జాతీయ అభిప్రాయం ప్రతిబింభించే 'సమైక్య శంఖారావం' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జాతీయ అభిప్రాయం ప్రతిబింభించే 'సమైక్య శంఖారావం'

జాతీయ అభిప్రాయం ప్రతిబింభించే 'సమైక్య శంఖారావం'

Written By news on Wednesday, October 23, 2013 | 10/23/2013

జాతీయ అభిప్రాయం ప్రతిబింభించే 'సమైక్య శంఖారావం'
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఇచ్చిన 'సమైక్య శంఖారావం' పిలుపు దేశ ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింభిస్తోంది. జగన్ పిలుపుకు రాష్ట్రం అంతా స్పందించింది. రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు తమ సంపూర్థ మద్దతు పలికారు. సమైక్యాంధ్రకు ఎవరు మద్దతు పలికినా తాము తరలివస్తామని సమైక్యవాదులు ముందుకు వస్తున్నారు.   ఈ నెల 26న హైదరాబాద్ ఎల్ బి స్టేడియంలో జరిగే 'సమైక్య శంఖారావం' భారీ బహిరంగ సభకు సీమాంధ్ర జిల్లాల నుంచే కాకుండా తెలంగాణ జిల్లాల నుంచి కూడా జనం భారీగా తరలిరానున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి, అన్ని వర్గాల ప్రజల నుంచి  అపూర్వ స్పందన లభిస్తోంది. ఉద్యోగులు, మహిళలు, విద్యార్థులు అందరూ ఈ సభకు కదలిరానున్నారు. ఈ నేపధ్యంలో కోల్ కతా నుంచి వెలువడే 'స్టేట్స్ మన్' జాతీయ పత్రిక తెలంగాణ విషయంలో కాంగ్రెస్ ఎత్తుగడలను మీరు సమర్ధిస్తారా? అన్న ప్రశ్నతో ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో   అత్యధిక శాతం మంది ప్రజలు తెలంగాణ అంశంలో కాంగ్రెస్ విధానాలను సమర్ధించలేదు. అంటే జాతీయ స్థాయిలో కూడా జగన్ పిలుపుకు మంచి స్పందన లభిస్తోంది. ఈ 'సమైక్య శంఖారావం' జాతీయ అభిప్రాయంగా మన భావించవచ్చు.

రాష్ట్ర ప్రజల నుంచి 'సమైక్య శంఖారావం'కు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. సమైక్యత కోసం పోరాడే ఏకైక యువనాయకుడు జగన్ ఒక్కరే. రాష్ట్ర ప్రజలు కూడా జగన్ పైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. జగన్ వల్లే రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని వారు భావిస్తున్నారు.  రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కూడా మద్దతు ప్రకటించింది. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులందరు సమైక్య శంఖారావం సభకు హాజరు కావాలని ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సుబ్బరాయన్ పిలుపు ఇచ్చారు. మరోవైపు  ఆంధ్రా విశ్వవిద్యాయలయం విద్యార్థి జేఏసీ మద్దతు ప్రకటించింది.  విద్యార్థులంతా కలిసి సభను విజయవంతం చేయాలని ఆంధ్ర యూనివర్సిటి విద్యార్థి జేఏసీ కన్వీనర్ కాంతారావు పిలుపు ఇచ్చారు. సమైక్య భావనతో నిర్వహిస్తున్న శంఖారావం సభను కొందరు రాజకీయ దృష్టితో చూడటంపై విద్యార్ధులు మండిపడ్డారు. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక  బుధవారం సమావేశం నిర్వహించి 'సమైక్య శంఖారావం'కు మద్దతు ప్రకటించింది.

ఈ నెల 26న ఉప్పెనలా జనప్రవాహం హైదరాబాద్ కు తరలిరావడం ఖాయమని తేలిపోయింది. ఈ నేపధ్యంలో జన సముద్రమైపోయే హైదరాబాద్ లో శాంతిభద్రతలు పర్యవేక్షణపై పోలీసులు దృష్టి సారించారు. మరో వైపు భారీగా తరలి వచ్చే జనానికి సభా వేదిక కనిపించే విధంగా పలు ప్రాంతాలలో  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద టివీ స్క్రీన్లను ఏర్పాటు చేయనుంది.
Share this article :

0 comments: