ఒకే మాట... ఒకే వైఖరి! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఒకే మాట... ఒకే వైఖరి!

ఒకే మాట... ఒకే వైఖరి!

Written By news on Friday, September 6, 2013 | 9/06/2013

ఒకే మాట... ఒకే వైఖరి!
 సందర్భం: ‘ఆర్టికల్-3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించాలన్నా, కలిపి ఉంచాలన్నా ఆ పూర్తి హక్కులు, సర్వాధికారాలు కేంద్రానికే ఉన్నాయి. అయినా మీరు మా అందరి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. మేం అడిగేదల్లా అన్ని విషయాలు, అన్ని సమస్యలు పరిగణనలోకి తీసుకుని ఎవరికీ అన్యాయం జరగకుండా త్వరిగతిన ఈ సమస్యకు ఒక తండ్రిలా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపించమని కోరుతున్నాం’ అని 28 డిసెంబర్ 2012న కేంద్ర హోంశాఖ మంత్రి షిండేకు ఇచ్చిన లేఖలో స్పష్టంగా చెప్పాం.
మా పార్టీ ఎక్కడా విధానాన్ని మార్చుకోలేదు. వెనక్కి పోలేదు... యూ టర్న్ తీసుకోలేదు. అన్ని ప్రాంతాలు, ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలనే డిమాండ్ చేసింది.
 
 గడిచిన నాలుగేళ్లుగా ఈ రాష్ట్రం దిక్కూ మొక్కూ లేని అనాధగా మిగిలింది. ఎప్పుడు ఏం జరు గుతుందో అంతుబట్టని పరిస్థితి. రాష్ట్రాన్ని గాలికొదిలేసి ఢిల్లీకి చెక్కర్లుకొట్టే నాయకులు... అం తా అనిశ్చితి. జనం గోడు పట్టిం చుకోకుండా నాలుగేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం కాలం వెళ్లబుచ్చింది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అండతో సర్కారును నెట్టుకొచ్చింది. ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడ్డాయి. అన్ని లెక్కలూ వేసుకుని కాంగ్రెస్ ఉన్నట్టుండి ఒక్కసారిగా విభజన అంశం తెర మీదకు తెచ్చింది. ఆగమేఘాలపై యూపీఏ సమావేశం, అటు తర్వాత సీడబ్ల్యూసీ తీర్మానం పూర్తిచేసి రాష్ట్రాన్ని విభజిస్తున్నట్టు ప్రకటించింది. ఇన్నాళ్లనుంచి తెలంగాణపై సమావేశాలు జరుగుతున్నా ఎక్కడా తన వైఖరేమిటో, దానికి ప్రాతిపదికేమిటో చెప్పని కాంగ్రెస్ ఉన్నట్టుండి నిర్ణయం వెల్లడించడంతో కోస్తా, రాయలసీమ ప్రజల్లో తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. దాంతో ఆ నిందను ఇతర పార్టీలపై వేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.
 
 మీరు ఒప్పుకోబట్టే ఈ నిర్ణయం తీసుకున్నామంటోంది. బ్లాంక్ చెక్ ఇచ్చినట్టుగా తెలంగాణకు అనుకూలమంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు లేఖ ఇచ్చారు. ఇప్పుడు ఇరు ప్రాంతాల్లోనూ రాజకీయ మనుగడ ప్రశ్నార్థకం కావడం... ఎన్నికల్లో ప్రయోజనం ఆశించి తీసుకున్న నిర్ణయం తిరగబెట్టడంతో ఏంచేయాలో తోచక... రాజకీయంగా ఆ రెండు పార్టీలు కొత్త నాటకానికి తెరతీశాయి. ఇక ప్రజలకు దగ్గరకాలేమని, వారు తమను విశ్వసించరని తెలుసుకుని ఆ రెండు పార్టీలు తెరవెనుక కుట్రలు మొదలుపెట్టాయి. తీసుకున్న నిర్ణయంపై వక్రభాష్యం చెప్పడం ప్రారంభిం చాయి. తెలంగాణ ఏర్పాటు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కల అని, వైఎస్సార్ కాంగ్రెస్ అనుకూలంగా లేఖ ఇచ్చిందనీ...అది యూ టర్న్ తీసుకుందని...  విషప్ర చారానికి దిగాయి. మేం చెప్పని విషయాన్ని చెప్పినట్టు దుష్ర్పచారం చేస్తున్నాయి. వైఎస్‌పైనా... మా పార్టీపైనా తప్పుడు ప్రచారం మొదలుపెట్టాయి. నిజానికి రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్, టీడీపీల మాదిరి కాకుండా వైఎస్సార్ కాంగ్రెస్ ఆది నుంచి ఒకే మాట చెబుతోంది. పార్టీ పెట్టిన నాటి నుంచి నేటి సమైక్య శంఖారావం వరకు ఒక మాటపై నిలబడింది.
 
 ప్లీనరీలో మేం చెప్పిందేమిటి...?
 వైఎస్సార్ కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత జూలై 8 న ఇడుపు లపాయలో జరిగిన తొలి ప్లీనరీ ప్రజాప్రస్థానం ముగిం పులో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లా డుతూ, తెలంగాణ అంశంపై పార్టీ వైఖరేంటో విడమ రిచారు. ‘‘సున్నితమైన అంశం మీద.. ఒక అభిప్రా యమంటూ చెప్పాలి కాబట్టి చాలా ఆలోచనలు చేశాం. ఇవాళ ఇటువంటి జటిలమైన సమస్యకు అభిప్రాయం చెప్పాల్సివస్తే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీగా మేం తెలం గాణ సెంటిమెంటును గౌరవిస్తున్నామని నేను చెబు తున్నా. అయితే ఇవాళ తెలంగాణ ఇచ్చే శక్తి మాకు లేదు. తెలంగాణను ఆపే శక్తి కూడా మాకు లేదు. ఈ రాష్ట్రం అత లాకుతలామవుతుందన్నా, ఇన్ని వందల మంది చని పోయినా, ఆస్తులు నష్టమయ్యాయన్నా దీనికి కారణం.. కేంద్ర ప్రభుత్వమే. రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 3 ప్రకా రం రాష్ట్రాలను విభజించాలన్నా, కలిపి ఉంచాలన్న పూర్తి హక్కులు కేంద్రానికే ఉన్నాయని తెలిసినప్పటికీ కేంద్రం మనతో చెలగాటమాడుతోంది.
 
 కనీసం ఇప్పటికైనా మన జీవితాలతో చెలగాటమాడడం మానేసి మన మధ్య వైష మ్యాలు పెంచకుండా అందరి మనోభావాలు పరిగణ నలోకి తీసుకుంటూ, ఏ ఒక్కరి ప్రయోజనాలు దెబ్బ తినకుండా వెంటనే ఒక మంచి నిర్ణయం, ఒక మంచి మార్గం చెప్పవలసిన బాధ్యత పూర్తిగా ఈ కేంద్ర ప్రభు త్వానికి మాత్రమే ఉందని చెబుతున్నా. ఒక పంచా యతీలో కేంద్ర ప్రభుత్వం పెద్దమనిషిగా కూర్చుని ఉంది. ఆ పంచాయతీ చేసేటప్పుడు అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటూ ఏ ఒక్కరి ప్రయోజనాలు దెబ్బ తినకుండా ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఆ పంచాయతీ పెద్దగా కేంద్ర ప్రభుత్వానికి ఉంది’’. ఇదే ప్లీనరీ తీర్మానం కూడా. అంటే దీనర్థం తెలంగాణకు అంగీ కరిస్తున్నట్టా? సమస్యకు విభజనే పరిష్కారమా? ఇప్పుడు అడ్డగోలుగా చేసిన నిర్ణయం అందరి ప్రయోజనాలు పరిరక్షిస్తున్నాయా? ఇది అందరి మనోభావాలు పరిగ ణలోకి తీసుకున్నాక చేసిన నిర్ణయమా?
 
 షిండేకిచ్చిన లేఖలో ఏముంది?
 28 డిసెంబర్ 2012 న కేంద్ర హోంశాఖమంత్రి సుశీల్ కుమార్ షిండే నేతృత్వంలో జరిగిన అఖిల పక్ష సమా వేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ తన వైఖరిని స్పష్టంగా లేఖ రూపంలో తెలియజేసింది. ఆ లేఖలో ఏముందంటే... ‘‘డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నాయకత్వంలో భారత రాజ్యాంగ నిర్మాతలు ఈ దేశంలో అన్ని కులాల వారు అన్ని వర్గాల వారు అలాగే అన్ని ప్రాంతాల వారు సుఖ సంతోషాలతో తమ జీవనవిధానాన్ని కొనసాగించాలని కోరుకుంటూ - భారత రాజ్యాంగంలో అనేక అధికరణ లను పొందుపరిచారు. అధికరణలను అమలుపరిచే అధి కారాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చారు.
 
 అందులో భాగం గానే ఆర్టికల్ 3 ను రాజ్యాంగంలో పొందుపరిచి, రాష్ట్రా లను విభజించాలన్నా లేదా కలిపి ఉంచాలన్నా ఆ అధికా రాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా కేంద్రానికే సర్వాధికారాన్ని ఇచ్చారు. అందుకే కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయకుండా, ఎన్ని పార్టీలు ఏమి చెప్పినా ఈ అంశం ఒక కొలిక్కి వచ్చే ప్రసక్తే లేదు. ఇప్పటికే మీ అనాలోచిత చర్యల వల్ల రాష్ట్రం రావణ కాష్టంగా మారింది. అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. అయినా రాష్ట్రంలో ఒక పార్టీగా ప్రజల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యతను గుర్తించి మా వైఖరిని ఇలా తెలియజేస్తున్నాం.’’
 
 ‘‘ఇంతకుముందు 2011 జూలై 8, 9 తేదీల్లో మేము మా పార్టీ మొదటి ప్లీనరీలో చెప్పినట్టుగా- తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌ను గౌరవిస్తున్నాం. ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించాలన్నా, కలిపి ఉంచాలన్నా ఆ పూర్తి హక్కులు, సర్వాధికారాలూ కేంద్రానికే ఉన్నాయి. అయినా మీరు మా అందరి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. మేం అడిగేదల్లా అన్ని విషయాలు, అన్ని సమస్యలు పరిగ ణలోకి తీసుకుని ఎవరికీ అన్యాయం జరగకుండా త్వరి తగతిన ఈ సమస్యకు ఒక తండ్రిలా అందరికీ ఆమో దయోగ్యమైన పరిష్కారం చూపాల్సిందిగా కోరు తు న్నాం.’’ ఈ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలు తమ లేఖలను ఇంగ్లీషులో రూపొందించగా, ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రమే ఎలాంటి గందరగోళం లేకుండా తెలు గులో అందజేసింది.
 
 ఇంత స్పష్టంగా వైఖరి విడమరిచిన తర్వాత కూడా ఈ లేఖలో తెలంగాణ ఏర్పాటు కోసం అం గీకరించామన్న దానికి లేశమాత్రమైనా ఆస్కారముందా? విభజనే పరిష్కారమని మేమెక్కడైనా చెప్పామా? మీ నిర్ణయానికి ప్రాతిపదిక ఏంటి? కీలకమైన అంశంపై నిర్ణయం తీసుకునేప్పుడు దానికి ప్రాతిపదిక, ప్రతి పాదనలు, అన్ని పక్షాలతో చర్చలు అవసరం లేదా? అం దరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చేయాలని అన్న మా పార్టీ వైఖరికి, తెలంగాణకు సానుకూలం అని లేఖ ఇచ్చిన టీడీపీ వైఖరికి మధ్య ఉన్న తేడా ఎందుకు కని పించడంలేదు? ఏ సమస్య ఉత్పన్నమైనా... ఒక ప్రాం త ప్రజల ఆకాంక్షను గుర్తించడం ప్రజాస్వామ్యంలో పార్టీల కనీస ధర్మం. సమస్య ఉత్పన్నమైనప్పుడు ఒక ప్రాంతానికి అన్యాయం చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం సమ్మతం కాదు.
 
 ఆనాడు వైఎస్ ఏమన్నారు...
 2009 ఫిబ్రవరి 11 ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజ శేఖరరెడ్డి రాష్ట్ర శాసనసభలో ఒక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఏకాభిప్రాయానికి యత్నించినా సాధ్యంకాలేదు. మరికొన్ని పార్టీలు మద్దతివ్వడానికి నిరాకరించాయి. అప్పటి నుంచి ఈ సమస్యనెలా పరిష్కరించాలనే దానిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈలోగా ప్రత్యేక రాష్ట్రం ఇస్తే తమ భద్రతకు ఇబ్బంది కలుగుతుందని ముస్లిం మైనారిటీలు చెప్పారు. దాన్ని ఏ విధంగా పరిష్కరించాలో ఆలోచించాలి.
 
  గత 30. 40, 50, 60 సంవత్సరాల నుంచి హైదరాబాద్ రాష్ట్ర రాజధానిగా ఉన్నందునే ఇక్కడ స్థిరపడ్డామని కోస్తా, రాయలసీమ ప్రజలు అంటున్నారు. రాష్ట్రానికి రాజధాని అయినందునే హైదరాబాద్ వచ్చా మని అంటున్నారు. ఇలాంటి సమస్యలను పరిష్కరిం చాల్సి ఉంది. రాష్ట్రాన్ని విభజిస్తే రెండు, మూడు, నాలుగు రాష్ట్రాలు చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. సీమ, ఉత్తరాంధ్ర, కోస్తా రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని అంటు న్నారు. ఈ సమస్యలన్నీ పరిష్కరించి తెలంగాణ ఏర్పా టుకు తీసుకోవలసిన చర్యలను సూచించడానికి అసెంబ్లీ, శాసనమండలి సభ్యులతో సంయుక్త కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఈ కమిటీ నివేదిక సమ ర్పిం చాక... దాని ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు చేపడుతుంది.’’ అని స్పష్టంగా చెప్పారు.
 
 ఏది వైఎస్ కల...?
 ఈ ప్రకటన చేసిన తర్వాత రోశయ్య నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవోను కూడా జారీ చేసింది. ఆ తర్వాత శాసనసభ ఎన్నికలు జరగడం, వైఎస్ నేతృ త్వంలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడం, కొద్ది రోజులకే వైఎస్ మృతిచెందడం తెలిసిన పరిణామాలే. తెలంగాణపై ఒక నిర్ణయం తీసుకునే ముందు దానితో సంబంధం ఉన్నవారు లేవనెత్తిన అభ్యంతరాలు, వారి ఆందోళనలను పరిష్కరించాల్సి ఉందని వైఎస్ తన ప్రకటనలో చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ... తెలంగాణ ఏర్పాటు రాజశేఖరరెడ్డి ‘కల’ అని ఏఐసీసీ ప్రధాన కార్య దర్శి దిగ్విజయ్‌సింగ్ ఎలా చెబుతారు? ఈ ప్రాంతం, ఆ ప్రాంతమని తేడా లేకుండా రాష్ట్రాన్ని మొత్తంగా  సస్యశ్యా మలం చేయాలన్నదే వైఎస్ స్వప్నం.
 
 అన్ని ప్రాంతాలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలన్నదే ఆయన కల. అందుకే ఆరోగ్యశ్రీ, 108, 104 సర్వీసులు, రెండు రూపా యలకే కిలో బియ్యం, అర్హులైన అందరికీ సంతృ ప్తస్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్, పావలా వడ్డీకే రుణాలు, సంతృప్తస్థాయిలో వృద్ధాప్య పెన్షన్లు... ఇలా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ అనేక వినూత్న సంక్షేమ పథకాలు చేపడితే... ఉన్నంత కాలం కొనియాడి ఆయన మరణించగానే మాట మార్చిందెవరు? అబ్బ బ్బే... అవన్నీ కాంగ్రెస్ పథకాలే అని, అధిష్టానం ఆమో దంతోనే చేపట్టారని రకరకాల మాటలు చెప్పారు.  పథ కాలైతే మీవి, తెలంగాణ అయితే వైఎస్ కలా? తెలంగాణ అంశంపై వైఎస్ ఆనాడు నిండు శాసనసభలో ప్రకటన చేయడం అబద్ధమా? రోశయ్య నేతృత్వంలో కమిటీ వేయడం అవాస్తవమా?  వైఎస్ మరణం తర్వాత టీడీపీ, కాంగ్రెస్‌లు ఒక్కటవడం, ఆయనను మద్దాయిగా చూపిం చడం ఎవరికి తెలియనిది? ఆఖరికి ఎఫ్‌ఐఆర్‌లో సైతం ప్రభుత్వాలు ఆయన పేరు నమోదుచేయించాయి. ఆయన వల్ల లాభం కలుగుతుందంటే ఒకలా, లేదనుకుంటే మరో లా మాట్లాడినంత మాత్రాన చరిత్ర చెరిగిపోతుందా?
 
 వైఎస్సార్‌సీపీ అభ్యంతరం...
 జూలై 12 న కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఆ సమావేశానికి ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడిని కూడా పిలిచారు. ఆ తర్వాత ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్వి జయ్‌సింగ్ మాట్లాడుతూ, చర్చలు, సంప్రదింపులు ముగి శాయనీ ఇక నిర్ణయమే తరువాయి అని ప్రకటించారు. దాంతో కీలకమైన, సున్నితమైన అంశంపై కాంగ్రెస్ చేస్తు న్న డ్రామా, గందరగోళం, ఏకపక్ష వైఖరిని తప్పుబడుతూ జూలై 17న (అంటే సీడబ్ల్యూసీ సమావేశానికి పక్షం రోజుల ముందే) వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేలు కేంద్ర హోంశాఖ మంత్రికి ఒక లేఖరాశారు. అందులో విభజన అంశం, డిసెంబర్ 28న జరిగిన అఖిలపక్ష సమావేశ వివరాలను గుర్తుచేశారు. ఆ లేఖలో... ‘‘విభజన అంశంపై ప్రభుత్వం ముందుగా తన వైఖరిని స్పష్టం చేయాలి. అలా ప్రకటించిన వైఖరిపై అన్ని భాగస్వామ్య పార్టీలను ఆహ్వా నించి చర్చలు జరపాలి. విభజన అంశంపై చర్చలు సంప్ర దింపులు అయిపోయాయని దిగ్విజయ్ చెప్పడంలో అర్థం లేదు. ఒకవేళ రాష్ట్ర విభజన అనివార్యమని భావిస్తే అన్ని ప్రాంతాలవారికి ఆమోద యోగ్యమైన పరిష్కారాలను చూపాలి. అలాంటివేమీ చేయకుండానే ఏకపక్షంగా నిర్ణ యం జరిగిపోయిందని ఎలా ప్రకటిస్తారు? అది న్యాయస మ్మతం కాదు. విభజన అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పారదర్శకంగా వ్యవహరించాలి. ముందు కేం ద్రం తన వైఖరేమిటో ప్రకటించాలి. ఆ తర్వాత అన్ని ప్రాంతాల ప్రజలతో సమావేశం ఏర్పాటు చేయాలి. అప్పు డు అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసు కోవాలి.’’ అని కోరారు.
 
 మా ఎమ్మెల్యేల రాజీనామాలు
 రాష్ట్రాన్ని విభజించాలని జూలై 30 న జరిగిన సీడబ్ల్యూసీ సమావేశం తీర్మానించింది. అంతకుముందు 12 వ తేదీన జరిగిన కాంగ్రెస్ కోర్‌కమిటీ సమావేశం నుంచి రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ హడావిడి చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ వేస్తున్న అడుగులను గమనించి, ఏకపక్ష నిర్ణయం తీసుకోబోతోందని ఆ పార్టీ నేతల చేష్టలను గ్రహించిన తర్వాత కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, ఎలాంటి ప్రాతిపదిక లేకుండా రాష్ట్రాన్ని విభజించాలన్న ప్రతిపాదనను నిరసిస్తూ మా పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు జూలై 25న స్పీకర్ ఫార్మేట్‌లో తమ పదవులకు రాజీనామాలు చేశారు.
 
 అటుతర్వాత ఆ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ, ‘‘తానే పార్టీ, తానే ప్రభుత్వమన్న విధంగా వ్యవహరిస్తూ రాజకీయ లబ్ధి కోసం ప్రజల భవిష్యత్తును కాంగ్రెస్ తాకట్టు పెట్టి రాజకీయాలు చేస్తోంది. ఓట్లు, సీట్లు లెక్కలేస్తూ కొన్ని రోజులుగా కాంగ్రెస్ బేరసారాలకు పాల్పడటాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఈ విషయంలో మొదట కాంగ్రెస్ తన నిర్ణయం ప్రకటించాలి. ఆ తర్వాత కేంద్రం అందరికీ అమోదయోగ్యమైన రీతిలో, ఏ ఒక్కరికీ ఎలాంటి అన్యాయమూ జరగకుండా ఒక ప్రతిపాదనను అందరి ముందుంచాలి. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. ఎవరికి అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు’’ అని హెచ్చరించిన విషయాన్ని గమనించాలి. సీడబ్ల్యూసీ నిర్ణయానికి ముందే కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ రాజనామాలు సమర్పించడం... తెలంగాణకు అనుకూలమవుతుందా? విభజన చేయమని చంద్రబాబు లాగా బ్లాంక్ చెక్‌పై సంతకం పెట్టినట్టవుతుందా?
 
 ఐదు పార్టీలదే ఏకాభిప్రాయమా?
 సీడబ్ల్యూసీ నిర్ణయం చేసిన తర్వాత సీమాంధ్ర ప్రజల ఆవే దనను, ఆక్రందనను, వారికి జరగబోయే అన్యాయాలను వివరిస్తూ మా పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆగస్టు 27న ప్రధాని మన్మోహన్ సింగ్‌గారికి లేఖ రాశారు. ఇరు ప్రాంతాలకు న్యాయం చేసే నిర్ణయం జరగనప్పుడు రాష్ట్రా న్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఏకపక్ష నిరంకుశ వైఖరికి నిరసన విజయమ్మ నిరవధిక నిరాహారదీక్ష చేయగా, పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్‌రెడ్డి జైలులోనే దీక్ష చేపట్టారన్న విషయాన్ని కూడా ప్రధానికి రాసిన లేఖలో వివరించారు. ఇక్కడి పార్టీల మధ్య దాదాపుగా వంద శాతం ఏకాభిప్రాయం వచ్చిందని కాంగ్రెస్ చెప్పడం తప్పుదారి పట్టించడమే అవుతుంద న్నారు. రాష్ట్రాన్ని విడగొట్టడానికి ఒప్పుకున్నది టీడీపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్, సీపీఐ, బీజేపీలు మాత్రమే. వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎం, ఎంఐఎంలు అంగీకారం తెలి యజేయలేదని విజయమ్మ ప్రధానికి రాసిన లేఖలో స్పష్టంగా పేర్కొన్న విషయం గమనించాలి.  
 
 
 ఎవరిది వక్రభాష్యం?
 మా పార్టీ ఎక్కడా విధానాన్ని మార్చుకోలేదు. వెనక్కిపో లేదు... యూ టర్న్ తీసుకోలేదు. అన్ని ప్రాంతాలు, ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని అందరికీ ఆమో దయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలనే డిమాండ్ చేసింది. ఇరు ప్రాంతాల ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం జరగాలంటే ఎం చేయాలి? అందరి మనో భావాలు పరి గణలోకి తీసుకుంటూ, ఏ ఒక్కరి ప్రయోజనాలు దెబ్బ తినకుండా ఒక మంచి నిర్ణయం, ఒక మంచి మార్గం చెప్ప వలసిన బాధ్యత పూర్తిగా కేంద్రానిదే అని చెప్పిన విష యంలో ఎక్కడైనా... ఏకపక్షంగా రాష్ట్రాన్ని రెండు ముక్క లు చేయాలనిగానీ, నిరంకుశ వైఖరితో నిర్ణయం తీసుకో మనిగానీ... కనబడుతోందా? అలాంటప్పుడు కాంగ్రెస్, టీడీపీ నేతలు చేస్తున్నది తప్పుడు ప్రచారం కాదా? విభ జన నిర్ణయాన్ని తీసుకున్నాక దాన్ని దిగ్విజయ్‌సింగ్ మీడియా సమావేశంలో ప్రకటించి ఆ వెంటనే ఇది వైఎస్ కల అని చెప్పడమంటే... ఒక కుట్రపూరిత ప్రకటనకాక మరేమవుతుంది? వైఎస్ మరణించిన  నాలుగేళ్ల తర్వాత ఈ మాట ఎలా చెప్పగలరు.
 
 ఆయన ఎక్కడైనా ఆ మాట అన్నారా? దిగ్విజయ్ చెప్పిన తొమ్మిది రోజుల తర్వాత సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పదో రోజున బాబు అవే మాటలు మాట్లాడారు. ప్రజల అభిమానం కూడగట్టుకుని వైఎస్సార్ కాంగ్రెస్ బలమైనశక్తిగా ఎదిగిన పరిస్థితిని చూసి ఓర్వలేక, కాంగ్రెస్, టీడీపీలు తమ రాజకీయ మను గడ ప్రశ్నార్థకంగా మారడంతో అడ్డగోలు ప్రచారాన్ని మొదలు పెట్టాయని అందరికీ అర్థమవుతోంది. వైఎస్ ఉన్నప్పుడు 2001లో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో తెలంగాణ, విదర్భ ప్రత్యేక రాష్ట్రాల ఉద్యమాలను దృష్టిలో పెట్టుకుని రెండో ఎస్సార్సీ వేయాలని తీర్మానం చేసింది. అదే విషయాన్ని వైఎస్ అనేకసార్లు ప్రస్తావించారు. ఒక అంశంపై సమగ్రంగా మాట్లాడినప్పుడు, ఒక పార్టీ తన వైఖరిని ప్రకటించినప్పుడు తమకు అనుకూలమైన  వాటినే ప్రస్తావించి నిందలు మోపడం ఏం నీతి?
 
 తెలంగాణపై టీడీపీ తీర్మానం
 2008 అక్టోబర్ 8న  జరిగిన టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసింది. అందు లో ఏముందంటే... ‘‘రాష్ట్ర రాజకీయ పరిణామాలను నిరంతరం నిశితంగా సమీక్షించే టీడీపీ తెలంగాణ ప్రజల మనోభావాలను గమనించి మొదటి నుంచి గౌర విస్తూనే ఉంది. ప్రజల మనోభావం బలపడటాన్ని గుర్తిం చి రెండు సంవత్సరాల క్రితమే తెలంగాణ అంశంపై సరైన సమ యంలో సరైన నిర్ణయం తీసుకుంటామని టీడీపీ ప్రక టించింది. అనంతరం సూత్రప్రాయంగా తెలంగాణకు వ్యతిరేకం కాదని కూడా  ప్రకటించింది. ఈ అంశంపై విసృ్తతంగా చర్చజరగాలని కూడా నిర్ణయించింది. అయితే ఇది సున్నితమైన అంశం కనుక అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను అధ్యయనం చేసే ఉద్ధేశంతో పార్టీ సీనియర్ నాయకులతో కోర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ గత ఐదు నెలలుగా విసృ్తతస్థాయిలో అభి ప్రాయ సేకరణ జరిపి ప్రజాభిప్రాయం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా ఉన్నదని పొలిట్‌బ్యూరోకి తెలి యచేసింది. కోర్ కమిటీ తెలియ చేసిన అభిప్రాయంపై కూలంకషంగా చర్చించిన టీడీపీ పొలిట్ బ్యూరో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయించింది.’’
 
 టీడీపీ ఏం చెప్పింది?
 బాబు పాదయాత్రలో భాగంగా 2012 డిసెంబర్ 27న కరీంనగర్ జిల్లా పొల్కపల్లి గ్రామంలో బసచేశారు. సుశీల్‌కుమార్ షిండే అఖిలపక్ష సమావేశంలో పార్టీ వైఖ రిని తెలియజేయడానికి అక్కడే పొలిట్ బ్యూరో సమా వేశం నిర్వహించారు. ఆ సమావేశంలోనే తెలంగాణకు అనుకూలంగా గతంలో చేసిన తీర్మానాన్ని మరోసారి పునరుద్ఘాటించారు. అదే విషయాన్ని పొందు పరుస్తూ షిండేకు లేఖ రాశారు. ఆ లేఖలో ‘‘... ఈ నేపధ్యంలో మీ దృష్టికి తీసుకొచ్చేది ఏమిటంటే, మా పార్టీ తన అభిప్రా యాన్ని 18-10-2008న అప్పటి విదేశాంగమంత్రి ప్రణబ్ ముఖర్జీకి రాసిన లేఖ ద్వారా తెలియచేసింది. ఆ లేఖను మేం ఉపసంహరించుకోలేదు. మరోవైపు మాజీ హోం మంత్రి పి. చిదంబరం లోక్‌సభలో 2013 మే 5 న కాంగ్రెస్ తన అభిప్రాయాన్ని వెల్లడించలేదని ప్రకటించారు. ఇప్ప టికీ కాంగ్రెస్ తన వైఖరిని వెల్లడించలేదు. అనిశ్చితిని తొల గించేందుకు ఈ అంశంపై ఒక నిర్ణయం తీసుకోవా ల్సిం దిగా కేంద్రాన్ని మాపార్టీ కోరుతోంది.’’ ఇలా చెప్పడమం టే తెలంగాణకు అనుకూలమని స్పష్టంచేయడం కాదా?
 
 ఎవరిది యూ టర్న్?
 ఇరు ప్రాంతాలకు న్యాయం పాటించాలని, అలా చేయలే నప్పుడు... రాష్ట్రాన్ని యధాతథంగా ఉంచాలని స్పష్టమైన వైఖరిని చెబితే...  మా పార్టీ యూ టర్న్ తీసుకున్నట్టు కొం దరు ప్రచారం చేస్తున్నారు. అన్ని ప్రాంతాల ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం చేయమన్నాం. సీమాంధ్ర ప్రజల్లో వెల్లువెత్తిన ఉద్యమం చూసైనా అందరికీ ఆమో దయోగ్యమైన నిర్ణయం తీసుకోలేదన్న విషయం కాం గ్రెస్‌కు అర్ధంకాదా?  తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చి కూడా ఇప్పుడు తగుదునమ్మా... అంటూ బాబు ఆత్మగౌరవ యాత్ర చేయడాన్ని ఎలా చూడాలి?
 
ఇంత జరి గాక కాంగ్రెస్ ఆంటోనీ కమిటీ వేయడమేంటి? విభజన అంశం కాంగ్రెస్ సొంత వ్యవహారంగా చూస్తుందన్న విష యం  తెలియడం లేదా?  ప్రజల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమ వుతున్న తరుణంలో వారిని పక్కదారి పట్టించడా నికి వేసిన కమిటీ కాక మరేమనాలి? తెలంగాణ నిర్ణయం తీసుకున్నదే అధికార కాంగ్రెస్ అయినప్పుడు... అదీ అయిదు (కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ) పార్టీల ఆమోదంతో నిర్ణయం తీసుకున్నప్పుడు దానిపై ఆ పార్టీలను, కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రశ్నించకుండా వైఎస్సార్ కాంగ్రెస్ ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలని, ఆ పార్టీ యూ టర్న్ తీసుకున్నదనీ, సమైక్యాంధ్ర కోసం తీర్మానం చేయాలని... ఇలా రకరకాలుగా మాట్లాడటంలో ఆంతర్యమేంటి?  వైఎస్సార్ కాంగ్రెస్ తన వైఖరిని అనేక సందర్భాల్లో విడమరిచి స్పష్టంగా తెలియజేసింది. అయినా ఈ పార్టీలు అర్ధంకానట్టు నటిస్తున్నాయి. తమ గేమ్‌ప్లాన్ కొనసాగిస్తున్నాయి.
 - పిల్లి సుభాష్ చంద్రబోస్
 మాజీమంత్రి, వైఎస్సార్ సీపీ
 కేంద్రపాలక మండలి సభ్యులు   
Share this article :

0 comments: