ఆర్టీసీ బస్సెక్కితే ఇక బాదుడే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆర్టీసీ బస్సెక్కితే ఇక బాదుడే

ఆర్టీసీ బస్సెక్కితే ఇక బాదుడే

Written By news on Wednesday, October 23, 2013 | 10/23/2013

ఇక బస్సెక్కలేం!
 * కనీసం10 శాతం చార్జీల పెంపు.. ఆర్టీసీ నిర్ణయం
 * ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ..
 *  నాలుగేళ్లలో నాలుగోసారి బాదుడు!
 *  గత మూడేళ్లలో 50 శాతానికిపైగా పెరిగిన చార్జీలు
 *  ప్రతిపాదిత పెంపు భారం ఏటా రూ. 500 కోట్లు    

 సాక్షి, హైదరాబాద్: 
ఆర్టీసీ బస్సెక్కితే ఇక బాదుడే.. నష్టాలను సాకుగా చూపుతూ చార్జీల మోతకు ఆర్టీసీ రంగం సిద్ధం చేసింది. కనీసం 10 శాతం చార్జీల హెచ్చింపునకు ప్రతిపాదనలు రూపొందించింది. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. చార్జీల పెంపుపై ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ప్రతిపాదిత పెంపు భారం ఏటా కనీసం రూ. 500 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. చార్జీల పెంపులో గ్రామీణ రూట్లలో తిరిగే పల్లె వెలుగు బస్సులనూ మినహారుుంచలేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయూంలో ఆర్టీసీ చార్జీలు ఏనాడూ పెరగలేదు.
 
 ఆయన అధికారం చేపట్టేనాటికి ఉన్న చార్జీలే ఆయన మరణించే నాటికీ అమల్లో ఉన్నాయి. ఆయన వుృతి తర్వాత 50 శాతానికిపైగా ఆర్టీసీ చార్జీలు పెరిగాయి.  తాజా చార్జీలు అమల్లోకి వస్తే..  మొత్తం పెంపు 60శాతం దాటనుంది. 2009 సెప్టెం బర్ 1 తర్వాత నాలుగేళ్లలో మూడు సార్లు ఛార్జీలు పెంచారు. 2010 జనవరి 9న 28.41 శాతం, 2001 జూలై 17న 10 శాతం, 2012 సెప్టెంబర్ 24న 12.5 శాతం చొప్పున ఛార్జీలు పెంచారు. 2010లో రూ. 480 కోట్లు, 2011లో రూ. 538 కోట్లు, 2012లో రూ. 362 కోట్లు.. ఛార్జీల పెంపు భారాన్ని ప్రయాణీకులపై మోపారు. ఛార్జీలు పెరిగి ఏడాది వుుగియుగానే.. మళ్లీ వడ్డన ప్రతిపాదనను ఆర్టీసీ సిద్ధం చేసింది. సరాసరిన ఈ దఫా ఛార్జీల వడ్డన 10 శాతానికి పైగా ఉండబోతోంది.

ప్రస్తుతం ప్రతి కిలోమీటరుకు ప్రయాణానికి పల్లెవెలుగు బస్సుల్లో 55 పైసలు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో 72 పైసలు, డీలక్స్ బస్సుల్లో 80 పైసలు, సూపర్ లగ్జరీ బస్సుల్లో 94 పైసలు, ఇంద్రలో రూ. 1.20, గరుడలో రూ.1.40, గరుడప్లస్‌లో రూ. 1.50, వెన్నెల బస్సుల్లో రూ. 2.30 వసూలు చేస్తున్నారు. కనీస ఛార్జీ పల్లెవెలుగు బస్సుల్లో రూ. 5, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రూ. 10, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో రూ. 15, ఇంద్ర, గరుడ, గరుడ ప్లస్ బస్సుల్లో రూ. 25, వెన్నెల బస్సుల్లో రూ. 50.. కనీస ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ప్రతిపాదిత పెంపు అమలయితే.. కనీస ఛార్జీలు పల్లెవెలుగులో రూ. 7, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రూ. 15, డీలక్స్, సూపర్ లగ్జరీలలో రూ. 20కు పెరగనున్నారుు.
 
 సామాన్యుడి మీదే అధిక భారం
 తాజా వడ్డింపు ప్రతిపాదనలు సామాన్యుల జేబు పిండటడమే లక్ష్యంగా ఆర్టీసీ రూపొందించింది. గ్రామీణులు ప్రయాణించే పల్లెవెలుగు, ఆర్డినరీ బస్సులు, సిటీ బస్సుల ఛార్జీల పెంపు ద్వారా అధిక ఆదాయ ఆర్జనకు ఆర్టీసీ సిద్ధపడింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ 1.40 కోట్ల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయూణిస్తుండగా.. వారిలో గ్రామీణ సర్వీసుల ప్రయాణికులే ఎక్కువ. నిత్యం సగటున 75 లక్షల మంది.. అంటే సగానికి పైగా ప్రయాణికులు పల్లెవెలుగు, సిటీ బస్సులను వినియోగించుకుంటున్నారు. పల్లెవెలుగు బస్సుల్లో.. కిలోమీటరుకు కనీసం 5 పైసల చొప్పున వడ్డించడమేగాకుండా... కనీస చార్జీని రూ.7కు పెంచనుంది. ఎక్కువ ప్రయాణీకులను గమ్యస్థానాలను చేర్చడంలో పల్లెవెలుగు తర్వాతి స్థానం సిటీ ఆర్డినరీ బస్సుల దే. సుమారు 20.41శాతం మంది ఈ బస్సులలో ప్రయూణిస్తున్నా రు. ఈ క్రమంలో ఈ బస్సుల చార్జీలను భారీగా పెంచనున్నారు. టికెట్ కనీస ధరను రూ.7కు పెంచడం ద్వారా ‘సిటీ’ ప్రయాణాన్ని కూడా ఆర్టీసీ భారంగా మార్చనుంది.
Share this article :

0 comments: