ఇది పోలీసు ఆర్డర్ కాదు పోలిటికల్ ఆర్డర్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇది పోలీసు ఆర్డర్ కాదు పోలిటికల్ ఆర్డర్

ఇది పోలీసు ఆర్డర్ కాదు పోలిటికల్ ఆర్డర్

Written By news on Sunday, October 13, 2013 | 10/13/2013

https://www.facebook.com/ysrcpofficial

వైయస్ఆర్ సి‌పి ప్రెస్ మీట్ - Mysura Reddy alleges politics behind denial of permission to Samaikhya Meet..


వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 19న హైదరాబాద్ లో తలపెట్టిన సభకు అనుమతి నిరాకరించడానికి కారణాలు ఇవి అంటూ సెంట్రల్ జోన్ డీసీపీ ఇచ్చిన ఆర్డర్ ను చూస్తే పోలీసు ఆర్డరా లేక పోలిటికల్ ఆర్డరా అనే అభిప్రాయం కలుగుతుంది.సోనియా కి,ముఖ్యమంత్రికి ,రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టిన మంత్రులకి మరియు పోలీసులకి ఇష్టం లేకపోతే ప్రజానీకానికి ఉన్న హక్కుల్నే హరిస్తారా? రాష్ట్రంలో ఏమైనా ఎమెర్జెన్సీ విధించారా?లేక నియంతృత్వ పాలనలో ఉన్నామా ?

రాజ్యాంగంలో ప్రాధమిక హక్కులు చెప్తున్నది వ్యక్తి స్వేచ్చకీ ప్రభుత్వం రక్షణ కల్పించాలని మాత్రమే.మా అభిప్రాయాలతో విభేదించే వాళ్ళు ఈరాష్ట్ర రాజధానిలో సభ వద్దంటున్నారు కాబట్టి సభకు అనుమతి నిరాకరిస్తున్నాం అంటే దీన్ని ప్రభుత్వ అసమర్దత అనలా?లేక సమైఖ్య వాదులు ఇక మీదట నోరెత్తటానికి వీల్లేదనే నిరంకుశ ఆర్డర్ గా దీన్ని భావించాలా?ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా దేశంలో అందరూ ఈ దుర్మార్గమైన పోలీస్ ఆర్డర్ ను చదవాలి.

జూలై30,2013న కాంగ్రెస్ పార్టీ తీర్మానాన్ని ,అక్టోబర్3 న కేంద్ర క్యాబినెట్ నోట్ ఆమోదం పొందడాన్ని...తర్వాత విజయనగరంలో హింసాత్మక సంఘటనలు జరగడాన్ని ఆర్డర్లో ప్రస్తావించారు.రాష్ట్రం విడిపోతే తమ బతుకులు ఏమిటన్న ఆందోళనతో కోట్ల మంది రోడ్ల మీదకి వస్తే ఉద్యమం నడుస్తుందని గుర్తించడానికి ఇక్కడి పోలిటికల్ పోలీసులు సిద్దంగా లేరని ఈ ఆర్డర్ చూస్తే తెలుస్తుంది.శాంతి భద్రతల్ని కాపాడాల్సిన పోలీసులే శాంతిభద్రతలని సమస్యగా చూపడం విడ్డూరం.

"ప్రత్యేక తెలంగాణ విషయంలో వైయస్ఆర్ సిపి తన స్టాండ్ మార్చుకోవడాన్ని తెలంగాణాలోని జాక్ ,టి‌ఆర్‌ఎస్ , తెలంగాణ కాంగ్రెస్ నేతలు తప్పు పడుతున్నారు.." ఇది పోలీసు ఆర్డర్ లో మూడో పాయింట్ .వైయస్ఆర్ సిపి తన స్టాండ్ మార్చుకుందని రాజకీయనాయకులు ఆరోపిస్తే రాజకీయం అనుకోవచ్చు.సాక్ష్యాత్తు వెస్ట్ జోన్ డీసీపీ తన అభిప్రాయంగా ఈ మాట అంటున్నారంటే ఏంటి అర్ధం?

ఆగస్ట్11న నరేంద్రమోడీ సభకి ఇదే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది .రాష్ట్ర విభజనకి అనుకూలంగా ఉన్న బి‌జే‌పి కి హింస ,విద్వేషాలు పెరుగుతాయని ఈ పోలీసులను నియంత్రిస్తున్న ప్రభుత్వానికి అనిపించలేదా?అలాగే సెప్టెంబర్ 7న ఏపీ ఎన్‌జి‌ఓ లకు,సెప్టెంబర్ 29న టీజాక్ కు సభలకి అనుమతి ఇచ్చారు.ఆ సభల సమయంలో చెదురుమదురు సంఘటనలను అదుపు చెయ్యడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని చూపి అనుమతి ఇవ్వం అనడం ముఖ్యమంత్రి రాజకీయంలో బాగమే అనిపిస్తుంది. వీరందరికి హైదరాబాద్ రాష్ట్ర రాజధాని అని గుర్తులేదా???

రాష్ట్ర విభజన ఎలాగైనా జరిపి తీరాలన్న కాంగ్రెస్ వ్యూహంలో కిరణ్ కుమార్ రెడ్డి ఓ ఏజెంట్ గా మారారు.హైదరాబాద్ లో సమైక్య సభ పెడితే వచ్చే ప్రభంజనం డిల్లీ లో అన్నీ రాజకీయ పార్టీ లకు సందేశాన్ని ఇచ్చి పార్లమెంటేరియన్లను ఆలోచింపజేస్తుంది.
ప్రజాస్వామికంగా ,శాంతియుతంగా సభ జరపాలన్నదే మా అభిప్రాయం .రాష్ట్ర రాజధానిలో సమైక్యవాదులు సభ పెట్టుకోరాదని సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ పోలీసుల నుండే ఆర్డర్ రావడం అంటే ఈ రాష్ట్రం లో ప్రజాస్వామ్యం ఉన్నట్టా?ఈ రాష్ట్రంలో అత్యధిక తెలుగు ప్రజలకు తమ అభిప్రాయాలు వినిపించుకునే స్వేచ్ఛ లేదా? ఈ పోలిటికల్ పోలీసు ఆర్డర్ ను న్యాయస్దానంలో సవాలు చేస్తాం.రాజ్యాంగం ఇచ్చిన హక్కులతో సమైఖ్య శంఖారావాన్ని హైదరాబాద్ లో ప్రశాంతంగా నిర్వహిస్తాం.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాదా? లేక ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ విభజన అజెండాను అమలు చేయడానికి పని చేస్తున్న ఏజంటా?
హైదరాబాద్ లో ఎవరైనా తమ అభిప్రాయాలు తెలుపుకోవచ్చు. అందరి భావాలు ఒక రకంగా ఉండవు. భావాలు వేరుగా ఉండవచ్చు. భావాలు చెప్పుకోవడానికి సభ ఏర్పాటు చేసుకుంటుంటే విచ్ఛిన్నకర శక్తులు, విధ్వంసకారులు చొరబడతారని సాకులు చెప్పడం చాలా తప్పు అన్నారు. సమైక్యవాదిగా చెప్పుకునే ముఖ్యమంత్రికి ఇది తగునా?

పార్టీది మొదటి నుంచి ఒకటే అభిప్రాయం . మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే ఉద్దేశం . దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా మూడు ప్రాంతాల అభివృద్ధికి కృషి చేశారు. రాష్ట్ర ప్రజలు ఐకమత్యంగా ఉంటేనే రాష్ట్రం కూడా బలంగా ఉంటుంది- వైఎస్ఆర్ సిపి కేంద్ర పాలకమండలి సభ్యుడు మైసూరా రెడ్డి




Share this article :

0 comments: