సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యం : వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యం : వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యం : వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

Written By news on Thursday, October 24, 2013 | 10/24/2013

సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యం : వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటన
 ‘సమైక్య శంఖారావం’ ఏర్పాట్లపై రంగారెడ్డి, నల్లగొండ, మెదక్ జిల్లాల నేతలతో సమీక్ష
రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల అభివృద్ధి సాధ్యమవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఇదే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని, ఈ నెల 26న హైదరాబాద్‌లో జరిగే సమైక్య శంఖారావం సభను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని ఆయన పార్టీ జిల్లా నేతలకు సూచించారు. బుధవారం రంగారెడ్డి, నల్లగొండ, మెదక్ జిల్లాలకు చెందిన పార్టీ నాయకులతో జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు.
 
 జిల్లాల వారీగా నేతలతో ఆయన విడివిడిగా మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తన ఐదేళ్ల పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల అన్ని ప్రాంతాల వారూ లబ్ధి పొందారని గుర్తుచేశారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఈ పథకాల వల్ల ఎంతో లబ్ధి చేకూరిందన్నారు. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే తన లక్ష్యమని, ఆ దిశగానే వైఎస్సార్ కాంగ్రెస్ పని చేస్తుందని చెప్పారు. కొంత కాలంగా కుంటుబడిన సంక్షేమ పథకాలను పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మరింత పెద్ద ఎత్తున అమలు చేస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు. ఈ సభ కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం అవుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు. ఈ సమావేశంలో మూడు జిల్లాల అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, లోక్‌సభ నియోజకవర్గాల పరిశీలకులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: