నేడు పలుచోట్ల వైస్సార్ వర్ధంతి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు పలుచోట్ల వైస్సార్ వర్ధంతి

నేడు పలుచోట్ల వైస్సార్ వర్ధంతి

Written By news on Sunday, September 1, 2013 | 9/01/2013

ముంబై: దివంగత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి నా లుగో వర్ధంతిని పురస్కరించుకుని సోమవా రం నగరం, శివారు ప్రాంతాల్లో ఆయన అభిమానులు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా రు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముంబైశాఖ నాయకులు మాదిరెడ్డి కొండారెడ్డి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు జరగనున్నా యి. సాయంత్రం ఆరు గంటలకు కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిర్వహించి, విద్యార్థులకు నో టు పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. అనంతరం చంద్రమణి బుద్ధవిహార్ హాలు, జీజామాతానగర్, తూర్పు గోరేగావ్‌లో వర్ధంతి సభలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి యాంకర్‌గా సాక్షిటీవీ సిల్లీబ్రాండ్ నిర్వాహకుడు మిమిక్రీ రమేశ్ వ్యవహరిస్తారని కొండారెడ్డి ఒక ప్రకటనలో చెప్పారు. గోరేగావ్‌లోని ఆంధ్ర ప్రజాసంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు కూడా నిర్వహిస్తారు.


మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్  వైఎస్ రాజశేఖరరెడ్డి నాలుగో వర్థంతిని రాష్ట్ర వ్యాప్తంగా భారీగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం  పలు సేవా కార్యక్రమాలు చేపట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇచ్చింది. రక్తదానాలు, ఉచిత వైద్య శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు వాడవాడలా నిర్వహించడానికి కార్యకర్తలు, నేతలు సన్నాహాలు చేసుకుంటున్నారు.

హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 9 గంటలకు  సేవాకార్యక్రమాలు జరుగుతాయని పార్టీ వర్గాలు తెలిపాయి. వర్థంతి రోజున వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించాలని నిర్ణయించారు.  రాష్ట్రంలో నెలకొన్న అగ్నిగుండంలాంటి పరిస్థితులను చక్కదిద్దేలా పైనుంచి ఆశీర్వదించాలని కోరుతూ ఆయన విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించాలని కార్యకర్తలకు  పార్టీ  పిలుపు ఇచ్చింది.

మహానేత వైఎస్‌  మనమధ్య నుంచి వెళ్లిపోయి నేటికి నాలుగేళ్ళు. కోట్లాది మంది గుండెల్లో అంతులేని శోకాన్ని మిగిల్చి  సంక్షేమ రాజ్యాన్ని మనకందించి వెళ్లిపోయారు. ప్రజల గుండెల్లో ఆయన చిరస్మరణీయుడు. అందుకే ప్రతి సంవత్సరం  కోట్లాది మంది ఆయన వర్థంతి రోజున ఆ మహానేతను స్మరించుకుంటున్నారు. వేలాది మందితో రేపు ఇడుపులపాయ పోటెత్తనుంది.

వైఎస్‌ఆర్‌ నాలుగో వర్ధంతి కోసం ఇడుపుపాయ ఘాట్‌ ముస్తాబైంది.  ఉదయం  ఆయన కుటుంబ సభ్యులు ఘాట్‌ను సందర్శించి మహానేతకు నివాళులర్పిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ యూత్‌ వింగ్‌ ఆధ్వర్యంలో మెగా బ్లడ్‌ డొనేషన్‌, హెల్త్‌ క్యాంప్‌ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు.
Share this article :

0 comments: