'చంద్రబాబు ఆడే అబద్దాలకు హద్దే లేదు' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'చంద్రబాబు ఆడే అబద్దాలకు హద్దే లేదు'

'చంద్రబాబు ఆడే అబద్దాలకు హద్దే లేదు'

Written By news on Wednesday, September 4, 2013 | 9/04/2013

శ్రీమతి షర్మిల సమైఖ్య శంఖారావం

కదిరి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై షర్మిల నిప్పులు చెరిగారు.  అనంతపురం జిల్లా.. కదిరిలో   సమైక్య శంఖారావం పూరించిన ఆమె బుధవారం బాబు వైఖరిపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. 2009లో తెలుగు దేశం  పార్టీ అధికారంలోకి వస్తే..తెలంగాణకు సంబంధించి రాజకీయంగా..చట్టపరంగా ప్రకియ చేస్తామని చంద్రబాబు మేనిఫెస్టోలో చెప్పారని షర్మిల గుర్తు చేశారు. చంద్రబాబు ఇచ్చిన లేఖే రాష్ట్ర  విభజనకు కారణమన్నారు. పార్లమెంట్ ఎన్నికల నుంచి పంచాయతీ ఎన్నికలు  వరకు కాంగ్రెస్‌తో చంద్రబాబు కుమ్మక్కు అయ్యారని మండిపడ్డారు.

ఇచ్చిన లేఖ వెనక్కి తీసుకోలేని చంద్రబాబు.... తన పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలతో డ్రామాలాడిస్తున్నారని షర్మిల అన్నారు. ఇప్పుడు బస్సుయాత్రతో ప్రజలను మోసగిస్తున్నారన్నారు. విభజనకు కారణమైన బాబు... ఆ నెపాన్ని వైఎస్ఆర్ పై వేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఆడే అబద్దాలకు హద్దే లేదన్నారు. జీతాలు, జీవితాలు పణంగా పెట్టి ఉద్యోగులు, విద్యార్థులు సమైక్య కోసం పోరాడుతుంటే ...టీడీపీ, కాంగ్రెస్ నేతలు విందు రాజకీయం చేస్తున్నారన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు పదవులను పట్టుకుని వేళాడుతున్నారని షర్మిల ధ్వజమెత్తారు. న్యాయం చేసే సత్తా లేనది తేలిపోయిందని, అందుకే రాష్ట్రాన్ని సమైక్యండా ఉంచాలని ఆమె డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసినప్పుడే కాంగ్రెస్, టీడీపీ ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేసి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు. ఓట్లు, సీట్ల కోసమే కాంగ్రెస్ విభజనకు తెరతీసిందని, టీఆర్ఎస్ ను విలీనం చేసుకుని రాజకీయ లబ్ధి పొందాలని పార్టీ పెద్దలు యత్నిస్తున్నారన్నారు.

వైఎస్ఆర్ బ్రతికుంటే అనంతపురం లాంటి కరువు ప్రాంతానికి కూడా రెండు పంటలకు నీళ్లు వచ్చేవన్నారు. మహానేత ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, 108, 104, ఫీజు రీయింబర్స్ వంటి పథకాలు నిర్వీర్యమవుతున్నాయని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. పథకాలను నిర్లక్ష్యం చేస్తున్నవారు మనుషులు కాదు రాక్షసులని ఆమె మండిపడ్డారు. వైఎస్ హయాంలో ప్రజలపై పన్నులు, ఛార్జీల భారం లేవని ఈ సందర్భంగా షర్మిల గుర్తు చేశారు.
Share this article :

0 comments: