జగన్ ప్రసంగంలో హైలెట్స్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ ప్రసంగంలో హైలెట్స్

జగన్ ప్రసంగంలో హైలెట్స్

Written By news on Saturday, October 26, 2013 | 10/26/2013


రాష్ట్రం విభజించి.. ప్యాకేజిలిస్తే సరిపోతుందా?
హైదరాబాద్ : వర్షాలు, వరదల వల్ల నష్టం కలిగినా, సమైక్య శంఖారావం చేసి.. కలిసుందామని ఆప్యాయతను చూపిస్తూ, నినదిస్తూ లక్షలాదిగా తరలివచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, భారీ వర్షాలతో ప్రాణాలు కోల్పోయిన వారికి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళి అర్పించారు. కళ్లుండి కూడా కబోదుల్లా వ్యవహరించిన చంద్రబాబు, కిరణ్, సోనియాలకు విభజిస్తే రాష్ట్ర దుస్థితి అర్థం కావట్లేదా అని నిలదీశారు. సమావేశంలో జగన్ మధ్యలో ఓ చిన్న కథ కూడా చెప్పారు..
ఈమధ్య ఓ పుస్తకం చదివాను. ఆ పుస్తకంలో ఓ సన్నివేశం ఇలా ఉంటుంది.. హిట్లర్ నరమేధం సృష్టిస్తున్నప్పుడు మార్టిన్ నిమోనర్ రాసిన విధానం ఇది..

''ఆ నాజీలు.. హిట్లర్ సేనలు మొదట కమ్యూనిస్టుల కోసం వచ్చారు. నేను కమ్యూనిస్టును కాదుకదా, నాకోసం రాలేదని ఊరుకున్నాను. తర్వాత వాళ్లుసోషలిస్టుల కోసం వచ్చారు. అప్పుడూ ఊరుకున్నాను. తర్వాత వాళ్లు ట్రేడ్ యూనియనిస్టుల కోసం వచ్చారు. నాకు సంబంధించిన విషయం కాదుకదాని ఊరుకున్నాను. తర్వాత నాజీ సేనలు యూదుల కోసం వచ్చారు. అది కూడా నేను కాదుకదాని ఊరుకున్నాను. తర్వాత నాజీ సేవలు నా ఇంటి దాకా వచ్చారు.. నా కోసం వచ్చారు. వెనక్కి తిరిగి చూస్తే నా కోసం ఎవ్వరూ కనపడలేదు''

జగన్ ప్రసంగంలో హైలెట్స్
  • వైఎస్‌ జగన్‌ వేదికపైకి రాగానే ఈలలు, కేకలతో సభా ప్రాంగణంలో ప్రజల ఉత్సాహం
  • తెలుగుతల్లి, పొట్టి శ్రీరాములుచ బూర్గుల కృష్ణారావు చిత్రపటానికి జగన్‌ పుష్పాంజలి
  • వైఎస్‌ఆర్‌ విగ్రహానికి జగన్‌ నివాళి
  • వేదికపై నాయకులకు పేరు పేరునా పలకరించిన జగన్
  • సభాధ్యక్షుడు కొణతాల రామకృష్ణ ప్రారంభోపన్యాసం
  • తర్వాత వైఎస్సార్ సీపీ, సమైక్యవాదుల ప్రసంగాలు
  • ప్రసంగానికి ముందు శంఖం పూరించిన జననేత  
  • భారీ వర్షాలతో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళి అర్పించిన జగన్
  • వర్షాలు, వరదలను లెక్కచేయకుండా తరలివచ్చిన జనానికి జగన్ ధన్యవాదాలు
  • చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో నిజాయితీ కోసం ఆరాటపడుతున్న ప్రతి హృదయానికి సలాం చేస్తున్నా
  • రాజకీయ చదరంగంలో పావులం కాదు అన్యాయం చేస్తే ఊరుకోం
  • వందేమాతర గేయాన్ని, విప్లవ జెండాను అందుకుంటాం.. మిమ్నల్ని బంగాళాఖాతంలో కలిపేస్తాం
  • పేదవాడికి మేలు చేయడమే రాజకీయం
  • తినడానికి తిండి లేకపోయినా జీతాన్ని పక్కనపెట్టి అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఉద్యమబాట పట్టాడు పనివాడు
  • అక్కచెల్లెళ్లు చంటిబిడ్డలను పట్టుకుని రోడ్డుపైకి వచ్చి తమ బిడ్డల భవిష్యత్‌ ఏంటని ప్రశ్నిస్తూ ఉద్యమించారు
  • ఇంతమంది ఎందుకు ఉద్యమం చేస్తున్నారని రాష్ట్రాన్ని విభజించి తన కొడుకుని
  • ప్రధాని చేయాలనుకుంటున్న సోనియాకు తట్టలేదు
  • ప్యాకేజీ లు కోరుతున్న చంద్రబాబుకూ తట్టలేదు, మోసం చేస్తున్న సీఎం కిరణ్‌కు తట్టలేదు
  • ఈ నాయకులందరినీ నీళ్ల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నా
  • ఆల్మట్టి,నారాయణపూర్‌ నిండనిదే కిందకు నీళ్లు ఎలా వస్తాయని ప్రజలను మోసం చేస్తున్న ఈ ముగ్గురినీ ప్రశ్నిస్తున్నా
  • కర్ణాటక, తమిళనాడు ప్రతియేటా నీటి కోసం కొట్లాడుకుంటున్న పరిస్థితి తెలియదా?
  • ట్రిబ్యునళ్లు, బోర్డులు ఏం చేయగలిగాయో తెలియదా?
  • రాష్ట్ర విభజన జరిగితే శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు నీళ్లు ఎలా వస్తాయి?
  • మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రాజెక్ట్‌లకు ఎక్కడ నుంచి నీళ్లు ఇస్తారు?
  • నల్గొండ ఎస్‌ఎల్‌బీసీకి ఎక్కడ నుంచి నీళ్లు వస్తాయి?
  • గాలేరునగరి, హంద్రీనీవాలకు నీళ్లు ఎక్కడ నుంచి ఇస్తారు?
  • కృష్ణా ఆయకట్టులో రైతులు కొట్టుకునే పరిస్థితి రాదా అని ప్రశిస్తున్నా?
  • పోలవరం ప్రాజెక్ట్‌కు నీళ్లు ఎలా తీసుకొస్తారు?
  • కళ్లార్పకుండా ప్రజలను మోసం చేస్తున్న సోనియా, చంద్రబాబు, కిరణ్‌లు సమాధానం చెప్పాలి
  • హైదరాబాద్‌ను 10ఏళ్లలో విడిచి వెళ్లమంటున్నారు
  • చదువు పూర్తైన యువకులు సోనియా, బాబు, కిరణ్‌లను ఉద్యోగం కోసం కాలర్‌ పట్టుకుని అడిగితే ఏం సమాధానం చెబుతారు?
  • ఏ రాష్ట్రం బాగుపడాలన్నా మహానగరంలో సముద్ర తీరాలు ఒక్కటిగా ఉండాలి. అలా అయితేనే పెట్టుబడులు వస్తాయి.
  • వైఎస్‌ ఉన్నప్పుడు క్యాంపస్‌ ద్వారా ప్రతియేటా 50వేల ఉద్యోగాలు వచ్చేవి కానీ ఇప్పుడు ఆ సంఖ్య 25వేలకు మించడం లేదు.
  • దేశంలోనే హిందీ తర్వాత అతిపెద్ద జాతి తెలుగుజాతి
  • సోనియాకు ఆంధ్ర రాష్ట్ర చరిత్ర తెలుసా?
  • నాది వీర తెలంగాణే తప్ప.. వేరు తెలంగాణ కాదన్న రావి నారాయణరెడ్డి గురించి సోనియాకు తెలుసా
  • ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో ఎదురైన పరిస్థితి రేపు దేశంలో కూడా వస్తుందని హెచ్చరిస్తున్నా
  • తెలుగు జాతికి ద్రోహం చేస్తున్న సోనియా, చంద్రబాబు, కిరణ్‌లను క్షమించాలా?
  • 30 ఎంపీ స్థానాలను మనమే గెలుచుకుందాం.. ఢిల్లీ కోటను బద్దలు కొడదాం.. ఢిల్లీ రాజకీయాలను మనమే శాసిద్దాం
  • జై తెలుగు తల్లి, జై సమైక్యాంధ్ర, జై వైఎస్‌ఆర్‌ అంటూ ప్రసంగాన్ని ముగించిన జగ
    న్‌
Share this article :

0 comments: