జగన్ ఆరోగ్య పరిస్థితిపై జైలు అధికారుల సమీక్ష - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ ఆరోగ్య పరిస్థితిపై జైలు అధికారుల సమీక్ష

జగన్ ఆరోగ్య పరిస్థితిపై జైలు అధికారుల సమీక్ష

Written By news on Thursday, August 29, 2013 | 8/29/2013

జగన్ ఆరోగ్య పరిస్థితిపై జైలు అధికారుల సమీక్ష
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి  ఆరోగ్య పరిస్థితిని చంచల్‌గూడ జైలు అధికారులు సమీక్షించారు. రాష్ట్ర విభజన విషయంలో ఇరుప్రాంతాలకు సమన్యాయం చేయాలని, అలా చేయలేకపోతే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలన్న డిమాండ్ తో ఆయన ఆమరణదీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన దీక్ష 5వ రోజుకు చేరింది. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు సమావేశమయ్యారు.

అనంతరం జైలు అధికారులు మాట్లాడుతూ జగన్ దీక్షపై వైద్యుల సలహాల మేరకే నడుచుకుంటామని చెప్పారు. ఎప్పటికప్పుడు ఆయనను వైద్యులు పరీక్షిస్తున్నట్లు తెలిపారు. ఆయన  ఆరోగ్యంగా ఉన్నంతవరకు ఆయన్ను బలవంతపెట్టం అని చెప్పారు. వైద్యుల సూచనల మేరకు అవసరమైన వైద్యాన్ని  అందిస్తామన్నారు. ఆయనను ఆస్పత్రికి తరలించే విషయాన్ని ఇప్పుడే చెప్పలేం అన్నారు.

 జైళ్ల శాఖ డీజీ  సాంబశివరావు సమక్షంలో ఉన్నతాధికారులు ఈ సాయంత్ర మరోమారు సమావేశమవుతారు. జగన్ ఆరోగ్య పరిస్థితి,  తీసుకోవాల్సిన చర్యల గురించి సమాలోచన జరుపుతారు.

 నిర్బంధంలో ఉంటూ ఐదు రోజులుగా నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న జగన్‌ ఆరోగ్యం గురువారం ఆందోళనకరంగా మారిన విషయం తెలిసిందే. ఆయనను ఉదయం 10.30 గంటల ప్రాంతంలో పరీక్షించిన జైలు వైద్యులు రక్తంలో ఒక్కసారిగా  చక్కెర శాతం సాధారణ స్థాయి కన్నా  బాగా పడిపోయినట్లు నిర్థారించారు. ఇది చాలా ఆందోళనకరమైన పరిస్థితి అని అని తెలిపారు.  ఆహారం తీసుకోవాల్సిందిగా  వైద్యులు జగన్‌కు సూచించారు. అయితే ఆయన అందుకు సమ్మతించలేదు. బాగా నీరసంగా ఉన్నప్పటికీ ఆయన తనకు ఎలాంటి ఆహారం వద్దని తిరస్కరించినట్లు జైలు అధికారుల ద్వారా తెలిసింది. తనను బలవంతం చేయవద్దని ఆయన అధికారులను కోరినట్లు చెబుతున్నారు
Share this article :

0 comments: