ఢిల్లీకి దిమ్మ తిరగాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఢిల్లీకి దిమ్మ తిరగాలి

ఢిల్లీకి దిమ్మ తిరగాలి

Written By news on Tuesday, October 22, 2013 | 10/22/2013

ఢిల్లీకి దిమ్మ తిరగాలి
సాక్షి నెట్‌వర్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 26న హైదరాబాద్‌లోతలపెట్టిన ‘సమైక్య శంఖారావం’ సభను చూసి ఢిల్లీ పెద్దల దిమ్మ తిరగాలని పార్టీ నేతలన్నారు. పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా సమైక్యవాదులందరూ సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు. సోమవారం పలు జిల్లాల్లో పార్టీ కార్యకర్తలతో ముఖ్య నేతలు సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ‘సమైక్యవాణిని ఢిల్లీకి బలంగా వినిపించేందుకు ఇదే చిట్టచివరి అవకాశం.
 
సభకు భారీగా తరలివచ్చి ఆవేదన ను ఎలుగెత్తి చాటండి’ అని పిలుపునిచ్చారు. శంఖారావ సభ రాష్ట్ర భవిష్యత్తునే మలుపు తిప్పనుందని ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తిరుపతిలో జోస్యం చెప్పారు. సభకు గుంటూరు జిల్లా నుంచి 50 వేల మంది హాజరు కానున్నట్టు ఒంగోలు ఎమ్మెల్యే బాలి నేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. పార్టీరహితంగా జరిగే ఈ సభ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. పార్టీలపై ఒత్తిడి తేవాలంటే అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు ఉప్పెనలా శంఖారావానికి తరలి రావాలని వైఎస్సార్‌సీపీ నేత శోభా నాగిరెడ్డి, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి అనంతపురంలో కోరారు.
 
తెలంగాణవాదులూ.. అడ్డుకోకండి: మేకపాటి
సమైక్యవాదుల హృదయ ఘోష శంఖారావ సభలో ప్రతిధ్వనిస్తుందని, ఆ ప్రకంపనలకు ఢిల్లీ పీఠమే గడగడలాడుతుందని వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి నెల్లూరులో అన్నారు. సభను అడ్డుకునే యోచనను విరమించుకోవాలని తెలంగాణవాదులను కోరారు. యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిరంకుశ విభజన నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేస్తామన్నారు.

సమైక్య శంఖారావం వైఎస్సార్‌సీపీ కార్యక్రమం కాదని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుకునే ప్రతి తెలుగువాడికీ సంబంధించిన సభ అని పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి నంద్యాల (కర్నూలు)లో అన్నారు. ఎన్జీవోలు, ఉద్యోగులు, అంబేద్కర్‌వాదులు, సమైక్యవాదులు కలిసికట్టుగా సభకు రావాలని వైఎస్సార్‌సీపీ కేంద్ర పాలకమండలి సభ్యుడు జూపూడి ప్రభాకరరావు కందుకూరు (ప్రకాశం)లో పిలుపునిచ్చారు. సమైక్య సభ కనీవినీ ఎరుగని రీతిలో జరుగబోతోందని పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పేర్కొన్నారు. తెలంగాణ లో ఉద్యోగ, వ్యాపారరీత్యా స్థిరపడ్డ దాదాపు 40 లక్షల మంది సీమాంధ్రులంతా విభజన నిర్ణయంపై నిరసన తెలిపేందుకు సమైక్య సభకు తరలి రావాలని పార్టీ సీజీసీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ కాకినాడలో పిలుపునిచ్చారు.
Share this article :

0 comments: