వైయస్ఆర్‌ విగ్రహాల జోలికి వస్తే సహించం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైయస్ఆర్‌ విగ్రహాల జోలికి వస్తే సహించం

వైయస్ఆర్‌ విగ్రహాల జోలికి వస్తే సహించం

Written By news on Thursday, September 5, 2013 | 9/05/2013

మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాల జోలికి వస్తే సహించబోమని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ హెచ్చరించారు. ఆ మహానేత అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, రుణ మాఫీ, ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్సుమెంట్‌లలో సుమారు 70 శాతం తెలంగాణ వారికే లబ్ధి చేకూరిన విషయాన్ని మర్చిపోయి హరీష్‌రావు ఇచ్చిన పిలుపుతో‌ దాదాపు 8 వైయస్ఆర్ విగ్రహాలను కూల్చివేశారని తెలిపారు. కొన్నిచోట్ల అయితే ఆ విగ్రహాలను రంపంతో కోసిన సంఘటనలు కూడా ఉన్నాయన్నారు. ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేసిన మహానేత విగ్రహాలను ఇంత దారుణంగా, అన్యాయంగా ధ్వంసం చేయడం తగదని బాజిరెడ్డి ఖండించారు. తెలంగాణలోని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల మీద కూడా భౌతిక దాడులు చేయమని టిఆర్ఎస్‌ నాయకులు తమ శ్రేణులను రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం సాయంత్రం ఆయన పార్టీ తెలంగాణ ప్రాంత నాయకులు గట్టు రామచంద్రరావు, బి. జనక్‌ప్రసాద్, శివకుమార్‌, నల్లా సూర్యప్రకాశ్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

చదువుకున్నవాడు, ఉద్యమంలో నడిచినవాడు హరీష్‌రావు మహానేత వైయస్ఆర్‌ బ్రతికి ఉన్ననాడు ఆయన ఆశీస్సులతో తన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుని ఇప్పుడిలా దాడులకు పురికొల్పడమేమిటని బాజిరెడ్డి ప్రశ్నించారు. ప్రాణం లేని విగ్రహాలను ధ్వంసం చేసి పొందే రాక్షసానందం ఏమిటని హరీష్‌రావును ఆయన ప్రశ్నించారు. వైయస్‌ విగ్రహాల జోలికి వెళితే తెలంగాణ ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారని బాజిరెడ్డి హెచ్చరించారు.
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి తెలంగాణ ప్రాంతాన్ని కూడా ఎంతగానో అభివృ‌ద్ధి చేసి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. టిఆర్ఎస్ పార్టీ ఒక్కటే తెలంగాణ వాదంతో పుట్టిన పార్టీ అని, మిగతా పార్టీలు ఏవీ కూడా అలా ఏర్పడలేదన్న విషయాన్ని ఈ సంద‌ర్భంగా బాజిరెడ్డి గుర్తుచేశారు. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నడూ వ్యతిరేకంగా మాట్లాడలేదని పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. రాష్ట్రానికి సమన్వాయం చేయలేదు కాబట్టి సమైక్యంగా ఉంచాలని మాత్రమే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కోరిందన్నారు. తెలంగాణ ప్రాంతంలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉనికి కోల్పోతుందన్న టిఆర్ఎస్ వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు.‌

ఈ సందర్భంగా టిఆర్ఎస్ వైఖరిపై‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణలో బలం ఉందో లేదో టిఆర్ఎస్ నేతలు నిర్ణయించనక్కర్లేదన్నారు.‌ కేవలం తెలంగాణలో వైయస్ఆర్‌ కాంగ్రెస్ హవాను తగ్గించాలనే ‌దురుద్దేశంతోనే టిఆర్ఎస్‌ నాయకులు విమర్శలకు దిగుతున్నారన్నారు. టిఆర్ఎస్ ‌నాయకుడు హరీష్‌రావు విజ్ఞత కోల్పోయి మాట్లాడుతున్నారని బాజిరెడ్డి వ్యాఖ్యానించారు.

తెలంగాణ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్‌ పార్టీ సీమాంధ్రలో సమైక్య ఉద్యమం చేస్తుందని, ఒక ఓటు వేస్తే రెండు రాష్ట్రాలు ఇస్తామని చెప్పి బిజెపి రెండు ప్రాంతాల్లో ఉంటుంది కాని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ ఏమి తప్పు చేసిందని తెలంగాణలో ఉండవద్దంటున్నారని బాజిరెడ్డి నిలదీశారు. వైయస్ఆర్‌ ఆశయాల మేరకు, ఆయన సంక్షేమ పథకాలను అమలు చేయాలన్న కృతనిశ్చయంతోనే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటైందని బాజిరెడ్డి గుర్తుచేశారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఉద్యమ పార్టీ కాదని, అయినప్పటికీ తెలంగాణ ప్రాంత సెంటిమెంటును గౌరవిస్తామని చెప్పిందని ఆయన వివరించారు. తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన వారు మళ్ళీ ఎన్నికల్లో నిలబడితే వారి మీద వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పోటీ కూడా పెట్టని విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఇలాంటి పార్టీ మీద దుమ్మెత్తి పోయాల్సిన అవసరం ఏముందని బాజిరెడ్డి ప్రశ్నించారు.

http://www.ysrcongress.com/news/news_updates/ysrcp-never-said-to-anty-to-telangana.html
Share this article :

0 comments: