చిరంజీవికి, చంద్రబాబుకు తేడాలేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చిరంజీవికి, చంద్రబాబుకు తేడాలేదు

చిరంజీవికి, చంద్రబాబుకు తేడాలేదు

Written By news on Tuesday, September 10, 2013 | 9/10/2013

శ్రీమతి షర్మిల సమైఖ్య శంఖారావంమార్కాపురం: ప్రజారాజ్యం  పార్టీని అమ్మేసుకున్న చిరంజీవికి, కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయిన టిడిపి అధ్యక్షుడు  చంద్రబాబు నాయుడుకు తేడా లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల  అన్నారు. సమైక్య శంఖారావం బస్సు యాత్రలో భాగంగా ఆమె ఈ రోజు రాత్రి 7 గంటల ప్రాంతంలో  ప్రకాశం జిల్లా మార్కాపురం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ జరిగిన భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. చంద్రబాబు మద్దతు వల్లే రాష్ట్రంలో మైనారిటీ ప్రభుత్వం అధికారంలో నిలిచిందన్నారు. గత నాలుగేళ్లలో ప్రతి విషయంలోనూ కాంగ్రెస్ పార్టీతో టీడీపీ కుమ్మక్కయిందని విమర్శించారు.
ప్రతి ఎన్నికల్లో చంద్రబాబు సిగ్గులేకుండా కాంగ్రెస్‌తో కలిసి పనిచేశారన్నారు. బ్లాక్ చెక్ ఇచ్చినట్లుగా చంద్రబాబు లేఖ రాసిచ్చారు. విభజనకు ఆయన మద్దతు ఇవ్వడం వల్లే ఇపుడు ఈ పరిస్థితి వచ్చిందన్నారు.  తెలంగాణకు అనుకూలంగా లేఖ ఎందుకు ఇచ్చావని చంద్రబాబును ప్రజలు నిలదీయాలన్నారు. వైఎస్‌ఆర్ సీపీ, ఎంఐఎం, సీపీఎం రాష్ట్ర విభజనకు ఎప్పుడూ ఒప్పుకోలేదని చెప్పారు.

ఇప్పటికే ఎగువ రాష్ట్రాల వల్ల కృష్ణా నదికి నీరు రావడం తగ్గుతుందననారు. కృష్ణ నీళ్లు రాకపోతే సీమాంధ్ర అంతా ఎడారి అవుతుందని చెప్పారు. శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు సముద్రం నీళ్లు మాత్రమే ఉన్నాయని గుర్తు చేశారు. కృష్ణలో నీళ్లు లేకుంటే పరిస్థితేంటని అడిగారు. దీనికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తానని కేంద్రం చెబుతోంది. మధ్యలో మరో రాష్ట్రం వస్తే పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు.

గతంలో మద్రాసు తీసుకున్నారు. ఇపుడు హైదరాబాద్ కూడా తీసుకుంటామంటున్నారు. చదువుకున్న విద్యార్ధులు ఇపుడు ఎక్కడికి వెళ్లాలి? వారిపైనే ఆధారపడిన తల్లిదండ్రులు ఏం చేయాలి? ప్రశ్నించారు. హైదరాబాద్ కట్టుకోవడానికి 50 ఏళ్లు పట్టింది. 10 ఏళ్లలో హైదరాబాద్ లాంటి రాజధాని ఎలా కట్టుకోవాలని అడిగారు.

జగనన్న దోషి అని ఏ కోర్టు చెప్పలేదు. చంద్రబాబు నిర్దోషి అని ఏ కోర్టు చెప్పలేదు. చిరంజీవి వియ్యంకుడి ఇంట్లో కోట్ల రూపాయల డబ్బు దొరికినా ఏ కోర్టూ నిర్దోషి అని చెప్పలేదని  షర్మిల అన్నారు.

షర్మిల ఇక్కడకు వచ్చిన సందర్భంగా మార్కాపురం జనంతో నిండిపోయింది. సమైక్యవాదులు, అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఎటుచూసినా జనమే జనం. వీధులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. మేడలు, మిద్దెలు ఎక్కి జనం షర్మిల ప్రసంగం విన్నారు.
Share this article :

0 comments: