నాయకుడు అనాలా? లేక దుర్మార్గుడనాలా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నాయకుడు అనాలా? లేక దుర్మార్గుడనాలా?

నాయకుడు అనాలా? లేక దుర్మార్గుడనాలా?

Written By news on Wednesday, September 11, 2013 | 9/11/2013

Photo11 సెప్టెంబర్ 2013: మీ అబ్బ సొత్తనుకుని తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చావా? చంద్రబాబూ అని సీమాంధ్రులంతా ఎక్కడికక్కడ నిలదీయాలని శ్రీమతి షర్మిల పిలుపునిచ్చారు. ఆయన ఇచ్చిన విభజన లేఖను వెనక్కి తీసుకుని, తన పదవికి, తన పార్టీ నాయకుల చేత రాజీనామాలు చేయించిన తరువాతే సీమాంధ్రలో అడుగుపెట్టాలని చెప్పాలని అన్నారు. అంత వరకూ చంద్రబాబును సీమాంధ్ర నుంచి తరిమి తరిమి కొట్టాలన్నారు. కోట్లాది మంది సీమాంధ్రులకు అన్యాయం జరిగిపోతున్నా కాలర్‌ పట్టుకుని నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబులో ఏమాత్రం చలనం లేదన్నారు. విభజనకు కాంగ్రెస్‌ సాహసం చేయడానికి చంద్రబాబు ఇచ్చిన మద్దతే కారణం అన్నారు. రాష్ట్రంలో 60 శాతం మందికి అన్యాయం జరుగుతుంటే.. విభజన లేఖ ఇచ్చిన చంద్రబాబును నాయకుడు అనాలా? లేక దుర్మార్గుడనాలా? అన్నారు. పట్టపగలే సీమాంధ్రుల గొంతు కోసి ఏ ముఖం పెట్టుకుని ఇక్కడ అడుగు పెట్టారని అందరూ చంద్రబాబును ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. సమైక్య శంఖారావం బస్సు యాత్రలో భాగంగా బుధవారం రాత్రి గుంటూరు జిల్లా రేపల్లెలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో శ్రీమతి షర్మిల ప్రసంగించారు.

ఒకే తల్లి బిడ్డలైన, ఇంత వరకూ అన్నదమ్ముల్లా బ్రతికిన తెలంగాణ, సీమాంధ్ర ప్రజల మధ్య అగ్గిపెట్టి చలి కాచుకుంటోంది కాంగ్రెస్‌ పార్టీ అని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. తెలుగువారి ఓట్లతో గద్దెనెక్కి తెలుగువారినే వెన్నుపోటు పొడుస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికే మహారాష్ట్ర, కర్నాటక అవసరాలు తీరితేనే గాని గోదావరి, కృష్ణా నదుల నుంచి కింద ఉన్న మన రాష్ట్రానికి నీళ్ళు వదలని పరిస్థితి ఉంది. మధ్యలో మరో రాష్ట్రం వస్తే.. నదుల నీటిని అడ్డుకుంటే సీమాంధ్ర మహా ఎడారి అయిపోదా అని ప్రశ్నించారు. పోలవరానికి జాతీయ హోదా ఇస్తామంటున్న కాంగ్రెస్‌ పార్టీ ఆ ప్రాజెక్టుకు నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తుందో సమాధానం చెప్పాలని నిలదీశారు.

చదువుకున్న ప్రతి ఒక్కరూ హైదరాబాద్‌ వైపు చూస్తారని, విభజన పేరుతో సీమాంధ్రులను హైదరాబాద్‌ రావద్దంటే వారేమైపోవాలి? వారిని కష్టపడి చదివించిన తల్లిదండ్రుల పరిస్థితి ఏం కావాలన్నారు. రాష్ట్ర ఆదాయంలో సగం వచ్చే హైదరాబాద్‌ను తెలంగాణకు ఇచ్చేస్తే.. సీమాంధ్రలో సంక్షేమ పథకాలు ఎలా అమలు చేయాలి? ఉద్యోగులకు జీతాలెలా ఇవ్వాలని ప్రశ్నించారు. ఒక పక్కన రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తారట.. నీరు, హైదరాబాద్‌ సంగతి తేల్చరట.. హైదరాబాద్‌ను ఒక్కరికే ఇచ్చేస్తారట.. అంటూ ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.

పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి కుర్చీ లాగేసుకున్న చంద్రబాబు ఎన్టీఆర్‌ కుమారులను పక్కన పెట్టేశారని విమర్శించారు. చంద్రబాబు జమానా అవినీతి ఖజానా అని సిపిఎం పార్టీ ఒక పుస్తకాన్నే వేసిన వైనాన్ని ప్రస్తావించారు. లక్ష రూపాయలతో ఏర్పాటైన ఐఎంజి అనే తన బినామీ సంస్థకు ఏర్పాటైన కొద్ది రోజుల్లోనే వందల కోట్ల విలువైన 850 ఎకరాలను అప్పనంగా అత్యంత చౌకగా రాసిచ్చేశారని ఆరోపించారు. చంద్రబాబును విచారించడానికి సిబిఐ వద్ద సిబ్బంది లేరని విచారణ జరపని వైనాన్ని తెలిపారు. చిరంజీవి బంధువుల ఇంట్లో 70 కోట్లు దొరికితే కూడా సిబిఐ పట్టించుకోలేదు. మద్యం మాఫియా డాన్‌ అని అందరూ అంటున్నా ఆయనను సిబిఐ విచారించదన్నారు. కేంద్రం పెరట్లో సిబిఐ కుక్క అన్నారు. ధర్మాన, సబితకో న్యాయం, జగనన్నకో న్యాయం, మోపిదేవికో న్యాయం అని నిప్పులు చెరిగారు. లేని తప్పులన్నీ వెతికి మోపిదేవిని బలిపశువును చేసింది సిబిఐ అన్నారు. ఈ దుర్మాలందరి పాపం బద్దలయ్యే రోజు త్వరలోనే వస్తుందన్నారు.

రాష్ట్రాన్ని అడ్డగోలుగా చీల్చేస్తున్నామంటూ సంకేతాలు పంపించిన వెంటనే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, అధ్యక్షుడు సహా నాయకులంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేశారన్నారు. వారు రాజీనామాలు చేసినప్పుడే కాంగ్రెస్, టిడిపి ప్రజాప్రతినిధులు కూడా రాజీనామాలు చేసి ఉంటే విభజన ప్రక్రియ నిలిచిపోయేదన్నారు. కానీ వారి పదవే ముఖ్యం అని వేలాడుతున్నారన్నారు. విభజన చేయాల్సి వస్తే తండ్రి స్థానంలో ఉండి సమన్యాయం చేయాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ ఎప్పుడూ చెబుతోందన్నారు. న్యాయం చేసే ఉద్దేశం కాంగ్రెస్‌కు లేదు కనుక రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు.

రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంటే జగనన్న చేతులు కట్టుకుని కూర్చోరన్నారు. న్యాయం జరిగే వరకూ ప్రజలతో కలిసి వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉద్యమాలు చేస్తూనే ఉంటుందన్నారు. అబద్ధపు కేసులు పెట్టి జగనన్నను జైలుపాలు చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. కానీ బోనులో ఉన్నా సింహం సింహమే.. ఉదయించే సూర్యుడ్ని ఎవ్వరూ ఆపలేరు. జగనన్నను కూడా ఎవ్వరూ ఆపలేరు. త్వరలోనే జగనన్న వస్తారు.. మనందర్నీ రాజన్న రాజ్యం దిశగా నడిపిస్తారని శ్రీమతి షర్మిల చెప్పారు. అంత వరకూ జగనన్నను, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని ఆశీర్వదించాలని కోరారు.

జై సమైక్యాంధ్ర, జైజై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, జైజై సమైక్యాంధ్ర, జోహార్‌ వైయస్ఆర్, జై జగన్‌ అంటూ శ్రీమతి షర్మిల నినాదాలు చేశారు.

http://www.ysrcongress.com/news/top_stories/smt-sharmila-fired-on-chandrababu-naidu-in-repalle-meeting.html
Share this article :

0 comments: