జగన్ కి సహయంగా ఉండేందుకు భారతికి కోర్ట్ అనుమతి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ కి సహయంగా ఉండేందుకు భారతికి కోర్ట్ అనుమతి

జగన్ కి సహయంగా ఉండేందుకు భారతికి కోర్ట్ అనుమతి

Written By news on Saturday, August 31, 2013 | 8/31/2013


జగన్ ఆరోగ్యం బాగా దెబ్బతినడంతో జగన్ కి సహయంగా   అనుమతి.
ఉదయం 8 నుండి సాయంత్రం 4 వరకు ఆసుపత్రిలో జగన్ ఉన్నత కాలం సహయంగా ఉండేందుకు అనుమతి .

 ఏడు రోజులుగా దీక్ష కొనసాగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డికి సాయంగా ఉండేందుకు ఆయన తల్లి వైఎస్ విజయమ్మ,  సతీమణి భారతికి కోర్టు అనుమతి ఇచ్చింది. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటలకు వరకూ వారు జగన్ తో ఉండేందుకు న్యాయస్థానం అంగీకరించింది. జగన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యేవరకూ వారు సాయంగా ఉండేందుకు కోర్టు అనుమతి తెలిపింది. కోర్టు తీర్పుతో విజయమ్మ, భారతి .... నిమ్స్ కు బయల్దేరారు.

కాగా రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచమని కోరుతూ జగన్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తుండటంతో ఆరోగ్యం క్షీణించింది. దాంతో ఆయనకు సాయంగా ఉండేందుకు అనుమతించాలని కోరుతూ జగన్ సతీమణి.భారతి శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టుకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. జగన్ తల్లి విజయమ్మ లేదా తనను సాయంగా ఉండేందుకు అనుమతించాలని కోరుతూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు విచారణ చేపట్టి, విచారణను నేటికి వాయిదా వేశారు. ఈ పిటిషన్ నిమిత్తం భారతి శుక్రవారం స్వయంగా కోర్టుకు హాజరై విజ్ఞప్తి చేశారు.
Share this article :

0 comments: