వేలకొద్దీ షేరింగులు... లక్షల కొద్దీ లైకులు... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వేలకొద్దీ షేరింగులు... లక్షల కొద్దీ లైకులు...

వేలకొద్దీ షేరింగులు... లక్షల కొద్దీ లైకులు...

Written By news on Tuesday, September 24, 2013 | 9/24/2013

16 నెలల పాటు జగన్ అన్యాయంగా జైల్లో ఉన్నారెందుకు?
- కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎదిరించినందుకు
 మెజారిటీ లేకున్నా రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ నిలబడిందెందుకు?
 - తెలుగుదేశం కొమ్ముకాసినందుకు

 
 సాక్షి, హైదరాబాద్: వేలకొద్దీ షేరింగులు... లక్షల కొద్దీ లైకులు... జగన్‌కు బెయిలొచ్చింది.. ఫేస్‌బుక్‌కి పండగొచ్చింది.. సోమవారం కోర్టు తీర్పు వెలువడిన కొన్ని క్షణాల్లోనే ఫేస్‌బుక్‌లో జగన్ బెయిల్ మంజూరు సంగతిని ప్రకటించుకోవడంతో సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. ఎవరికి వారు తామే ఈ విషయాన్ని ప్రకటించాలనే ఆత్రుతతో ఆనందాన్ని రెట్టింపు చేసుకున్నారు. కామెంట్ల వర్షం కురిపించారు. ‘పులి బయటకొచ్చింది..’ ‘జగన్ గాట్ బెయిల్’ ‘గెట్‌రెడీ ఫర్ బ్యాటిల్’ ‘ప్రత్యర్థులకు కౌంట్‌డౌన్ స్టార్ట్’ ‘బాద్‌షా బయటకొస్తున్నాడు.. ఇక వార్ వన్ సైడే’ అంటూ ఫేస్‌బుక్‌లో పోస్టుల మీద పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. ఇదంతా క్షణాల్లో జరిగిన పని. అక్కడ నుంచి షేరింగులు... లైకింగులు హోరెత్తిపోయాయి! ఇక వార్తాపత్రికలు, న్యూస్ చానళ్ల వెబ్‌సైట్ల నుంచి కూడా జగన్ బెయిల్ వార్తను షేర్ చేసుకోవడం కూడా ఎక్కువగానే కనిపించింది.
 
 ఇక ‘జగనిజం’ ఫ్యాన్స్ ఆనందానికైతే అవధుల్లేవు! సోమవారం సాయంత్రం నుంచి ఫేస్‌బుక్‌లో ఏ పేజ్ క్లిక్ చేసినా.. జగన్‌మోహన్‌రెడ్డికి బెయిలొచ్చిందన్న వార్తే హైలైట్ అయ్యింది. ఉదయం నుంచే ‘ఈ రోజు అన్నకు బెయిలొస్తుంది’ అంటూ మొదలైన హడావుడి సాయంత్రానికి పీక్‌స్టేజ్‌కి వెళ్లింది. ‘ఫేస్‌బుక్‌లో మేము షేర్ చేసుకున్న స్వీటెస్ట్ న్యూస్ ఇదే...’ అంటూ ఉద్విగ్నతకు లోనైనవారు లెక్కలేనంతమంది. ‘జగన్ కు ఇన్నిరోజులూ బెయిల్ రాకుండా చేసినవారి గుండెల్లో ఈ రోజు భూకంపం పుట్టి ఉంటుంది’ అంటూ... విజయగర్వాన్ని వ్యక్తం చేసిన వారెందరో. ‘కంగ్రాట్స్ జగన్ సార్’ అంటూ శుభాభినందలను పంచుకున్నవారు ఇంకెందరో. ‘ఆంధ్రప్రదేశ్‌కు, వైఎస్ కుటుంబానికి 484 రోజుల కిందట దూరమైన ఒక తోడు తిరిగి లభించింది...’ అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.  జగన్‌కు బెయిల్ రావడం సమైక్యాంధ్ర ఉద్యమానికి కొత్త ఊపుగా మారుతుందని కొందరు ‘ట్విటిజనులు’ అభిప్రాయపడ్డారు. సరైన నాయకత్వంలేని సమైక్యవాద ఉద్యమానికి జగన్ ప్రాతినిధ్యం వహించగలడని ట్విట్టర్‌లో ట్వీట్ల వర్షం కురిపించారు.
 
 బాబు ఫెయిల్.. జగన్‌కు బెయిల్..
 జగన్‌కు బెయిల్ దక్కకుండా చేయాలన్న కుట్రలో చంద్రబాబు ఫెయిలయ్యాడన్న అభిప్రాయం బాగా షేర్ అయ్యింది. అటు ట్విటర్ కామెంట్‌గా ఫేస్‌బుక్ పోస్టుగా ఈ పంచ్ డైలాగ్ పేలింది.
 ఇలా ఫేస్‌బుక్, ట్విట్టర్, సెల్‌ఫోన్లలో మెసేజ్‌ల జోరు హోరెత్తింది.  
 
  ‘బాద్‌షా బయటకొస్తున్నాడు.. ఇక వార్ వన్ సైడే’
 ఇన్ని రోజులూ జగన్‌ను బంధించడమే అక్రమం, కనీసం ఇప్పటికైనా న్యాయం జరిగింది..  
 ‘‘ఎదురుచూపులు ఫలించాయి. జన సునామీ వస్తోంది. హ్యాపీ డే’
 మంచు లక్ష్మీ ట్వీట్ ‘‘కంగ్రాట్స్ వైఎస్సార్ సీపీ.. గ్రేట్ విన్. జగన్‌కు బెయిల్ వచ్చింది..’’ మంచు లక్ష్మీ ప్రసన్న ట్విట్టర్‌లో ట్వీట్ పోస్ట్‌చేశారు.

Share this article :

0 comments: