అని అంటున్నారు. రాష్ట్రం రెండు ముక్కలైతే పోలవరానికి నీళ్లు ఎలా వస్తాయి?
రాష్ట్ర రాజధానిగా ఆరు దశాబ్దాల నుంచి ఉన్న హైదరాబాద్‌ ను తెలంగాణకు ఇస్తే... రాష్ట్ర బడ్జెట్‌లో సగం ఆదాయం పోతుంది. ఆ డబ్బే రాకపోతపే సామాజిక సంక్షేమ కార్యక్రమాలు ఎలా అమలుచేయగలం? ఎలా ఇవ్వగలుగుతారు జీతాలు?
చదువుకున్న ప్రతి పిల్లవాడు, చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం కోసం ఎక్కడకు వెళ్లాలి?
పైన మేం అడిగినవి చాలా చిన్న అంశాలు. ఇటువంటి వాటికే పరిష్కారం లేనప్పుడు, రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడం తప్పు కాదా?
Share this article :

0 comments: