నెల రోజుల వ్యవధిలోనే రెండుసార్లు ఆమరణ నిరాహార దీక్ష - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నెల రోజుల వ్యవధిలోనే రెండుసార్లు ఆమరణ నిరాహార దీక్ష

నెల రోజుల వ్యవధిలోనే రెండుసార్లు ఆమరణ నిరాహార దీక్ష

Written By news on Thursday, October 10, 2013 | 10/10/2013



నెల రోజుల వ్యవధిలోనే రెండుసార్లు ఆమరణ నిరాహార దీక్ష
హైదరాబాద్ : రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విభజించడానికి వీల్లేదని, ఆంధ్ర ప్రదేశ్ ను యథాతథంగా ఉంచాలంటూ లోటస్ పాండ్ లోని తన నివాసం వద్ద గత ఐదు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పోలీసులు బుధవారం రాత్రి బలవంతంగా నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. 1066 అంబులెన్సులో ఆయనను లోటస్ పాండ్ లోని దీక్షా ప్రాంగణం నుంచి నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, అక్కడ కూడా ఆయన తన దీక్ష కొనసాగింపునకే మొగ్గు చూపారు. వైద్యులు ఆయనకు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించే ప్రయత్నం చేశారు. కానీ జగన్ మాత్రం చికిత్స తీసుకునేందుకు నిరాకరించారు.

వాస్తవానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమైక్య రాష్ట్రం కోసం నెల రోజుల వ్యవధిలోనే రెండుసార్లు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఇంతకుముందు చంచల్ గూడ జైల్లో ఉన్న ఆయన జైల్లోను, తర్వాత ఆస్పత్రిలోను కూడా ఆమరణ నిరాహార దీక్ష చేసిన విషయం తెలిసిందే. తొలుత జైలు నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. అక్కడినుంచి మళ్లీ నిమ్స్ కు తరలించి అక్కడ చికిత్సలు అందించిన విషయం తెలిసిందే.

నెల రోజుల వ్యవధిలో రెండుసార్లు ఆమరణ నిరాహార దీక్ష చేయడం వల్ల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిందని వైద్యవర్గాలు తెలిపాయి. ఆయన శరీరం అందుకు సహకరించకపోయినా, సంకల్పం మాత్రం దృఢంగా ఉండటం వల్లనే ఇన్ని రోజుల పాటు దీక్ష చేయగలిగారని, ఇక మీదట ఆయన దీక్ష కొనసాగించడం ఆయన ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని వైద్యులు పదే పదే చెప్పారు. అయినప్పటికీ జగన్ మాత్రం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు దీక్ష చేసేందుకే మొగ్గు చూపారు తప్ప విరమించే ప్రసక్తి లేదన్నారు.రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ గత ఐదు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పోలీసులు బలవంతంగా నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. దీక్ష ఐదో రోజుకు చేరుకోగా, జగన్ ఆరోగ్య పరిస్థితి బాగా విషమించింది
Share this article :

0 comments: