‘సమైక్య శంఖారావం’ పార్కింగ్, మార్గాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » ‘సమైక్య శంఖారావం’ పార్కింగ్, మార్గాలు

‘సమైక్య శంఖారావం’ పార్కింగ్, మార్గాలు

Written By news on Friday, October 25, 2013 | 10/25/2013

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజధాని నగరంలోని ఎల్బీ స్టేడియంలో శనివారం సమైక్య శంఖారావం పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. పార్టీ అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో వస్తారని భావిస్తున్న పోలీసులు దీనికి విస్తృత బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చే వాహనాలు హైదరాబాద్ నగరంలోని ప్రవేశించాక అనుసరించడం కోసం ప్రత్యేక మార్గాలు, పార్కింగ్ వసతులు కల్పించారు. 
 స్టేడియం చుట్టు పక్కల ఉన్న ప్రాంతాల్లో కేటాయించిన ప్రాంతాల మినహా మిగిలిన చోట్ల నిలుపుకో వాల్సిన వాహనాల్లో వచ్చిన కార్యకర్తలు, అభిమానులు ఎన్టీఆర్ స్టేడియం, ఎంజే మార్కెట్ వద్ద  దిగిపోవాలి. అక్కడ నుంచి వాహనాలు వాటికి కేటాయించిన పార్కింగ్ ప్రాంతాలకు వెళ్లాలి. కార్యకర్తలు, అభిమా నులు మాత్రం కాలినడ కన వేదిక వద్దకు చేరు కోవాల్సి ఉంటుంది. సభ పూర్తయిన తరవాత సైతం ఎన్టీఆర్ స్టేడియం, ఎంజే మార్కెట్ వద్ద నుంచే  తమ తమ వాహనాల్లో ఎక్కి వెళ్లాల్సి ఉంటుంది. సహాయసహకారాలు, సూచనలు కోసం విధుల్లో ఉండే వాలంటీర్లు, ట్రాఫిక్, శాంతిభద్రతల విభాగం పోలీసుల్ని సంప్రదించవచ్చు.
 మార్గాలు, పార్కింగ్ ఇలా...

 విజయవాడ, నాగార్జునసాగర్ మార్గాల్లో వచ్చే వాహనాలు నల్లగొండ చౌరస్తా, చాదర్‌ఘాట్, కాచిగూడ ట్రాఫిక్ పోలీసుస్టేషన్, కాచిగూడ రైల్వేస్టేషన్, టూరిస్ట్ హోటల్, బర్కత్‌పుర, క్రౌన్ కేఫ్, బాగ్‌లింగంపల్లి, వీఎస్టీ, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ మీదుగా ప్రయాణించి ఎన్టీఆర్ స్టేడియం వద్దకు చేరుకోవాలి. కార్యకర్తలు అభిమానుల్ని అక్కడ దింపి వాహనాలను ఎన్టీఆర్ స్టేడియం, సికింద్రాబాద్‌లోని పెరేడ్‌గ్రౌండ్స్‌లో పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. 
స్టేడియం చుట్టు పక్కల ఉన్న ప్రాంతాల్లో కేటాయించిన ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల నిలుపుకోవాల్సిన వాహనాల్లో వచ్చిన కార్యకర్తలు, అభిమానులు ఎన్టీఆర్ స్టేడియం, ఎంజే మార్కెట్ వద్ద దిగిపోవాలి. అక్కడ నుంచి వాహనాలు వాటికి కేటాయించిన పార్కింగ్ ప్రాంతాలకు వెళ్లాలి. కార్యకర్తలు, అభిమానులు మాత్రం కాలినడకన వేదిక వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. సభ పూర్తయిన తరవాత సైతం ఎన్టీఆర్ స్టేడియం, ఎంజే మార్కెట్ వద్ద నుంచే  తమ తమ వాహనాల్లో ఎక్కి వెళ్లాల్సి ఉంటుంది. సహాయ సహకారాలు, సూచనలు కోసం విధుల్లో ఉండే వాలంటీర్లు, ట్రాఫిక్, శాంతిభద్రతల విభాగం పోలీసుల్ని సంప్రదించవచ్చు.

 కర్నూలు, అనంతపురం
 జిల్లాల మార్గాలు, పార్కింగ్స్ ఇలా...
  కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి వచ్చే బస్సులు పీవీ నర్సింహ్మారావు ఎక్స్‌ప్రెస్ వే మీదుగా ప్రయాణించాలి. ఇది ముగిసిన తరవాత మెహదీపట్నం, అయోధ్య జంక్షన్, నిరంకారి భవన్, లక్డీకాపూల్, టెలిఫోన్ భవన్, ఇక్బాల్ మీనార్, తెలుగుతల్లి చౌరస్తా, లుంబినీపార్క్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్‌లోకి ప్రవేశించి.. నెక్లెస్‌రోడ్‌కు చేరుకుని అక్కడ పార్క్ చేసుకోవాలి.
  ఈ జిల్లాల నుంచి వచ్చే కార్లు వంటి తేలికపాటి వాహనాలకు పబ్లిక్ గార్డెన్స్, లుంబినీ పార్క్, ఎన్టీఆర్ మార్గ్‌ల్లో పార్కింగ్ కేటాయించారు. కడప, చిత్తూరు, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి వచ్చే బస్సులు, తేలికపాటి వాహనాలు జూ పార్క్, బహదూర్‌పుర, పేట్లబురుజు, సిటీ కాలేజ్, హైకోర్టు, నయాపూల్, ఉస్మానియా ఆస్పత్రి, బేగంబజార్ మీదుగా ఎంజే మార్కెట్ వద్దకు చేరుకోవాలి. ఇక్కడ కార్యకర్తల, అభిమానుల్ని దింపాల్సి ఉంటుంది. వాహనాలను ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, పాతబస్తీలోని కులీకుతుబ్‌షా స్టేడియం, పేట్లబురుజులోని సిటీ ఆర్డ్మ్ రిజర్వ్ హెడ్-క్వార్టర్స్, గోషామహల్ పోలీసుస్టేడియంల్లో పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. గోషామహల్ స్టేడియం కేవలం ఆర్టీసీ బస్సులకు మాత్రమే అనుమతిస్తారు.
Share this article :

0 comments: