వైఎస్ జగన్ ను కలవనున్న బాలశౌరి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ జగన్ ను కలవనున్న బాలశౌరి

వైఎస్ జగన్ ను కలవనున్న బాలశౌరి

Written By news on Friday, September 13, 2013 | 9/13/2013

కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వల్లభనేని బాలశౌరి శుక్రవారం వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ను చంచల్ గూడ జైల్లో బాలశౌరి కలవనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ఆ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి గతనెల మొదటివారంలోనే రాజీనామ చేశారు.
 
14వ లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో వల్లభనేని బాలశౌరి తెనాలి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఇటీవల గుంటూరులో చేపట్టిన సమర దీక్షకు బాలశౌరి మద్దతు తెలిపిన విషయం విదితమే.
Share this article :

0 comments: