అడుగడుగునా నీరాజనాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అడుగడుగునా నీరాజనాలు

అడుగడుగునా నీరాజనాలు

Written By news on Tuesday, September 24, 2013 | 9/24/2013


జైలు నుంచి విడుదలయిన జననేతకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా నీరాజనాలు పలికారు. 16 నెలల కారాగార వాసం తర్వాత బయటికి వచ్చిన రాజన్న తనయుడికి అభిమానులు భారీ ఎత్తున స్వాగతం పలికారు. జగన్ ప్రయాణిస్తున్న కాన్వాయ్ వెంట ప్రయాణిస్తూ 'జై జగన్' నినాదాలతో హోరెత్తించారు.

ఈ మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో చంచల్ గూడ జైలు విడుదలయిన జగన్ రాత్రి 8 గంటలకు బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ వన్ కు చేరుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు అభిమాన సంద్రం ఎంతగా ఎగసిపడుతుందో. జగన్ కాన్వాయ్ ప్రయాణించే దారులన్నీ జనంతో నిండిపోయాయి.  ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం ఎదురుగా జగన్‌ కాన్వాయ్‌ చాలాసేపు నిలిచిపోయింది. పంజాగుట్టలోని వైఎస్‌ఆర్‌ విగ్రహం వద్దకు వెళ్దామంటూ అభిమానుల పట్టుబట్టారు. ట్రాఫిక్‌ ఇబ్బందులుంటాయని జగన్‌కు పోలీసులు వివరించారు. పోలీసుల సూచనకు అంగీకరించాలని అభిమానులకు జగన్‌ సర్దిచెప్పారు. దీంతో నిర్దేశిత మార్గంలోనే కాన్వాయ్‌ కొనసాగుతోంది.

తాజ్ డెక్కన్ హోటల్ మీదుగా పంజాగుట్ట నాగార్జున్ సర్కిల్ చేరుకున్న జగన్ అక్కడ తన కోసం వేచివున్న అభిమానులను కారు దిగి పలకరించారు. చిన్నారులు, వృద్ధులు కూడా జగన్ కు కలవడానికి వచ్చారు. రాత్రి 830 గంటలకు కేబీఆర్ పార్క్ కు చేరుకున్నారు. 8.45 గంటలకు జగన్‌ కాన్వాయ్‌ జూబ్లీహిల్స్ చెక్ పోస్టుకు చేరుకుంది. రాత్రి 9.20 గంటలకు లోటస్ పాండ్ లోని తన నివాసానికి చేరుకున్నారు.

మరోవైపు లోటస్‌పాండ్ లోని జగన్ నివాసం అభిమాన జనంతో కిక్కిరిసింది. జగన్ కోసం గంటల తరబడి అభిమానులు ఎదురుచూశారు. వివిధ జిల్లాల నుంచి లోటస్‌పాండ్‌కు భారీగా జనం చేరుకున్నారు.  జగన్ చూసేందుకు ఆర్థ్రత నిండిన హృదయాలతో అభిమానులు చూసిన ఎదురుచూపులు ఫలించాయి. తమ అభిమాన నేతను చూడగానే వారంతా 'జై జగన్' అంటూ నినదించారు. జగన్ కారు దిగి చిరునవ్వుతో అభిమానులకు అభివాదం చేశారు.
Share this article :

0 comments: