26న ఎల్బీ స్టేడియంలో సమైక్య శంఖారావం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 26న ఎల్బీ స్టేడియంలో సమైక్య శంఖారావం

26న ఎల్బీ స్టేడియంలో సమైక్య శంఖారావం

Written By news on Friday, October 18, 2013 | 10/18/2013

* పోలీసుల సూచన మేరకు తేదీని మార్చుకున్న వైఎస్సార్ కాంగ్రెస్
Photo: 26న హైదరాబాద్‌లో సమైక్య శంఖారావం సభ 
YS #Jagan to hold #Samaikya Shankaravam MEETING IN #HYDERABAD on 26th, October

అక్టోబర్ 26న సమైక్య శంఖారావం సభను  నిర్వహించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. సమైక్య రాష్ట్రం డిమాండ్‌తో మొదట ఈ నెల 19నే హైదరాబాద్‌లో సభ నిర్వహించాలనుకున్నా.. ప్రభుత్వం అనుమతించలేదు. దాంతో వైఎస్సార్‌సీపీ హైకోర్టును ఆశ్రయించింది. సభ నిర్వహణకు బుధవారం హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, 19వ తేదీ మరో రెండు రోజులే ఉండటంతో సమైక్య శంఖారావం సభను ఈ నెల 26వ తేదీకి పార్టీ వాయిదా వేసింది. ఆ మేరకు సభ నిర్వహణకు అనుమతి ఇవ్వాల్సిందిగా పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు కె.శివకుమార్ బుధవారం నగర డీసీపీ కమలాసన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.
సాక్షి, హైదరాబాద్: సమైక్య శంఖారావం సభను అక్టోబరు 28వ తేదీకి బదులుగా అక్టోబరు 26వ తేదీన జరపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. సమైక్య రాష్ట్రం డిమాండ్‌తో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఈ నెల 26న సమైక్య శంఖారావం సభను నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గురువారం ప్రకటించారు.

మొదట సభను 28వ తేదీన జరపాలని నిర్ణయించి పోలీసు అనుమతి కోరుతూ వైఎస్సార్సీపీ దరఖాస్తు కూడా చేసింది. అయితే, 28వ తేదీ సోమవారం అవుతుందని, ఆ రోజు ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి 26న కానీ, 27న కానీ జరుపుకుంటే బావుంటుందని పోలీసు ఉన్నతాధికారులు సూచించారు. 27వ తేదీ ఆదివారం రోజు ఎల్బీ స్టేడియాన్ని వేరొకరు ఇప్పటికే రిజర్వ్ చేసుకున్నారు. దాంతో 26వ తేదీ శనివారం సభ నిర్వహించాలని పార్టీ నేతలు నిర్ణయించారు.

నిజానికి ఈ నెల 19వ తేదీననే సభను నిర్వహించాలనుకున్నా పోలీసులు అనుమతించలేదు. వైఎస్సార్సీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు సభకు షరతులతో కూడిన అనుమతిని బుధవారం మంజూరు చేసింది. అయితే, సభ నిర్వహణకు రెండు రోజులే సమయం ఉండటంతో సభను వాయిదా వేయాలని పార్టీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
Share this article :

0 comments: