నిను మరువం రాజన్నా.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నిను మరువం రాజన్నా..

నిను మరువం రాజన్నా..

Written By news on Monday, September 2, 2013 | 9/02/2013

నమస్తే అన్నా.. నమస్తే అక్కా.. నమస్తే చెల్లెమ్మా.. అంటూ ఆప్యాయంగా పలకరించే వైయస్ఆర్ గొంతు మూగబోయి నేటికి నాలుగేళ్లవుతోంది. తాను ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో స్వర్ణయుగానికి బాటలు వేసిన ఆ మహానేత ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్నారు. ముఖ్యమంత్రిగా తన పాలనా కాలంలో ఆయన చేసిన మేలు మరువలేనిది. ఉచిత విద్యుత్ మొదలు జలయజ్ఞం వరకూ నిరంతరం రైతుల కోసం తపిస్తూ.. దండగన్న వ్యవసాయాన్ని పండగలా మార్చిన ఘనత ఆయనదే.

ఉచిత విద్యుత్ ద్వారా రైతులు బావులు, బోర్ల కింద రెండు పంటలు పండించుకుంటున్నారు. తమ కడుపు నింపుకోవడంతోపాటు నలుగురికి అన్నం పెడుతున్నారంటే అది మహానేత చలవే. సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, యంత్రపరికరాలు, పంట రుణాలు అందించడంతోపాటు పండించిన ధాన్యానికి మద్దతుధర కల్పించి అన్నదాతలకు ఆత్మబంధువయ్యారు. జలయజ్ఞం పథకం భారీ ప్రాజెక్టులకు పునాది వేశారు.

పేదలకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు రూపొందించిన ఆరోగ్యశ్రీ పథకంలో వైద్యసహాయం పొందిన వారంతా వైఎస్సార్‌ను ప్రాణదాతగా కొలుస్తున్నారు. పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉన్నత చదువులకు దూరం కారాదనే ఉద్దేశంతో వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్ పథకం ద్వారా లక్షలాది మంది లబ్ధిపొందారు. ఉన్నత విద్యనభ్యసించి ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకున్నారు. అంతకుముందు రూ.75 ఉన్న సామాజిక పింఛన్లను రూ.200కు పెంచడం, రూ.2కే కిలో బియ్యం వంటి పథకాల ద్వారా వేలాది మంది పేదలకు పస్తులుండాల్సిన బాధలు తప్పాయి. వస్త్ర పరిశ్రమ అభివృద్ధితోపాటు ఆత్మహత్య చేసుకున్న నేతన్నల కుటుంబాలకు రూ.లక్షన్నర ప్యాకేజీ అందించడంతో ఆపద నుంచి గట్టెక్కారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో వేలాది మంది నిరుపేదల సొంతింటి కల నెరవేరింది.

వైఎస్సార్ అందించిన చేయూత వల్ల స్వశక్తి సంఘాల మహిళలు నేడు సొంతంగా పలు వ్యాపారాలు నిర్వహించే స్థాయికి ఎదిగారు. పావలా వడ్డీ రుణాలు, 60 ఏళ్లు నిండిన మహిళలకు అభయహస్తం పింఛన్లు ఇచ్చి ఆదుకున్న ఘనత కూడా వైఎస్సార్‌కే దక్కుతుంది.ఇలా చెప్పుకుంటుపోతే ఇంకా ఎన్నెనో ఉన్నాయి. సంక్షేమ పథకాలే కాకుండా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు వైఎస్.రాజశేఖరరెడ్డి బాటలు వేశారు. ఆయన పథకాలతో ఇంటింటికీ ఏదో విధంగా లబ్ధి జరిగిందంటే అతిశయోక్తికాదు. అందుకే ఆ మహానేతను ‘నిను మరువం రాజన్నా’ అంటూ జనం గుండెల్లో దాచుకున్నారు.


Share this article :

0 comments: