జగన్ కు సహకరించని కిరణ్, చంద్రబాబు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ కు సహకరించని కిరణ్, చంద్రబాబు

జగన్ కు సహకరించని కిరణ్, చంద్రబాబు

Written By news on Thursday, October 3, 2013 | 10/03/2013

జగన్ కు సహకరించని కిరణ్, చంద్రబాబు
రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి  సహకరించకపోవడంతో రాష్ట్ర విభజకు ఆ పార్టీ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. రాష్ట్రాన్ని విభజిస్తూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రి మండలి ఈ రోజు ఆమోదం తెలిపింది. సీమాంధ్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా వైఎస్ఆర్ సిపి ప్రజా ప్రతినిధులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. రాష్ట్ర విభజన ప్రతిపాదనకు నిరసనగా ఈ పార్టీ ఎమ్మెల్యేలే మొట్టమొదటిసారిగా రాజీనామాలు చేశారు. అందరినీ రాజీనామా చేయమని కోరారు. అందుకు కాంగ్రెస్, టిడిపి ఎమ్మెల్యేలు ముందుకు రాలేదు. వారు రాజీనామా చేయలేదు. అప్పుడే వారు రాజీనామా చేసి ఉంటే రాజ్యాంగ సంక్షోభం ఏర్పడి విభజన ప్రక్రియ ఆగి ఉండేది.

 విభజనకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకోమని ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ నుంచి ఎమ్మెల్యేల వరకు అందరూ కోరారు. ఆయన ఆ లేఖను వెనక్కు తీసుకోలేదు. రాష్ట్రాన్ని విభజించడానికే చంద్రబాబు ప్రాముఖ్యత ఇచ్చారు. పార్టీ వైఖరి స్పష్టంగా చెప్పకుండా, లేఖను వెనక్కు తీసుకోకుండా కాలం వెళ్లబుచ్చారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని ఎవరు లేఖరాసినా పార్టీ అధ్యక్షుడుగా తాను మొదటి సంతకం పెడతానని వైఎస్ జగన్మోహన రెడ్డి చెప్పారు. దానికి కూడా చంద్రబాబు నాయుడు ముందుకు రాలేదు. వైఎస్ఆర్ సిపితోపాటు సిపిఎం, ఎంఐఎం కూడా విభజనను వ్యతిరేకిస్తున్నాయి. వాటికి తోడు  ప్రధాన రాజకీయ పార్టీలు కలిసి లేఖ రాసినా కొంతవరకు విభజన ప్రక్రియ ఆగి ఉండేది.

ఇక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా వైఎస్ఆర్ సిపి సలహాను పాటించలేదు. శాసనసభను సమావేశపరచి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. కేంద్రం ఆమోదించిన తరువాత అటువంటి తీర్మానం చేసినా అంతగా ప్రయోజనం ఉండదని, ముందే తీర్మానం చేయాలని జగన్మోహన రెడ్డి కూడా కోరారు. శాసనసభను సమావేశపరచడానికి సిఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా సుముఖత వ్యక్తం చేయలేదు. ఆ విధంగా ఆయన కూడా విభజనను ఆపడానికి సహకరించలేదు.

రాష్ట్ర విభజనను ఆపడానికి వైఎస్ఆర్ సిపి చేసిన ప్రయత్నాలకు సీమాంధ్ర కాంగ్రెస్, టిడిపి ప్రజాప్రనిధులు సహకరించకపోవడంతో కేంద్రం రాష్ట్రాన్ని విభజిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన తరువాత వైఎస్ జగన్ చాలా ఉద్వేగాని లోనయ్యారు. ఆయనే మొదటిసారిగా స్పందించారు.  ఈ రోజు తనకు కలిగిన బాధ 16 నెలల జైలు జీవితంలో కూడా కలగలేదని చెప్పారు.  కాంగ్రెస్‌, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి కుమ్మక్కై రాష్ట్రాన్ని అమ్మేశారని బాధపడ్డారు.  విభజనకు నిరసనగా పార్టీ తరఫున 72 గంటల బంద్‌కు పిలుపు ఇచ్చారు.

ఇప్పటికైనా సీమాంధ్రకు చెందిన మొత్తం 25 మంది లోక్‌సభ్యులు రాజీనామా చేస్తే తద్వారా కేంద్రంలో ప్రభుత్వం పడిపోతుందని చెప్పారు. అప్పుడైనా ప్రక్రియ ఆగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రం నిర్ణయంపై కోర్టులను ఆశ్రయిస్తామని జగన్ చెప్పారు. ఉద్యమాన్ని ఉధృతం చేయాలని కూడా వైఎస్ఆర్ సిపి నిర్ణయించింది. ఇప్పటికైనా కాంగ్రెస్, టిడిపికి చెందిన సీమాంధ్ర  నేతలు జగన్ కు సహకరించి రాష్ట్రం విడిపోకుండా  సహకరిస్తారని ఆశిద్ధాం.
Share this article :

0 comments: