మా బతుకు తీస్తే.. నీ అంతు చూస్తాం! బొత్సకు మహిళల శాపనార్ధాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మా బతుకు తీస్తే.. నీ అంతు చూస్తాం! బొత్సకు మహిళల శాపనార్ధాలు

మా బతుకు తీస్తే.. నీ అంతు చూస్తాం! బొత్సకు మహిళల శాపనార్ధాలు

Written By news on Monday, October 7, 2013 | 10/07/2013

మా బతుకు తీస్తే.. నీ అంతు చూస్తాం! బొత్సకు మహిళల శాపనార్ధాలు
సాక్షి, విజయనగరం: ‘బొత్సా...నువ్వు కోట్లు దోచుకున్నావ్‌... ఢిల్లీలో ఉంటావ్‌...నీ పిల్లల్ని మేడల్లో పెడతావ్‌...మీరంతా బాగుంటారు. మమ్మల్ని మాత్రం రోడ్డున పడేస్తావా? మా పేదోళ్ల పొట్ట కొడతావా? మా పిల్లలకి అన్యాయం చేస్తావా?... నీకు నిజాయితీ లేదు, మీసం, రోషం లేవు. నువ్విక్కడికొస్తే అంతు చూస్తాం’ అని విజయనగరంలోని కోట జంక్షన్‌లో పలువురు మహిళలు తొడగొడుతూ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు సవాల్‌ చేశారు. రావణ కాష్టంలా పట్టణం మండిపోతుంటే నువ్వెక్కడో దాక్కున్నావ్‌... రాష్ట్రం కోసం నిద్రాహారాలు మాని ఆందోళన చేస్తుంటే తప్పించుకుని తిరుగుతున్నావ్‌ అని మండిపడ్డారు. పదవుల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తావా? మా పిల్లల ఉసురు తీయిస్తావా అని ధ్వజమెత్తారు.
 
కాయకష్టం మీద బతికే మాలాటి వాళ్లంతా నష్టపోతున్నా పట్టించుకోవడం లేదు. ఎక్కడో దాక్కుని ఏవేవో మాట్లాడుతున్నావ్‌...ఇక్కడికొస్తే నీ సంగతి తేలుస్తాం అని హెచ్చరించారు. మీకంటే చీము రక్తం లేదు... మాకు తిండి లేకపోయినా రాష్ర్టం కోసం రక్తం చిందిస్తామంటూ బొత్సపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ఫ్యూ కారణంగా విజయనగరం పట్టణంలోని కోట జంక్షన్‌లోని బొంకులదిబ్బ వద్ద పండ్లు, కూరగాయలు విక్రయిస్తున్న మహిళలను అక్కడినుంచి వెళ్ళిపొమ్మని పోలీసులు హుకుం జారీ చేశారు. కొంతమంది పోలీసులు వారి దుకాణాలను బలవంతంగా తొలగించారు. ఈ సందర్బంగా కడుపుమండిన మహిళలు వారిపై తిరగబడ్డారు. ఆగ్రహంతో ఊగిపోతూ దీనికంతటికీ బొత్సే కారణమంటూ తిట్లు లంఘించుకున్నారు.
Share this article :

0 comments: