టీడీపీ ఎంపీలు చేసిన రాజీనామాలన్నీ డ్రామాలే.... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » టీడీపీ ఎంపీలు చేసిన రాజీనామాలన్నీ డ్రామాలే....

టీడీపీ ఎంపీలు చేసిన రాజీనామాలన్నీ డ్రామాలే....

Written By news on Tuesday, September 3, 2013 | 9/03/2013

అవి బోగస్ రాజీనామా పత్రాలు
సాక్షి, హైదరాబాద్: టీడీపీ ఎంపీలు చేసిన రాజీనామాలన్నీ డ్రామాలేననే విషయం మరోసారి స్పష్టమైంది. పార్టీ ఎంపీలు సమర్పించిన రాజీనామాలు నిబంధనల ప్రకారం లేవని ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ అసలు విషయం బయటపెట్టారు. పదవులకు రాజీనామా చేయాలని చెప్పి పార్టీ కార్యాలయం నుంచి కొన్ని పత్రాలు పంపించారని, వాటిపై తాను సంతకం చేసి రాజ్యసభ చైర్మన్ కార్యాలయంలో అందజేసినా రాజీనామా ఆమోదం పొందలేదన్నారు. దీనిపై ఆరా తీస్తే రాజీనామా పత్రాలు నిబంధనల మేరకు లేవనే విషయం వెల్లడైందన్నారు.  మీడియాతో మాట్లాడుతూ రాజీనామాల విషయాన్ని వివరించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా టీడీపీ ఎంపీలు రాజీనామా చేస్తున్నారని, మీరు కూడా చేయండని కోరుతూ ఎన్టీఆర్ భవన్ నుంచి తనకు ఓ పత్రం అందిందన్నారు. దానిపై సంతకం చేసి రాజ్యసభ చైర్మన్‌కు అందచేశాక వారం రోజులు గడిచినా ఎలాంటి స్పందనా కనిపించలేదన్నారు.
 
తానే స్వయంగా వెళ్లి వాకబు చేయగా పార్టీ పంపిన రాజీనామా పత్రంలో శ్రీకృష్ణ కమిటీ నివేదికను సభలో ప్రవేశ పెట్టనందుకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారని, ఇలాంటివి పొందు పరిస్తే తాము ఆమోదించలేమని చెప్పారని హరికృష్ణ వివరించారు. ఈ కారణంగానే తాను స్వయంగా మరో రాజీనామా లేఖను రాసిచ్చానని తెలిపారు. 
 
Share this article :

0 comments: