చంద్రబాబును ఆడుకున్న జాతీయ మీడియా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబును ఆడుకున్న జాతీయ మీడియా

చంద్రబాబును ఆడుకున్న జాతీయ మీడియా

Written By news on Monday, October 7, 2013 | 10/07/2013

చంద్రబాబును ఆడుకున్న జాతీయ మీడియావిస్తరించు & ప్లే క్లిక్ చేయండి
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు  ఈరోజు ఢిల్లీలో జాతీయ మీడియా ప్రతినిధులు  చుక్కలు చూపించారు. హైదరాబాద్‌లో ఉదయం ఆయన  ఎన్టీఆర్ ఘాట్‌ వద్ద నివాళులర్పించి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో బాపు ఘాట్‌ వద్ద కూడా నివాళులర్పించిన తరువాత  దీక్ష ప్రారంభించే ముందు జాతీయ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. దీక్ష ఎందుకు కోసం చేస్తున్నారో చెప్పకపోవడంతో విలేకరులు  ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగి ఆయనను గుక్క తిప్పుకోకుండా చేశారు.  ఒక్కమాటలో చెప్పాలంటే విలేకరులు చంద్రబాబును ఆడుకున్నారు.  దీంతో చంద్రబాబు ఒక దశలో సహనం కోల్పోయి  విలేకరులపై విసుర్లు విసిరారు.

ఆయన మాటల్లో ఎక్కడా 'సమైక్యత' అన్న పేరు ఎత్తలేదు. మీరు దేని కోసం దీక్ష చేస్తున్నారని అడిగితే, ధర్మం కోసం, న్యాయం కోసం అని సమాధానం చెప్పారు. తాను ఢిల్లీకి వచ్చింది  న్యాయం కోసం అన్నారు. ప్రశ్నలు సంధించిన  విలేకరులపై చంద్రబాబు తిరిగి ప్రశ్నలు సంధించారు.  విలేకరుల అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పకుండా, తనకు అధికారం ఇస్తే ఆరు నెలల్లో  సమస్యపరిష్కరిస్తానని చెప్పారు.  రాజకీయాలు గురించి మాట్లాడను అంటూనే రాజకీయాలు  మాట్లాడారు.


రాష్ట్రాన్ని విభజించాలన్న సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు స్వాగతించారు. కొత్త రాజధాని ఏర్పాటుకు  ప్యాకేజీలు కూడా అడిగారు. ప్రజాగ్రహం చూసి దీక్ష అంటూ కొత్త అంకం మొదలు పెట్టారు.   ఆయన దీక్షకు పార్టీ వర్గాల నుంచే సంపూర్ణ మద్దతు లభించడంలేదు. దీక్షకు బయలు దేరే ముందు ఆయన తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల నేతలతో  హైదరాబాద్‌లో సంప్రదింపులు జరిపారు. దీక్ష తగదని తెలంగాణ నేతలు సూచన చేసినా ఆయన తిరస్కరించారు. ఆయన దీక్ష చేపట్టడం ఇష్టం లేకపోవడంతో ఎన్టీఆర్‌ఘాట్ దగ్గర నివాళి అర్పించిన సమయంలో చంద్రబాబు వెంటన తెలంగాణ నేతలు ఎవరూ కనిపించలేదు.  అసలు ఆయన  దీక్ష ఎందుకు తలపెట్టారో ఎవరికీ అర్ధంకావడంలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి  జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర సమైక్యత కోసం చేపట్టిన సమైక్య దీక్షకు మద్దతు వెల్లువెత్తుతోందని చంద్రబాబుకు భయం పట్టుకుంది. దాంతో ఆయన కూడా దీక్ష చేయాలని నిర్ణయించుకున్నట్లుగా ఉంది గానీ, దీక్ష ఎందుకోసం చేస్తున్నారో స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.
Share this article :

0 comments: