ప్రమాదానికి గురైన బస్సు దివాకర్ రోడ్డు లైన్ పేరుతో రిజిస్టర్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రమాదానికి గురైన బస్సు దివాకర్ రోడ్డు లైన్ పేరుతో రిజిస్టర్

ప్రమాదానికి గురైన బస్సు దివాకర్ రోడ్డు లైన్ పేరుతో రిజిస్టర్

Written By news on Wednesday, October 30, 2013 | 10/30/2013

హైదరాబాద్ : మహబూబ్ నగర్ జిల్లాలో ప్రమాదానికి గురైన వోల్వో బస్సు జేసీ ట్రావెల్స్ పేరుతో రిజిస్టర్ అయినట్లు సమాచారం. AP 02  TA 0963 నెంబర్ గల బస్సు దివాకర్ రోడ్డు లైన్ పేరుతో అనంతపురంలో రిజిస్టర్ అయ్యింది. అయితే ఆర్టీఏ రికార్డుల్లో బస్సు స్టేటస్ ఇనాక్టివ్ గా ఉంది. జేసీ ట్రావెల్స్ పేరుతో రిజిస్ట్రర్ అయిన బస్సు....జబ్బర్ ట్రావెల్స్ పేరుతో ఎందుకు నడుస్తుందన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఈ ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై నివేదిక ఇవ్వాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు.

అనంతపురం : మహబూబ్ నగర్ జిల్లాలో ప్రమాదానికి గురైన వోల్వో బస్సుతో తమ ట్రావెల్స్ కు ఎలాంటి సంబంధం లేదని జేసీ ట్రావెల్స్ యాజమాన్యం స్పష్టం చేసింది. తాము రెండేళ్ల క్రితమే బస్సును అమ్మివేసినట్లు యాజమాన్యం బుధవారమికర్కడ తెలిపింది. జబ్బర్ ట్రావెల్స్ తో తమకు ఎలాంటి సంబంధం లేదని... అయితే టైటిల్ మార్చకపోవటం వల్లే తమ ట్రావెల్స్ పేరు ఉందన్నారు.

ప్రమాదం జరిగిన జబ్బార్‌ బస్సు  (AP 02  TA 0963) దివాకర్‌ ట్రావెల్స్‌ పేరిట రిజిస్ట్రేషన్‌ అయింది. అయితే ఈ బస్సును 2010 అక్టోబర్ లో విక్రయించినట్టుగా ఆర్టీఏ రికార్టులు చెబుతున్నాయి.
Share this article :

0 comments: