వైఎస్సార్ సీపీ అమలాపురం పరిశీలకునిగా విశ్వరూప్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ సీపీ అమలాపురం పరిశీలకునిగా విశ్వరూప్

వైఎస్సార్ సీపీ అమలాపురం పరిశీలకునిగా విశ్వరూప్

Written By news on Wednesday, October 23, 2013 | 10/23/2013

కాకినాడ :రాష్ట్ర విభజనకు తెగబడుతున్న కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు సమైక్యవాదులు కృషి చేయాలని మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ విజ్ఞప్తి చేశారు. సమైక్యాంధ్ర కోసం స్పష్టమైన విధానంతో ముందడుగు వేస్తున్న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 26న నిర్వహిస్తున్న సమైక్య శంఖారావ సభ విజయవంతానికి ప్రతీ సమైక్యవాది కృషి చేయాలన్నారు. వైఎస్సార్ సీపీ అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకునిగా నియమితులైన సందర్భంగా విశ్వరూప్ హైదరాబాద్ నుంచి ఫోన్‌లో ‘సాక్షి’తో మాట్లాడారు. జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నా, షరతులతో కూడిన బెయిల్‌పై ఉన్నా తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా ఆమరణ దీక్షలు చేపట్టి సమైక్య ఉద్యమానికి ఊపిరి పోశారన్నారు. అదే స్ఫూర్తితో రాష్ట్రంలో సమైక్య ఉద్యమాన్ని ప్రజలు, ఉద్యోగులు ముందుండి నడిపించారన్నారు.  ఉద్యోగులు తాత్కాలికంగా ఉద్యమాన్ని నిలిపివేయడంతో ఇప్పుడు ఆ బాధ్యతను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో స్వీకరించిందన్నారు. 26న జరిగే సమైక్య శంఖారావ సభకు జిల్లా నలుమూలల నుంచి  పెద్ద ఎత్తున సమైక్యవాదులు తరలి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
 
పార్టీలతో సంబంధం లేకుండా సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటున్న ప్రతీ ఒక్కరు ఈ సభకు స్వచ్ఛందంగా తరలి రావాలన్నారు. కోనసీమ నుంచి వచ్చేవారి కోసం ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేస్తున్నామని, హైదరాబాద్‌లో వసతి సౌకర్యం కూడా కల్పిస్తున్నామని విశ్వరూప్ తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రెండుకళ్ల సిద్ధాంతంతో రెండు ప్రాంతాల వారిని మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. మరోసారి ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు రెండో విడత ఆత్మగౌరవ యాత్రకు సిద్ధం కావడం ఆ పార్టీ దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు. ఆ పార్టీ నేతలు చెబుతున్నట్టు చంద్రబాబు సమైక్య రాష్ట్రానికి కట్టుబడి ఉంటే విభజన కోరుతూ ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలని విశ్వ
రూప్ డిమాండ్ చేశారు.

వైఎస్సార్ సీపీ అమలాపురం పరిశీలకునిగా విశ్వరూప్
కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి పినిపే విశ్వరూప్‌ను పార్టీ అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకునిగా నియమించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ అధిష్ఠానం మంగళవారం నియామక ఉత్తర్వులు జారీ చేసింది

http://www.sakshi.com/news/andhra-pradesh/come-to-jagans-samaikya-sankharavam-called-by-viswa-roop-75173

Share this article :

0 comments: