బాబు ఇల్లు అమ్మితే 2 కోట్లకు కొనుక్కుంటాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు ఇల్లు అమ్మితే 2 కోట్లకు కొనుక్కుంటాం

బాబు ఇల్లు అమ్మితే 2 కోట్లకు కొనుక్కుంటాం

Written By news on Tuesday, September 17, 2013 | 9/17/2013

బాబు ఇల్లు అమ్మితే 2 కోట్లకు కొనుక్కుంటాం
ఒంగోలు : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆస్తుల ప్రకటన పచ్చి భూటకమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న ఇల్లు 23 లక్షలే అని బాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. ఆయన తన ఇంటిని అదే ధరకు అమ్మితే రూ.2 కోట్లకు కొనుక్కుంటామన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులకు ఎంత డబ్బు పంపిణీ చేస్తున్నారో ప్రజలందరికి తెలుసని బాలినేని వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు ప్రతి ఎమ్మెల్యే ఆస్తులు అఫిడవిట్ ఇస్తారని, అయితే బాబు మాత్రం ప్రత్యేకంగా ఆస్తులు ప్రకటించుకొన్నట్లుగా గొప్పలు చెప్పుకుంటున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబు ఆస్తులు పారదర్శకంగా ఉంటే సీబీఐ విచారణను ఎందుకు ఆపించారో చెప్పాలని బాలినేని డిమాండ్ చేశారు.
Share this article :

0 comments: