'న్యాయం చేసే సత్తా లేనప్పుడు.. విభజించే హక్కు మీకెక్కడిది' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » 'న్యాయం చేసే సత్తా లేనప్పుడు.. విభజించే హక్కు మీకెక్కడిది'

'న్యాయం చేసే సత్తా లేనప్పుడు.. విభజించే హక్కు మీకెక్కడిది'

Written By news on Friday, September 13, 2013 | 9/13/2013

శ్రీమతి షర్మిల సమైఖ్య శంఖారావం
ఓట్ల కోసం, సీట్లకోసం కోట్లాదిమందికి కాంగ్రెస్ అన్యాయం చేసింది అని తూర్పు గోదావరి జిల్లా అమలాపురం బహిరంగసభలో షర్మిల మండిపడ్డారు. అమలాపురంలో ఏర్పాటు చేసిన సమైక్య శంఖారావం బహిరంగ సభలో మాట్లాడుతూ... సీమాంధ్ర ప్రజల తరఫున ఎంతమంది టీడీపీ, కాంగ్రెస్‌ నాయకులు నిలబడ్డారు షర్మిల అని ప్రశ్నించారు.  వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యేలు రాజీ నామాలు చేసిన రోజునే... మిగతా పార్టీల ఎమ్మెల్యేలూ చేసుంటే విభజన ప్రక్రియ ఆగి ఉండేది అని అన్నారు. 
 
న్యాయం చేసే సత్తా మీకు లేనప్పుడు.. విభజించే హక్కు మీకెక్కడిది అని షర్మిల నిప్పుల చెరిగారు. రాష్ట్రాన్ని సమైక్యాంగానే ఉంచాలని వైఎస్‌ఆర్ సీపీ డిమాండ్ చేస్తోంది అని అన్నారు.  నిర్బంధంలో ఉండికూడా తన కష్టాన్ని పక్కనపెట్టి... ప్రజలకోసం వారంరోజులు జగనన్న నిరాహారదీక్ష చేశారని షర్మిల తెలిపారు.  జైల్లో ఉన్నా... జనంలో ఉన్నా జగనన్న జననేతేనని,  కోట్లాదిమందికి అన్యాయం జరిగితే జగనన్న చేతులు కట్టుకుని చూస్తూ ఊరుకోరు అని అన్నారు.  జగనన్నను ఆపడం ఈ టీడీపీ, కాంగ్రెస్ నాయకుల తరం కాదు సవాల్ విసిరారు. 
Share this article :

0 comments: