కార్పొరేషన్ గెలుపే లక్ష్యం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కార్పొరేషన్ గెలుపే లక్ష్యం

కార్పొరేషన్ గెలుపే లక్ష్యం

Written By news on Saturday, August 10, 2013 | 8/10/2013

ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్: కార్పొరేషన్‌ను గెలుపొందడమే వైఎస్‌ఆర్ సీపీ లక్ష్యమని ఆ పార్టీ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఆయన శుక్రవారం ఖమ్మంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఖమ్మం కార్పొరేషన్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కార్పొరేషన్‌లోగల 50 డివిజన్లలో అత్యధిక స్థానాలను గెలుపొంది, మేయర్ పదవి సాధించేందుకు పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే కృషి చేయాలని కోరారు. ఆయా డివిజన్ నాయకులు తమ పరిధిలోని ఓటర్లందరినీ కలుసుకుని, వైఎస్‌ఆర్ అందించిన సంక్షేమ పాలనను గుర్తు చేసి... దానిని తిరిగి తీసుకురాగల సత్తా వైఎస్‌ఆర్ సీపీకి మాత్రమే ఉందన్న విషయాన్ని వివరించాలని కోరారు.
 
  అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కుమ్మక్కు రాజకీయాలను, కుట్రలు.. కుతంత్రాలను వివరించాలని కోరారు. నిరుపేదలకు నిలువ నీడనిచ్చేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఆయన హయాంలో ఎంత సమర్థవంతంగా అమలైందీ.. ఆ తరువాత ఎలా నిర్వీర్యమైందీ వివరించాలని చెప్పారు. కార్పొరేషన్‌గా ఏర్పాటైన తరువాత కూడా ప్రజాసమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైన విషయాన్ని సోదాహరణంగా వివరించాలని కోరారు. రాజన్న రాజ్యాన్ని తిరిగి సాధించేందుకు ఇకపై జరిగే ప్రతి ఎన్నికల్లోనూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీనే గెలిపించాల్సిన అవసరాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని చెప్పారు. కాంగ్రెస్-టీడీపీ కలిసి జగన్‌మోహన్‌రెడ్డిని కుట్రపూరితంగా జైలుకు పంపడాన్ని రాష్ట్ర ప్రజలు గమనించారని, అందుకే వారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పక్షాన నిలిచి.. జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్యాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను వైఎస్‌ఆర్ సీపీ మద్దతుదారులు గెలుపొందడమే దీనికి నిదర్శనమని అన్నారు. ఖమ్మం జిల్లాను వైఎస్‌ఆర్ సీపీ ఖిల్లాగా మార్చేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని కోరారు.
 
 సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, యువజన విభాగం మూడు జిల్లాల సమన్వయకర్త సాధు రమేష్‌రెడ్డి, పార్టీ అనుబంధ సంఘాల కన్వీనర్లు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు, కార్పొరేషన్‌లోని ముఖ్య నాయకులు హెచ్.వెంకటేశ్వర్లు, ఎస్.వెంకటేశ్వర్లు, మెండెం జయరాజ్, బానోత్ శారద, పద్మాజారెడ్డి, జమలాపురం రామకృష్ట, మందడపు వెంకటేశ్వరావు, మార్కం లింగయ్య, కొంగర జ్యోతిర్మయి, శ్రీలక్ష్మి, తిరుపతిరావు, షర్మిలా సంపత్, తుమ్మా అప్పిరెడ్డి, అరవింద్, మైపా కృష్ణ, బాలాజీ, సాము వెంకటరెడ్డి, వాలూరి సత్యనారాయణ, బాజిన్ని తిరుపతిరావు, జిల్లేపల్లి సైదులు, వాలూరి సత్యనారాయణ, కృష్టవేణి తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: