వాజపేయికి నేనే సూచనలిచ్చా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వాజపేయికి నేనే సూచనలిచ్చా

వాజపేయికి నేనే సూచనలిచ్చా

Written By news on Thursday, October 3, 2013 | 10/03/2013


రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జాతీయస్థాయిలో, రాష్ట్ర స్థాయిలో బీజేపీతో దోస్తీ కోసం టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. బీజేపీ అగ్ర నాయకత్వాన్ని, మరీ ముఖ్యంగా గుజరాత్ ముఖ్యమంత్రి, ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీని ప్రసన్నం చేసుకోవటాడానికి ఆయన పడరాని పాట్లు పడుతున్నారు. మోడీతో కలిసి ఢిల్లీలో బుధవారం రోజంతా ఓ సదస్సు వేదికను పంచుకున్న బాబు.. నాటి ఎన్‌డీఏ పాలనను, మోడీ హయాంలో గుజరాత్ పాలనను ఆకాశానికెత్తుతూ పొగడ్తలతో ముంచెత్తారు. బుధవారం రాత్రి మోడీతో ఏకాంతంగా భేటీ అయ్యారు. 
 
 భవిష్యత్ కార్యాచరణపై అరగంట పాటు మంతనాలు నెరిపారు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్‌తో తలపడే పరిస్థితి లేకపోవటం.. రాబోయే ఎన్నికల్లో సీమాంధ్ర, తెలంగాణ రెండు ప్రాంతాల్లోనూ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారటంతో చంద్రబాబు ఢిల్లీ రాజకీయాలపై దృష్టి సారించటం తెలిసిందే. ఒకవైపు మూడేళ్లుగా కాంగ్రెస్‌తో అంటకాగుతున్నప్పటికీ.. రాబోయే రోజుల్లో ఎటువైపు వెళ్తే కనీసం కేంద్రంలోనైనా చక్రం తిప్పే అదృష్టం దక్కే అవకాశముందని బేరీజు వేసుకుంటున్న చంద్రబాబు.. ఇటు యూపీఏతో పాటు ఎన్‌డీఏ, వామపక్షాలు, ఇతర జాతీయ పార్టీలతోనూ సంప్రదింపులు నెరపుతున్న విషయమూ విదితమే. 

 వేదికపైకి వచ్చేటపుడు, వెళ్లేటపుడు మోడీకి దగ్గరగా మెలిగారు. మోడీని వేదికపై అదేపనిగా నవ్వుతూ పలకరించటం, పదే పదే ప్రశంసించటం, ఆపైన తెర వెనక ఏకాంత మంతనాలు.. ఇవన్నీ బీజేపీకి దగ్గరవటానికి బాబు పడుతున్న పాట్లలో భాగమేనని టీడీపీలోని ఉన్నతస్థాయి వర్గాలు ధ్రువీకరించాయి. రాత్రి జరిపిన భేటీ తర్వాత మోడీ కానీ, బాబు కానీ మీడియాతో మాట్లాడడానికి ఇష్టపడలేదు. అయితే.. త్వరలోనే మరో విడత చర్చలు ఉంటాయని, ఆ తర్వాత టీడీపీ లాంఛనంగా ఎన్‌డీఏలో చేరుతుందని ఢిల్లీ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. 
 
 రాజగురువు మార్గదర్శనంలోనే...
 హైదరాబాద్‌లో ‘రాజగురువు’ చేసిన మార్గనిర్దేశానుసారం తమ పార్టీ అధినేత ఆ విధంగా ముందుకెళ్తున్నారని.. ఇది చివరికి తమను ఏ తీరాలకు చేరుస్తుందోనని పార్టీ ముఖ్య నేతలు కలవరం చెందుతున్నారని టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి. 
 
వాజపేయికి నేనే సూచనలిచ్చా: బాబు

 ఎన్‌డీఏ హయాంలో రోడ్ల అభివృద్ధి తన సూచనల మేరకే జరిగిందని, వాజపేయికి ఈ విషయంలో సలహాలిచ్చింది తానేనని పేర్కొన్నారు.  చంద్రబాబు ఎన్‌డీఏని, నరేంద్రమోడీని ఎంత పొగిడినా.. మోడీ మాత్రం తన ప్రసంగంలో ఎక్కడా టీడీపీ పేరు కానీ, బాబు ఊసు కానీ ప్రస్తావించకపోవడం కొసమెరుపు!
Share this article :

0 comments: