నమస్తే అక్కయ్యా...నమస్తే చెల్లెమ్మా...నమస్తే అన్నయ్యా...నమస్తే తమ్ముడూ... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నమస్తే అక్కయ్యా...నమస్తే చెల్లెమ్మా...నమస్తే అన్నయ్యా...నమస్తే తమ్ముడూ...

నమస్తే అక్కయ్యా...నమస్తే చెల్లెమ్మా...నమస్తే అన్నయ్యా...నమస్తే తమ్ముడూ...

Written By news on Tuesday, September 24, 2013 | 9/24/2013












http://www.sakshi.com/news/family/happy-mooment-in-jagan-67701

‘సాక్షి ఫ్యామిలీ’ :  

 పదహారు నెలలుగా ‘జగన్ కోసం’ కాలమ్ రన్ చేస్తున్నాం.
 ఇవాళ ‘జనం కోసం’ అని దాన్ని మార్చాలనిపించింది.
 వైయస్సార్ ‘ఫ్యామిలీ’లో మీరూ సభ్యులని మేమందరం ఎప్పుడూ అనుకునే వాళ్లం...
 ఇవ్వాళ అది ముమ్మాటికీ నిజమని తేలిపోయింది!
 మీ ఆశీస్సులు, మీ అభిమానం, మీ ప్రార్థనలు జగన్ కుటుంబానికి
 ఎనలేని శక్తిని, మనోధైర్యాన్ని ప్రసాదించాయి.
 వైయస్సార్ అస్తమయంతో గుండెలు అవిసిన తెలుగు కుటుంబాలు
 జగన్‌లో ఒక ఆశాజ్యోతిని చూసుకున్నాయి.
 ‘నమస్తే అక్కయ్యా, నమస్తే చెల్లెమ్మా, నమస్తే అన్నయ్యా, నమస్తే తమ్ముడూ...’ అంటూ
 ప్రేమగా పలకరించిన వైయస్సార్‌ను మళ్లీ జగన్‌లో చూసుకున్నారు.
 మా నాన్న నాకిచ్చిన ‘పెద్ద కుటుంబం’ మీరే అని జగన్ నినదించి ప్రజలకోసం పోరాడాడు.
 మీ స్పర్శలో, మీ ఆదరణలో తనూ ‘ఓదార్పు’ చెందాడు.
 మీ గుండెల్లో వైయస్సార్‌ని, మీ కళ్లల్లో ఆశలను,
 మీ కడుపులో బాధని చూసి తనను తాను మరచిపోయి పోరాడాడు.
 ‘‘రాజన్న రాజ్యం స్థాపిద్దాం, ప్రతి తెలుగు కంటి కన్నీరును తుడిచేద్దాం...’ అని
 ఉద్యమించిన ఈ యోధునికి జనం గుండెలు చరిచి స్వాగతం పలికారు.
 ప్రత్యర్థుల గుండెల్లో పిడుగులు పడ్డాయి...
 కుట్రలు, కుతంత్రాలు, పన్నాగాలు, విషకోరలు బుసకొట్టాయి...
 జననేతను జనంలో ఉండనివ్వకుండా చేశారు...
 కాని జననేతను జనం గుండెల్లోనుంచి దూరం చేయలేకపోయారు...
 జననేతను జనం ప్రార్థనల నుండి
 దూరం చేయలేకపోయారు...
 జననేతను తెలుగు కుటుంబం నుండి
 విభజించలేకపోయారు.
 16 నెలల తరువాత తెలుగు ‘ఫ్యామిలీ’ ఆశీర్వచనాలతో మళ్లీ పెద్దకొడుకు ఇంటికి తిరిగి వచ్చాడు... ప్రతి తెలుగు ఇంటి బాధ్యతను తన ధర్మంగా తీర్చడానికి వస్తున్నాడు...
 ఈ ఉద్వేగభరిత ప్రయాణంలో అడుగడుగునా
 ‘సాక్షి ఫ్యామిలీ’ పాఠకులు వైయస్సార్ కుటుంబానికి ఇచ్చిన అనంతమైన ప్రేమకు రుణం తీర్చుకుంటాడు...
 మీ ఇంట్లో తన ఊసు, మీ గుండెల్లో తన ఊపిరి,
 మీ ఆలోచనలలో తన ప్రార్థనకు...
 శిరసు వంచి... చేతులు జోడించి నమస్కరిస్తున్నాం.
 మీ ప్రేమ మమ్మల్ని ఎప్పుడో గెలుచుకుంది...
 ఇవాళ మీ ప్రేమ వల్ల ధర్మం గెలిచింది!

 జగన్ కోసం అసంఖ్యాకంగా ఉత్తరాలు రాసిన మీ అందరికీ మా మనఃపూర్వక ధన్యవాదాలు. మీ ఆవేదన, ఆక్రోశం మాకు అర్థమైంది. మీ ప్రార్థనలు, ఆశీస్సులు మాకు అందాయి. అయితే స్థలాభావం వల్ల అన్ని ఉత్తరాలనూ ప్రచురించలేకపోయాం. అలా ప్రచురించలేకపోయిన పేర్లు బ్యాక్‌గ్రౌండ్‌లో పొందుపరిచాం.

 484 రోజుల

 సుదీర్ఘ నిర్బంధం...
 అక్రమ నిర్బంధం...
 అనైతిక నిర్బంధం...
 అమానుష నిర్బంధం...
 కుట్రపూరిత నిర్బంధం... తొలగింది! జగన్ నేడు ప్రజల మధ్యకు వస్తున్నారు.
 సామాన్యులు, మేధావులు అన్న తేడా లేకుండా సమాజంలోని అన్ని వర్గాలవారూ జగన్ నిర్బంధాన్ని ప్రశ్నించారు.
 వేయి విధాలుగా ఏకస్వరంతో నిరసించారు... నినదించారు.
 అందరికీ ధన్యవాదాలు.
 అందరికీ శుభాభివందనాలు...
Share this article :

0 comments: