రాజ్ నాధ్ ను చంద్రబాబు కలవడమే పెద్ద విషయం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాజ్ నాధ్ ను చంద్రబాబు కలవడమే పెద్ద విషయం

రాజ్ నాధ్ ను చంద్రబాబు కలవడమే పెద్ద విషయం

Written By news on Monday, September 23, 2013 | 9/23/2013



తెలుగుదేశం అదినేత చంద్రబాబు నాయుడు లో ఒక విశిష్టగుణం ఉంది.తన ప్రత్యర్ధులెవరైనా ఏదైనా ఒక పనిచేస్తే దానిని తీవ్రంగా తూర్పారపట్టగలరు.జనంలో దానిపై సందేహం లేవనెత్తగలరు.అదే పని తాను చేస్తే అంతకన్నా రెట్టింపు గా సమర్ధించుకోగలరు.భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాజ్ నాద్ సింగ్ ను టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు కలుసుకుని రాష్ట్ర పరిస్థితులపై చర్చించారు.ఆయనతో పొత్తుల గురించి చర్చించలేదని చెప్పినా, అసలు ఆయనను కలవడమే పెద్ద వార్తగా చెప్పుకోవచ్చు.అదే ఏ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతో కలిసి ఉంటే మతతత్వ పార్టీతో కలిశారని పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఉండేవారు.ఉదాహరణకు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ పది శాతం రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తే , అప్పుడు బిజెపి గురించి ఆలోచిస్తానన్నప్పుడు టిడిపి నేతలు చేసిన ప్రచారం గుర్తుకు తెచ్చుకుంటే తమాషాగా ఉంటుంది.ఇప్పుడు ఆయన చూపు క్రమేపి బిజెపి వైపు మళ్లుతోందన్న వాదనలు వస్తున్న తరుణంలో వారి కలయికకు ప్రాధాన్యం ఉంటుంది.స్వయంగా ఆయన కూడా తన పార్టీ నేతలతో బిజెపితో పొత్తుగురించి ప్రశ్నిస్తున్నారని సమాచారం.అయితే చంద్రబాబు ఇటువంటి విషయాలలో కొంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటారు.రాష్ట్రపతిని,అలాగే సిపిఎం జాతీయ నాయకులు, ఇతర పార్టీల నేతలతో పాటు బిజెపిని కూడా కలిసినట్టు కనిపించారే తప్ప విడిగా కలిసినట్లు భావన ఇవ్వరు.అంతవరకు ఒకే.అంటే బిజెపితో పొత్తు వదలుకున్న తర్వాత దాని జోలికే వెళ్లబోమని, ఆ పార్టీ నాయకులెవ్వరితోను సంబంధాలు లేకుండా ఉన్న టిడిపి అదినేత చంద్రబాబు రాజ్ నాద్ సింగ్ ను కలవడమే పెద్ద విశేషంగా చెప్పుకోవాలి.ప్రత్యేక తెలంగాణకు స్పష్టమైన నిర్ణయం తీసుకున్న బిజెపితో కొత్తగా చర్చించేది ఏముంటుంది?అలాగే సమైక్య రాష్ట్రం విధానంగా పెట్టుకున్న సిపిఎం తో చర్చించేది ఏముంటుంది?పైగా ఆయా పార్టీలకు రాష్ట్రంలో సొంతశాఖలు ,నేతలు ఉన్నారు.వారు తమ జాతీయ నేతలకు చెప్పని విషయాలు చంద్రబాబు ఏమి చెబుతారు?కనుక ఇదంతా చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని,రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను యత్నిస్తున్నానన్న భావన కలిగించడానికి ఆయన ఈ పర్యటన చేసినట్లుగా భావించాలి. అయితే బిజెపి అదినేత రాజ్ నాద్ ను కలవడం వారితో పొత్తుకు నాందీ అయ్యే అవకాశం ఉంది.

http://kommineni.info/articles/dailyarticles/content_20130923_3.php
Share this article :

0 comments: