`హెల్త్ బులెటిన్ గోప్యంగా ఉంచటం మానవ హక్కుల ఉల్లంఘనే` - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » `హెల్త్ బులెటిన్ గోప్యంగా ఉంచటం మానవ హక్కుల ఉల్లంఘనే`

`హెల్త్ బులెటిన్ గోప్యంగా ఉంచటం మానవ హక్కుల ఉల్లంఘనే`

Written By news on Thursday, August 29, 2013 | 8/29/2013

రాష్ట్ర విభజన విషయంలో ఇరుప్రాంతాలకు సమన్యాయం చేయాలని, అలా చేయలేకపోతే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలన్న డిమాండ్ తో  చంచల్ గూడ జైలులో ఐదు రోజులుగా ఆమరణదీక్ష చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆరోగ్యంపై నిన్న సాయంత్రం నుంచి జైలు అధికారులు అధికారకంగా హెల్త్ బులెటన్ విడుదల చేయకపోవడంపై అనుమానులు తలెత్తున్నాయి. దీంతో జగన్ అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం జగన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందనే జైలు అధికారులు చెబుతున్నా, వారు చేసే హడావుడి చూస్తే మాత్రం ఆయన పరిస్థితి బాగాలేదని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో జైల్లో నిరవధిక దీక్ష చేపట్టిన వైఎస్ జగన్ ఆరోగ్యంపై సమాచారం అందిచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, గోప్యంగా ఉంచడం రాజ్యంగ ఉల్లంఘనేనని అంటూ వైఎస్ఆర్ సీపీ లీగల్ సెల్ కో ఆర్డినేటర్ నాగేశ్వరరావు విమర్శించారు. అంతేకాకుండా వైఎస్ జగన్ వ్యక్తిగత హక్కులను జైలు అధికారులు నిర్వీర్యంచేశారంటూ  ఆయన ఆరోపించారు. జగన్ దీక్షపై కోర్టుకు నివేదించడం కూడా మానవ హక్కుల ఉల్లంఘనేనని తెలిపారు. దీక్ష సమయంలో జగన్ ఎవ్వర్నీ కలవకపోయినా ములాఖత్‌లు రద్దుచేశామంటూ ప్రచారం చేశారని అన్నారు. అసలు ములాఖత్‌లు రద్దుచేశామంటూ ప్రచారంచేయడం కూడా హక్కుల ఉల్లంఘనేనని నాగేశ్వరరావు పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, ఏ క్షణంలోనైనా వైఎస్ జగన్ ను ఉస్మానియా ఆస్పత్రికి తీసుకవెళ్లవచ్చుననే సమాచారంతో ముందుస్తు జాగ్రత్త చర్యగా ఉస్మానియా పరిసరాల్లో అణువుణునా తనిఖీలు చేపట్టారు. ఇప్పటికే చంచల్ గూడ జైలు వద్ద బారీ కేడ్లను ఏర్పాటుచేశారు.
Share this article :

0 comments: